Suicide: చీమల భయంతో యువతి ఆత్మహత్య..

Suicide: మనీషా కొంతకాలంగా మైర్మెకోఫోబియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతుందని, దీనికి కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించినా కూడా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు.

Suicide

సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్‌లో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. 25 ఏళ్ల మనీషా, తాను కొంతకాలంగా బాధపడుతున్న తీవ్రమైన చీమల భయం (Ant Phobia) కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide)చేసుకున్నారు. రకరకాల మానసిక ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నా కూడా, కేవలం చీమలంటే ఉన్న భయంతో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చని పోలీసులు పేర్కొంటున్నారు.

ఆమె ఆత్మహత్య(Suicide) చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోట్ తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆ నోట్‌బుక్‌లో, “శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు… కూతురు అన్వి జాగ్రత్త… అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మెుక్కులు తీర్చండని రాసి పెట్టింది. ఇదే మనీషా ఎంత మానసిక వేదనకు గురయిందో అన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మనీషా కొంతకాలంగా మైర్మెకోఫోబియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతుందని, దీనికి కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించినా కూడా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. నవంబర్ 4వ తేదీ సాయంత్రం భర్త శ్రీకాంత్ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూమ్ తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీకాంత్ చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టగా, మనీషా చీరతో ఉరి వేసుకుని కనిపించింది.

Suicide

అమీన్‌పూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా మనీషాకున్న చీమల భయాన్ని శాస్త్రీయంగా మైర్మెకోఫోబియా (Myrmecophobia) అని అంటారు. ఇది కేవలం మానసిక ఆందోళన మాత్రమే కాదు, ఒక రకమైన క్లినికల్ ఫోబియా. ఫోబియా అంటే ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా జంతువు పట్ల విపరీతమైన, అహేతుకమైన భయం. మైర్మెకోఫోబియాతో బాధపడేవారు చీమలను చూసినప్పుడు, వాటి గురించి ఆలోచించినప్పుడు లేదా మాట్లాడినప్పుడు కూడా తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతారు.

మైర్మెకోఫోబియా లక్షణాలు..గుండె వేగంగా కొట్టుకోవడం (Palpitations),విపరీతమైన చెమటలు పట్టడం,తీవ్రమైన వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఉక్కిరిబిక్కిరి కావడం, అధిక భయం, మరియు ఒంటరితనం ఈ లక్షణాల ద్వారా కలిగే మానసిక వేదన కారణంగా, ఆ వ్యక్తి తమ జీవితంలో అనేక సాధారణ కార్యకలాపాలను నిర్వహించలేక ఇబ్బందులు పడతారు.

ఫోబియా తీవ్రతరం అయినప్పుడు, దాని నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్య(Suicide) ఒక్కటే పరిష్కార మార్గమని భావించే ప్రమాదం ఉంది. మనీషా విషయంలో కూడా అదే జరిగింది.. ఆమె భయం, ఆమెను సాధారణ జీవితాన్ని గడపడానికి వీలు లేని విధంగా చేసిందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషాద ఘటన, మానసిక ఆరోగ్యం , ఫోబియాలకు చికిత్స ఎంతటి అత్యవసరమో మరోసారి నొక్కి చెప్పింది.

Ind vs Aus:నాలుగో టీ20లో కంగారూల బేజారు.. భారత్ ఘనవిజయం

Exit mobile version