Latest Newsjust Analysis

Sankranthi travel : సంక్రాంతి ప్రయాణం ఇక కూల్ .. లింగంపల్లి, సికింద్రాబాద్ వెళ్లాల్సిన పనేలేదు

Sankranthi travel :హైటెక్ సిటీ స్టేషన్ లో ఆగే రైళ్లలో మచిలీపట్నం-బీదర్, నర్సాపూర్-లింగంపల్లి, జన్మభూమి, గౌతమి ఎక్స్‌ప్రెస్ వంటి కీలక రైళ్లు ఉన్నాయి.

Sankranthi travel

సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో ఉండే ఆంధ్ర వాసులందరికీ తమతమ సొంతూళ్లకు వెళ్లాలనే (Sankranthi travel) ఆరాటం మొదలవుతుంది. అయితే ప్రతీసారి రైలు టికెట్లు దొరక్కపోవడం, ఒకవేళ దొరికినా సికింద్రాబాద్ , లింగంపల్లి వంటి ప్రధాన స్టేషన్లకు రద్దీలో వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది.

దీనికి భయపడే చాలామంది సొంతవాహనాలతో ఊళ్లు బయలుదేరుతుంటారు. అయితే అక్కడ గంటల గంటల ట్రాఫిక్ సమస్యతో ఊరు వెళ్లాలన్న ఉత్సాహం మధ్యలోనే చచ్చిపోతుంది అనేలా ఉంటున్నాయి . ప్రతీ ఏడాది ఇదే సమస్య ఎదురవడంతో ఊరు వెళ్లడానికి కూడా ఆలోచించేవాళ్లు పెరిగిపోతున్నారు.

Sankranthi travel
Sankranthi travel

దీంతో ఇలాంటి ఇబ్బందులను గమనించిన దక్షిణ మధ్య రైల్వే ఈసారి సంక్రాంతికి వెళ్లే(Sankranthi travel) ప్రయాణికులకు ఒక సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ , చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రత్యేక స్టాపింగ్‌లను ఏర్పాటు చేసింది. దీనివల్ల ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు , నగర శివారు ప్రజలకు చాలా టైమ్ సేవ్ అవుతుంది.

హైటెక్ సిటీ స్టేషన్ లో ఆగే రైళ్లలో మచిలీపట్నం-బీదర్, నర్సాపూర్-లింగంపల్లి, జన్మభూమి, గౌతమి ఎక్స్‌ప్రెస్ వంటి కీలక రైళ్లు ఉన్నాయి. అలాగే చర్లపల్లి స్టేషన్ లో సింహపురి, గరీభ్‌రథ్, విశాఖ, గోదావరి , పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి.

సాధారణంగా ఊరెళ్లాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించి సికింద్రాబాద్, లింగంపల్లి, కాచీగూడ వంటి మెయిన్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఈ నిర్ణయంతో ప్రయాణికులకు తమ నివాసాలకు చేరువలోనే రైలు ఎక్కే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు.

అయితే ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా, ప్రతీ పండుగకు ఎదురయ్యే బెర్తుల కొరత మరియు వెయిటింగ్ లిస్ట్ సమస్యలు ఈసారైనా తగ్గుతాయా అనేది చూడాలి. ఏదేమైనా రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చే విషయమే.

Chiru, Venky:ఒకే స్టేజీపై చిరు,వెంకీ,నయనతార..ఈ మెగా ఈవెంట్‌ ఎక్కడ? ఎప్పుడు?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button