Oxidized Jewellery
కాలానికి తగ్గట్టుగా ఫ్యాషన్ ట్రెండ్స్ ఎంత మారుతున్నా, ఎప్పటికీ క్రేజ్ తగ్గని ఆభరణాలలో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ (Oxidized Jewellery) ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్ ,ఫ్యాషన్ లవర్స్ సాంప్రదాయ వెస్ట్రన్ దుస్తులపైకి ఈ తరహా యాంటిక్ నగలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
విలాసవంతమైన లుక్ ఇస్తూ, జర్మన్ సిల్వర్ స్టైల్‌లో మెరిసిపోయే ఈ ఆభరణాలు చాలా తక్కువ బడ్జెట్‌లో, అద్భుతమైన క్వాలిటీతో చాలా చోట్ల దొరుకుతాయి. అయితే చాలా తక్కువ ధరలో ప్లేస్ మాత్రం దేశ రాజధాని ఢిల్లీలోని.. ప్రముఖ కానాట్ ప్లేస్ దగ్గరలో ఉండే జన్‌పథ్ మార్కెట్ (Janpath Market) దీనికి పర్ఫెక్ట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
జన్‌పథ్ మార్కెట్ అంటేనే షాపింగ్ ప్రియులకు ఒక స్వర్గధామంలాంటి ప్రాంతం.ఈ జన్‌పథ్ మార్కెట్ లోపల ఉండే గుజరాతీ లేన్ (Gujarati Lane) లో అడుగుపెడితే రంగురంగుల ఎంబ్రాయిడరీ దుస్తులు, చేతితో చేసిన క్రాఫ్ట్ బ్యాగులు, కుండలతో చేసిన కళాకృతులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఈ వీధిలో అందరినీ ఇట్టే ఆకర్షించేవి మాత్రం ఇక్కడి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ (Oxidized Jewellery) స్టాల్స్.
ఈ మార్కెట్‌లో లభించే జ్యువెలరీ ధరలు సామాన్యులను కూడా ఆశ్చర్యపరుస్తాయి. నిత్యం కాలేజీలకు, ఆఫీసులకు వేసుకునే చిన్న, పెద్ద సైజు ఆక్సిడైజ్డ్(Oxidized Jewellery )ఇయర్‌రింగ్స్ , ట్రెండీ జుంకాలు ఇక్కడ కేవలం రూ. 30 నుంచి రూ. 50 ప్రారంభ ధరలోనే దొరుకుతాయి. బయటి పెద్ద పెద్ద మాల్స్ లేదా ఆన్‌లైన్ స్టోర్స్‌లో రూ. 200 నుంచి రూ. 300 వరకు పలికే హెవీ డిజైనర్ జుంకాలు ఇక్కడ ఈజీగా యాభై, వంద రూపాయల లోపే సొంతం చేసుకోవచ్చు.
ఇక నెక్లెస్‌లు,చోకర్ల విషయానికి వస్తే, మల్టీకలర్ స్టోన్స్ , ట్రైబల్ (Tribal) కల్చర్ ప్రతిబింబించేలా ఉండే హెవీ నెక్ సెట్స్ ధరలు అయితే ఇక్కడ రూ. 150 నుంచి ప్రారంభమై రూ. 300 లోపే ఉంటాయి. కేవలం కమ్మలు, హారాలు మాత్రమే కాకుండా యాంటిక్ శైలికి చెందిన అందమైన పట్టీలు (యాంక్లెట్స్), బ్రాస్‌లెట్స్, రకరకాల ఫింగర్ రింగ్స్ కూడా ఇక్కడ కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ వెరైటీలను వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవాలనుకునే వారికి ఈ మార్కెట్ ఒక బెస్ట్ షాపింగ్ స్పాట్‌గా పేరు బడింది.
అయితే జన్‌పథ్ మార్కెట్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. దీనికోసం బేరమాడటం (Bargaining Skill) అనేది అందరూ తప్పకుండా చేయాల్సిందే. ఇక్కడి వ్యాపారులు టూరిస్టులను చూసి ముందు కాస్త ఎక్కువ ధరలు చెప్పినా, మనం బేరమాడే విధానాన్ని బట్టి వారు చెప్పిన ధరలో సగానికి సగం ధరకు కూడా ఈ నగలను దక్కించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఢిల్లీ పర్యటనకు వెళ్లినపుడు ..ఫ్యాషన్ లవర్స్ ఎవరైనా సరికొత్త యాంటిక్ కలెక్షన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే సొంతం చేసుకోవాలంటే మాత్రం.. జన్‌పథ్ మార్కెట్‌కు వెళ్లడం అస్సలు మిస్ చేయొద్దు.
SRH vs CSK : గెలుపు బాట పట్టేదెవరు ?..చెపాక్ లో చెన్నై, సన్ రైజర్స్ ఢీ
