Bigg Boss Weekend Episode
రియాలిటీ షోల హిస్టరీలోనే గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో కింగ్ నాగార్జున ఫైర్ అవడంతో పాటు హౌస్‌మేట్స్‌కి దిమ్మతిరిగే షాకులు ఇచ్చిన వీకెండ్ ఎపిసోడ్(Bigg Boss Weekend Episode) ఈసారి జరిగింది. నాగ్ గ్రాండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్ లోపల ఆయన వేసిన సీరియస్ క్లాస్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అరుపులు, సైగలు, లిప్ సింక్ బూతులు, ఎల్లో కార్డుల వార్నింగ్‌లతో నిండిన ఈ వీకెండ్ ఎపిసోడ్ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే ఓ రేంజ్‌లో అల్టిమేట్ హై-డ్రామాను అందించింది.
ఈ రచ్చ స్టార్ట్ అవ్వడానికి ముందు ఫ్రైడే హౌస్‌లో జరిగిన కొన్నిఇంపార్టెంట్ సీన్లను చూపించారు. మ్యాజిక్ పవర్‌ను సరిగ్గా వాడుకుని వర్షిణి కెప్టెన్ అవ్వగా.. వాష్‌రూమ్ ఎక్కువ సేపు వాడుకుందనే రీజన్‌తో అపూర్వపై త్రిగుణ్, ముకేశ్ గొడవపడ్డారు. వర్షిణి తనకు వచ్చిన రెండు గోల్డ్ కాయిన్స్‌ను కూడా సృష్టి, అమన్‌కు ఇచ్చేసింది. ఆ తర్వాత వెడ్డింగ్, రెట్రో, నైట్ పార్టీ థీమ్‌లలో జరిగిన కలర్‌ఫుల్ ర్యాంప్ వాక్ కాంపిటీషన్‌లో దేబ్జానీ, త్రిగుణ్, సృష్టి, నరేష్ టీమ్ విజయం సాధించింది.
ఈ సరదా టాస్క్ ఇలా కంప్లీట్ అవగానే నాగార్జున ఫైర్ బ్రాండ్ మోడ్‌లోకి మారిపోయారు. కన్ఫెషన్ రూమ్‌లో రోహిత్ సైలెంట్‌గా లిప్ సింక్‌తో మాట్లాడిన బూతుల వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకర్. బయటి విషయాలను మాట్లాడినందుకు అపూర్వను డిజాస్టర్ కెప్టెన్ అని తేల్చేశారు.
నామినేషన్లు డిస్కస్ చేయడం అలాగే హౌస్‌లో ఎక్కువగా నిద్రపోతుండటంపై రామ్ ప్రసాద్‌ను నిలదీయగా.. యాక్సిడెంట్ గాయాల వల్ల పడుకుంటున్నానని అతను క్లారిటీ ఇచ్చాడు. ఇక అరుస్తూ ప్రవర్తించిన షాలిని గేమ్‌పైన నాగ్ తప్పుపట్టారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ బూతులు తిడుతున్నందుకు అమన్‌కు, అలాగే గొడవలో అనుచిత కామెంట్లు చేసిన త్రిగుణ్‌కు ఎల్లో కార్డులు ఇస్తూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే అందరిలోకి మోస్ట్ సీరియస్ క్లాస్ మాత్రం రోహిత్ విషయంలో గట్టిగా జరిగింది. సౌండ్ లేకుండా కేవలం లిప్ సింక్‌తో బూతులు మాట్లాడటమే కాకుండా, బిగ్ బాస్‌ను ఉద్దేశించి ఏం పీకలేడనే మీనింగ్ వచ్చేలా సైగలు చేసిన వీడియోను నాగ్ అందరి ముందే ప్లే చేశారు. రోహిత్ బిహేవియర్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి ఏమాత్రం డిజర్వ్ కాదని, వెంటనే బయటకు వెళ్లిపోవాలని నాగ్ ఆర్డర్ వేశారు. దీంతో షాక్ తిన్న రోహిత్ ప్రాధేయపడుతూ సారీ కోరడంతో బిగ్ బాస్‌కు డైరెక్టుగా క్షమాపణ చెప్పించి, అతనికి కూడా ఎల్లో కార్డ్ ఇచ్చి గట్టి వార్నింగ్ జారీ చేశారు.
ఇతర పోటీదారుల్లో వర్షిణి, నరేష్, సృష్టి,ఝాన్సీ, సుధీర్‌తో పాటు ఇమ్యూనిటీ గెలుచుకున్న వంశీని నాగ్ అభినందించారు. కానీ రీ-ఎంట్రీ ఇచ్చినా ఏమీ చేయలేదని చరణ్‌కు మాత్రం బాగానే క్లాస్ పీకారు. మొత్తానికి ఒకే రోజు ఒక షోలో ముగ్గురికి ఎల్లో కార్డులు ఇస్తూ, ఇష్టమొచ్చినట్లు ఆడితే ఊరుకునేది లేదని నాగ్ హౌస్‌ను షేక్ చేయడంతో ఇంటి సభ్యులు వణికిపోయారనే చెప్పొచ్చు. ఈ సాటర్డే వీకెండ్(Bigg Boss Weekend Episode) రచ్చ ముగిసింది. అయితే ఆదివారం ఎలిమినేషన్ గండం ఎవరి మెడకు చుట్టుకోబోతుందో చూడాలి మరి.
