Pawan Kalyan : పవన్ ఎంట్రీ వెనుక పెద్ద ప్లానే..ఇదంతా మోదీ వ్యూహమేనా ?

Pawan Kalyan : బీజేపీ ప్లాన్ తోనే పవన్ తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే… ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చంటూ బీజేపీ చెబుతోంది

Pawan Kalyan

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎంట్రీతో మొత్తం జనసేన చుట్టూనే తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ప్రొ.నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రచ్చ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన నిలబడడం వరకూ వచ్చింది.

అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్లాన్ తోనే పవన్ తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే… ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చంటూ బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకే పరిమితం కాలేదు కదా.. బీఆర్ఎస్ కూడా గతంలో ఏపీలో మీటింగ్స్ పెట్టలేదా అంటూ కొందరు మాట్లాడుతున్నారు.

అటు కేటీఆర్ కూడా పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పవన్ ను అడ్డుకుంటామని ఎవ్వరూ చెప్పలేదన్నారు. తెలంగాణపై పవన్ అక్కసుతో ఉన్నారనీ, గతంలో రాష్ట్రం విభజించిన తీరుపై ఆయన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేదేముందనీ, 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేసారు కదా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమన్న పవన్ వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తప్పుపట్టారు. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ గుజరాత్ కు తరలిస్తున్న ప్రధాని మోదీ చేస్తున్నదేమిటో చెప్పాలని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే మొత్తంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రెస్ మీట్ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల కోసం ఇదంతా బీజేపీ హైకమాండ్ వేసిన ప్రణాళిక లాగా ఉందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2028 తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Pawan Kalyan

ఏపీలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలో అమలు చేసేందుకు ప్లాన్ చేసారని భావిస్తున్నారు. ఇటీవల లోకేశ్ కూడా తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఇప్పుడు బీజేపీ కలిసొచ్చినా రాకున్నా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఏపీ పరిస్థితులతో పోలిస్తే తెలంగాణ పరిస్థితులు వేరు. ఆంధ్రా పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేనలతో తెలంగాణలో కలిసి పోటీ చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని కొందరు విశ్లేషిస్తున్నారు. అలా అని ఆ వ్యూహాన్ని పూర్తిగా కొట్టిపారేయడం లేదు. అయితే 2028 ఎన్నికల్లో మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుందన్నది మాత్రం స్పష్టమవుతోంది.

Chia Seeds : లెమన్, జింజర్, చియా గింజల మ్యాజిక్.. వెయిట్‌లాస్‌తో పాటు ఈ 2 లాభాలు కూడా..

Exit mobile version