Telangana Assembly: అసెంబ్లీకీ గులాబీ బాస్.. తెలంగాణలో శీతాకాల సమావేశాల హీట్

Telangana Assembly: ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారును కడిగిపారేశారు. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో కౌంటర్ రాలేదు.

Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)శీతాకాల సమావేశాలకు సోమవారం నుంచే తెరలేవబోతోంది. మామూలుగా అయితే వీటిపై పెద్ద చర్చ ఉండదు. కానీ ఈ సారి అసెంబ్లీ(Telangana Assembly)కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్నట్టు వార్తలు వస్తుండడంతో సమావేశాలు హీట్ పెంచుతున్నాయి. గత వారం మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇప్పటి దాక ఒక లెక్క… ఇప్పటి నుంచీ మరో లెక్క అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారును కడిగిపారేశారు. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో కౌంటర్ రాలేదు. అయితే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. అదే అసెంబ్లీ(Telangana Assemblyలో మరోసారి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది. పనిలో పనిగా కేసీఆర్ కూడా సభకు వస్తే సమావేశాలు హాట్ హాట్ గా, హీట్ హీట్ గా సాగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీ (Telangana Assembly)సమావేశాలకు హాజరు కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బాత్ రూమ్ లో జారిపడడంతో చాలా రోజులు బెడ్ రెస్ట్ కే పరిమితమయ్యారు. 2024లోబడ్జెట్ సెషన్‌కు హాజరై కొద్దిసేపు మాత్రమే ఉన్నారు. తర్వాత ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి వచ్చారు. అప్పటి నుంచీ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరుకావడం లేదు.

Telangana Assembly

ఇప్పుడు గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలపై చర్చ జరగాలన్న డిమాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండడంతో కేసీఆర్ హాజరైతే ప్రతిపక్ష వాయిస్ ను బలంగా వినిపించే ఛాన్సుంటుంది. ఇటీవల పార్టీ సమావేశంలో కూడా నేతలకు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రజల తరపున బలంగా పోరాడదామంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం రెట్టింపయింది.

మరో 2 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయన్న సమాచారం నేపథ్యంలో గులాబీ పార్టీకి కొత్త జోష్ రావడం ఖాయం. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ టార్గెట్ అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ , ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేస్ వంటి అంశాలతో బీఆర్ఎస్ పై విరుచుకుపడేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ రాకతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు దద్దరిల్లే అవకాశముందని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version