Rosemary
వంటలకు కమ్మని సువాసన, అమోఘమైన టేస్ట్‌ను అందించే ఆకుకూరలనగానే మనందరికీ పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకులు మాత్రమే గుర్తొస్తాయి. అయితే, రోజ్ మేరీ(Rosemary) ఆకులలో కూడా ఈ అద్భుతమైన గుణాలు ఫుల్‌గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది రోజ్ మేరీ(Rosemary మొక్క ఆకులను కొత్తిమీరకు బదులుగా వంటకాల్లో వాడుతుంటారు. అందుకే ప్రస్తుత రోజుల్లో ఇది చాలామంది కిచెన్ గార్డెన్ లోనూ ఒక ముఖ్యమైన పార్ట్ అయింది. అయితే ఇలా వంటకాలకు ఎక్స్‌ట్రా టేస్ట్‌ను అందించడమే కాకుండా, దీనివల్ల ఇంట్లో , పెరట్లో బోలెడన్ని ఆశ్చర్యకరమైన ఉపయోగాలున్నాయి.
మన బాల్కనీ, పెరట్లోనూ పెంచే కాయగూర మొక్కలకు చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఆ మొక్కలకు దగ్గర్లో ఒక రోజ్ మేరీ మొక్కను నాటితే సరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఎందుకంటే, ఈ మొక్క నుంచి వచ్చే వాసన మనుషులకు ఎంతో పరిమళ భరితంగా అనిపిస్తుంది కానీ.. చీడపీడలకు కారణమయ్యే రకరకాల క్రిములు, పురుగులు ఈ వాసనను అస్సలు భరించలేవట. ముఖ్యంగా కాయగూరల మొక్కల మధ్యలో అక్కడక్కడా వీటిని నాటడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే బెడ్ రూమ్, కిచెన్ వార్డ్ రోబ్స్ లో చేరిన సిల్వర్ ఫిష్ వంటి చిన్నచిన్న పురుగులను తరిమికొట్టడంలో కూడా రోజ్ మేరీ చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం బాగా ఎండిపోయిన రోజ్ మేరీ ఆకులను బట్టల అల్మారాల మూలల్లో ఉంచడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
రోజ్ మేరీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా వైట్ వినెగర్‌లో కొన్ని నిమ్మతొక్కలు, కొన్ని రోజ్ మేరీ ఆకులను వేసి కాసేపు బాగా బాయిల్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే, ఇది ఒక మంచి నేచురల్ అయిన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
దీంతో ఇంట్లోని రకరకాల ఉపరితలాలను, కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లను క్లీన్ చేసుకోవచ్చు. కావాలంటే మరింత మంచి స్మెల్ కోసం దీనిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. చాలామంది ఇళ్లలో వేధించే బొద్దింకల బెడద నుంచి రిలీఫ్ పొందాలంటే ఎండబెట్టిన రోజ్ మేరీ ఆకులను కిచెన్ , రూమ్స్ లో అక్కడక్కడా వేసి ఉంచడం వల్ల అవి ఇళ్ల నుంచి పారిపోతాయి.
పండగలు, పార్టీలు వంటి స్పెషల్ అకేషన్స్ లో ఇంటి అలంకరణ కోసం కూడా ఈ ఆకులను చక్కగా ఉపయోగించుకోవచ్చు. రంగురంగుల పూలతో వీటిపి కలిపి ఇంటి గుమ్మాలు, పూజా మండపాన్ని డెకరేట్ చేసుకుంటే ఇంటికి కొత్త అందం వస్తుంది.
అలాగే నీళ్లు, కొద్దిగా నిమ్మరసం, రోజ్ మేరీ(Rosemary) ఆకులను ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద కాసేపు మరిగించాలి. ఆ సమయంలో వచ్చే ఆవిరుల వల్ల ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. రూమ్ ఫ్రెషనర్స్ వాడకుండానే ఇంటిని నేచురల్‌గా సువాసన భరితం చేస్తుంది.
చివరిగా, రోజ్ మేరీ ఆకులను ఎండబెట్టి పొడిచేసి తయారుచేసే హెర్బల్ శాషేలు, ఎండిన ఆకులు నింపిన గాజు జార్స్ వంటి వాటిని ఫ్రెండ్స్‌కు బహుమతులుగా కూడా ఇవ్వొచ్చు.
Richa Ghosh : సరిపోని రిచా ఘోష్ పోరాటం..ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
