Little Hearts: కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన లిటిల్ హార్ట్స్..

Little Hearts: మౌళి తనుజ్, శివాని నగరం జంటగా నటించిన 'లిటిల్ హార్ట్స్' సినిమా అసాధారణ విజయాన్ని సాధించింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే రూ. 12.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Little Hearts

ఇటీవలి కాలంలో తెలుగు ఆడియన్స్ అభిరుచిలో చాలా మార్పు కనిపిస్తోంది. భారీ పాన్ ఇండియా సినిమాలు, పెద్ద హీరోల కటౌట్‌లు ఉన్నా కూడా, కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలను కూడా పెద్ద హిట్‌లుగా మార్చేస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్‌ను మాత్రమే చూస్తున్నారు, అందులో భాగంగానే మౌళి తనుజ్, శివాని నగరం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా అసాధారణ విజయాన్ని సాధించింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే రూ. 12.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

లిటిల్ హార్ట్స్’ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. 2015 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక కామెడీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం, ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయింది. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూ, కథలో లీనమైపోయేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వల్ల దీనికి అనూహ్యమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

Little Hearts

నిజానికి, ఈ సినిమాను మొదట ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, సినిమా అవుట్‌పుట్‌పై నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటికి ఉన్న నమ్మకంతో థియేట్రికల్ హక్కులను కోటి రూపాయలకు తిరిగి కొనుగోలు చేసి, మరో కోటి రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు. వారి నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. ఈ సినిమా మొదటి రోజునే రూ. 2.54 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు రూ. 4 కోట్లకు పైగా, మూడో రోజు రూ. 5 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ. 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, దాదాపు నాలుగు కోట్ల లాభాలను ఆర్జించింది.

‘లిటిల్ హార్ట్స్(Little Hearts)’ రిలీజ్ అయిన టైంలోనే అనుష్క నటించిన ‘ఘాటీ’, శివ కార్తికేయన్ సినిమా ‘మదరాసి’ లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో ఉన్నాయి. కానీ వాటిని క్రాస్ చేసి ఈ చిన్న సినిమా బిగ్ హిట్ కొట్టడం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక కొత్త సంకేతం పంపింది. ‘ఘాటీ’ మూడు రోజుల్లో కేవలం 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే, ‘లిటిల్ హార్ట్స్(Little Hearts)’ దానిని దాటి ముందుకు దూసుకెళ్లింది. ఈ సినిమాకు వస్తున్న ఆదరణతో, థియేటర్లలో షోలను కూడా పెంచారు. సెప్టెంబర్ 11 వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తంగా లిటిల్ హార్ట్స్(Little Hearts) విజయం ఒక విషయం మరోసారి నిరూపించింది. సినిమాకు భారీ బడ్జెట్, పెద్ద హీరోలు అవసరం లేదు, కథలో బలం ఉంటే చాలు. ప్రేక్షకులు కొత్త తరహా కథలను, మంచి కంటెంట్‌ను ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా రుజువు చేసింది.

Bigg Boss :బిగ్‌బాస్ 9 ఆట మొదలైంది..సెలబ్రిటీలతో కామనర్స్ పోటీ

Exit mobile version