Sankranthi travel
సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఉండే ఆంధ్ర వాసులందరికీ తమతమ సొంతూళ్లకు వెళ్లాలనే (Sankranthi travel) ఆరాటం మొదలవుతుంది. అయితే ప్రతీసారి రైలు టికెట్లు దొరక్కపోవడం, ఒకవేళ దొరికినా సికింద్రాబాద్ , లింగంపల్లి వంటి ప్రధాన స్టేషన్లకు రద్దీలో వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది.
దీనికి భయపడే చాలామంది సొంతవాహనాలతో ఊళ్లు బయలుదేరుతుంటారు. అయితే అక్కడ గంటల గంటల ట్రాఫిక్ సమస్యతో ఊరు వెళ్లాలన్న ఉత్సాహం మధ్యలోనే చచ్చిపోతుంది అనేలా ఉంటున్నాయి . ప్రతీ ఏడాది ఇదే సమస్య ఎదురవడంతో ఊరు వెళ్లడానికి కూడా ఆలోచించేవాళ్లు పెరిగిపోతున్నారు.
దీంతో ఇలాంటి ఇబ్బందులను గమనించిన దక్షిణ మధ్య రైల్వే ఈసారి సంక్రాంతికి వెళ్లే(Sankranthi travel) ప్రయాణికులకు ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ , చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రత్యేక స్టాపింగ్‌లను ఏర్పాటు చేసింది. దీనివల్ల ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు , నగర శివారు ప్రజలకు చాలా టైమ్ సేవ్ అవుతుంది.
హైటెక్ సిటీ స్టేషన్ లో ఆగే రైళ్లలో మచిలీపట్నం-బీదర్, నర్సాపూర్-లింగంపల్లి, జన్మభూమి, గౌతమి ఎక్స్‌ప్రెస్ వంటి కీలక రైళ్లు ఉన్నాయి. అలాగే చర్లపల్లి స్టేషన్ లో సింహపురి, గరీభ్‌రథ్, విశాఖ, గోదావరి , పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి.
సాధారణంగా ఊరెళ్లాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించి సికింద్రాబాద్, లింగంపల్లి, కాచీగూడ వంటి మెయిన్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఈ నిర్ణయంతో ప్రయాణికులకు తమ నివాసాలకు చేరువలోనే రైలు ఎక్కే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు.
అయితే ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా, ప్రతీ పండుగకు ఎదురయ్యే బెర్తుల కొరత మరియు వెయిటింగ్ లిస్ట్ సమస్యలు ఈసారైనా తగ్గుతాయా అనేది చూడాలి. ఏదేమైనా రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే విషయమే.
Chiru, Venky:ఒకే స్టేజీపై చిరు,వెంకీ,నయనతార..ఈ మెగా ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు?
