Yellow Alert
రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్‌డేట్ ఇచ్చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. పగటిపూట భానుడి ప్రతాపంతో సెగలు రేగుతున్నా.. సాయంత్రం లేదా రాత్రి సమయాలలో ఒక్కసారిగా మేఘాలు ఆవరించి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ వాసులు రాబోయే 2 రోజులు కాస్త అలర్ట్‌గా ఉండాలి. మధ్యాహ్నం వరకు కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉక్కపోతతో ఊపిరి సలపనివ్వకపోయినా, సాయంత్రమయ్యేసరికి సిటీలో వాతావరణం చల్లబడి వర్షం పడే అవకాశాలున్నాయి. మార్నింగ్ డ్యూటీలు ముగించుకుని ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగొచ్చే పీక్ అవర్స్‌లోనే ఈ వర్షాలు పడే అవకావం ఉండటంతో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్ సమస్యలుకూడా తలెత్తొచ్చు. అందుకే వాహనదారులు, రోడ్లపై వెళ్లే జనాలు ఆలోచించి బయటకు రావడం మంచిది.
పరిస్థితి తీవ్రతను బట్టి తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం కూడా ఉంది. ఓపెన్ ప్లేసుల్లో నిలబడటం, లేదా చెట్లు, హోర్డింగ్స్ కింద ఆశ్రయం పొందడం అస్సలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఓపెన్ యార్డుల్లో ధాన్యం ఆరబెట్టిన రైతులంతా తమ పంట తడిసిపోకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఎలక్ట్రిక్ వైర్లు,కరెంట్ స్తంభాల పట్ల కూడా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఏ చిన్న అత్యవసర పరిస్థితి వచ్చినా ఆదుకోవడానికి జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ టీమ్స్ ఫీల్డ్‌లో అలర్ట్(Yellow Alert)గా ఉన్నట్లు తెలిపారు.
Theft At Relatives Homes : బంధువులు,స్నేహితుల ఇంట్లో చేతివాటం..ఈ అలవాటుపై సైకాలజీ చెప్పే నిజాలేంటి..
