Just SportsLatest News

Richa Ghosh : సరిపోని రిచా ఘోష్ పోరాటం..ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి

Richa Ghosh : రిచా ఘోష్ అద్భుతంగా పోరాడింది. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి చుక్కలు చూపించింది

Richa Ghosh

మహిళల టీ20 ప్రపంచకప్ రెండో వార్మప్ మ్యాచ్ లో భారత జట్టు పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఇంగ్లాండ్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. కీలక బ్యాటర్లు విఫలమవడం భారత్ ఓటమికి కారణమైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ మంచి స్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ అమీ జోన్స్ , కెప్టెన్ నాట్ స్కైవర్ బ్రంట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. మరో ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ నిరాశపరిచినా వీరి జోడీ మాత్రం అదరగొట్టింది. రెండో వికెట్ కు 70 పరుగులు జోడించింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరి దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు.

అమీ జోన్స్ 45 బంతుల్లో 64 (8 ఫోర్లు) ఔటవగా… బ్రంట్ 45 బంతుల్లో 57 (8 ఫోర్లు) పరుగులు చేసింది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకున్నారు. క్యాప్సీ(2), కెంప్ (7), డీన్ (0) ను త్వరగానే ఔట్ చేశారు. ఈ పరిస్థితుల్లో గిబ్సన్ దూకుడుగా ఆడి స్కోర్ పెంచింది. కేవలం 12 బంతుల్లోనే 30 (4 ఫోర్లు,1 సిక్సర్ ) పరుగులు చేసింది.

ఆమె ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ స్కోరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేయగలిగింది. ఎప్పటిలానే స్లాగ్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులిచ్చేయడం ప్రత్యర్థికి భారీస్కోరు అందించింది.

తర్వాత ఛేజింగ్ లో భారత్ తడబడింది. 18 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (1), షెఫాలీ వర్మ (13) నిరాశపరిచారు. తర్వాత యస్తిక భాటియా(15), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (17), భారతి ఫుల్మాలి (17) కూడా త్వరగానే ఔటయ్యారు. ఫలితంగా భారత మహిళల జట్టు 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.

Richa Ghosh
Richa Ghosh

ఇక భారత్ ఇన్నింగ్స్ ముగియడం లాంఛనమే అనుకున్న వేళ రిచా ఘోష్(Richa Ghosh) అద్భుతంగా పోరాడింది. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి చుక్కలు చూపించింది. రాధా యాదవ్ , శ్రీచరణిలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

చివరి ఓవర్లో విజయం కోసం 17 పరుగులు చేయాల్సి ఉండగా..వరుసగా ఫోర్ , సిక్సర్ బాదిన రిచా నాలుగో బౌంతికి స్టంపౌట్ అవడంతో భారత్ గెలుపు ముంగిట చతికిలపడినట్టయింది. రిచా 36 బంతుల్లో 68 (9 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3 , గిబ్సన్ 2 , డీన్ 2 వికెట్లు పడగొట్టారు.

NBK 111 : బాలయ్య బర్త్ డే బ్లాస్టర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న NBK 111 గ్లింప్స్

Related Articles

Back to top button