Vaibhav
13 ఏళ్లకే దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు.. ఆ పై ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు.. ఇంకేముంది టీమిండియాలోకి తీసుకోవాలంటూ జోరుగా డిమాండ్లు.. తీరా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా వరుసగా మూడు వైఫల్యాలు.. ఇప్పుడు బీసీసీఐపైనే విమర్శలు.. ఇదీ వైభవ్ సూర్యవంశీ విషయంలో భారత క్రికెట్ బోర్డు ఎదుర్కొంటున్న పరిస్థితి.
ఇక్కడ వైభవ్(Vaibhav) టాలెంట్‌ను ఏ మాత్రం తక్కువ చేసి చెప్పలేం. అదే సమయంలో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు సన్నద్ధంగా ఉన్నాడా.. విదేశీ పిచ్‌లపై ఇదే ఫామ్ కొనసాగించగలడా.. ఒకవేళ ఫెయిలయితే పరిస్థితి ఏంటి.. అతని మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని బీసీసీఐ ఎందుకు గ్రహించలేకపోయిందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది.
ఇక్కడ వైభవ్ వైఫల్యాలకు కారణాలను చూస్తే రెండు విషయాలను చెప్పుకోవాలి. మొదటిది ఐపీఎల్ తరహా ఆట అన్ని వేళలా, అన్ని పిచ్‌లపై పనికి రాదు. ఎందుకంటే ఐపీఎల్ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్. అభిమానులను అలరించడానికి పూర్తిగా ఫ్లాట్ పిచ్‌లనే రూపొందిస్తారు. ఆ పిచ్‌లపై ఏ బ్యాటర్ అయినా దంచికొట్టొచ్చు.
అందులోనూ ఓపెనర్‌గా వచ్చే ఆటగాడికి పవర్ ప్లే సౌలభ్యం కూడా ఉంటుంది. అదే విదేశీ పిచ్‌లపై ముఖ్యంగా ఇంగ్లీష్ కండీషన్స్‌లో ఎక్స్ ట్రా బౌన్స్‌కు సహకరించే పిచ్‌లపై ఆ దూకుడు అస్సలు పనికిరాదు. ఒకవేళ ఆడాలని ప్రయత్నిస్తే వికెట్ సమర్పించుకోవాల్సిందే. వైభవ్ విషయంలోనూ ఇదే జరిగింది.
దీంతో వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ తొందరపడిందనే విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఐపీఎల్‌లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ల ఆధారంగానే అతడికి జాతీయ జట్టులో పిన్న వయస్కుడిగా చోటు దక్కింది.
ఎంపిక చేసిన తర్వాత వెంటనే తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా, కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడే అవకాశం ఇస్తామని బోర్డు స్పష్టం చేయడంతో, ముందుగానే ఎంపిక చేసి వృథా చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది.
తుది జట్టులో ఆడిన తొలి సిరీస్‌లో (ఇంగ్లాండ్‌తో) అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అంతర్జాతీయ స్థాయికి , దేశవాళీ స్థాయికి ఉన్న తేడాను గ్రహించి, అతడికి మరింత ఫస్ట్ క్లాస్ అనుభవం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల ‘ఇండియా-ఎ’ తరఫున శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగి వివాదంలో చిక్కుకున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని, ప్రవర్తనా నియమావళిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు.
అన్ని పిచ్‌లపై పరిస్థితులకు తగ్గట్టు ఆడేలా వైభవ్(Vaibhav)ను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత బీసీసీఐదే. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లో వైభవ్‌కు ఈ విషయంలో మరింత శిక్షణ ఇచ్చేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
S.Janaki : భారత సంగీత లోకంలో విషాదం.. లెజెండరీ సింగర్ ఎస్ .జానకి కన్నుమూత
