Period Delay Pills : పీరియడ్స్ ఆపే టాబ్లెట్స్ వాడుతున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా?

Period Delay Pills : చాలామంది మహిళలు తమ పీరియడ్స్‌ను పోస్ట్‌పోన్ చేసుకోవడానికి మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకుని వాడుతుంటారు.

Period Delay Pills

ఇంట్లో ఏదైనా పూజలు, పెళ్లిళ్లు ఉన్నప్పుడు, లాంగ్ ట్రావెలింగ్ ప్లాన్స్ ఉన్నప్పుడు చాలామంది మహిళలు తమ పీరియడ్స్‌ను పోస్ట్‌పోన్ చేసుకోవడానికి మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకుని వాడుతుంటారు. ఈ టాబ్లెట్స్ వల్ల నెలసరి కొంతకాలం ఆగి అప్పటి ఇబ్బంది తప్పుతుంది.

అయితే ఈ టాబ్లెట్లు నోరెథిస్టెరాన్ (Norethisterone) వంటి హార్మోన్ల కాంబినేషన్లతో తయారయ్యే సింథటిక్ ప్రొజెస్టోజెన్ మెడిసిన్స్ కాబట్టి..వీటిని ఏదో ఎమెర్జెన్సీ పరిస్థితిలో ఒకసారి వాడటం ఓకే కానీ.. డాక్టర్‌ను సంప్రదించకుండా తరచూ వీటిని వాడితే బాడీపై దారుణమైన ఎఫెక్ట్ పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు ఈ టాబ్లెట్లను అస్సలు వాడకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాళ్లలో లేదా ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్‌ అయ్యే సమస్యలున్నవారు, గుండె జబ్బులు, పెరాలసిస్, లివర్ ట్యూమర్లు ఉన్నవారు మాత్రం ఈ టాబ్లెట్స్(Period Delay Pills) వాడితే ఒక్కోసారి వారి ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్లు, అకారణంగా యోని నుంచి రక్తస్రావం అయ్యేవాళ్లు, ప్రెగ్నెంట్ అని అనుమానం ఉన్నవాళ్లు ఇవి అస్సలు వాడకూడదు. మైగ్రేన్, హై బీపీ ఉన్నవాళ్లు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా లేకుండా ఈ టాబ్లెట్లను వేసుకోకూడదు.

బాడీలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పడిపోకుండా చూసి గర్భాశయ పొర ఊడకుండా ఈ టాబ్లెట్స్ ఆపుతాయి. సాధారణంగా నెలసరి రావలసిన డేట్‌కు 3 రోజుల ముందు నుంచి వీటిని వాడటం మొదలుపెడతారు. డాక్టర్ చెప్పినట్లుగా అప్పుడప్పుడు వాడితే సంతానోత్పత్తి , అండాల క్వాలిటీ దెబ్బతినదు కానీ, రెగ్యులర్ అలవాటుగా మార్చుకుంటే మాత్రం తీవ్రమైన హార్మోన్ల ఇమ్‌బ్యాలెన్స్, అన్-ప్రెడిక్టబుల్ బ్లీడింగ్ సమస్యలు వంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది.

Period Delay Pills

ఈ టాబ్లెట్స్ ఆపేసిన 2 నుంచి 4 రోజుల్లో పీరియడ్స్ వస్తాయి. అయితే వీటి ఎఫెక్ట్ వల్ల కడుపు ఉబ్బరం, తలనొప్పి, వికారం, మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. కానీ ఈ టాబ్లెట్స్(Period Delay Pills) వాడుతున్నప్పుడైనా, ఆపిన వెంటనే అయినా ఛాతీలో నొప్పి రావడం, ఊపిరి ఆడకపోవడం, దగ్గితే రక్తం పడటం, ఒక కాలు వాచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది బ్లడ్ క్లాట్ అయిన సంకేతం కాబట్టి వెంటనే డాక్టర్‌ను కలవాలి.

Perfect Tea : పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..

↑
Exit mobile version