Vitamin D
భారత దేశంలో ఏడాది పొడవునా ఎండలు దంచికొడుతున్నా కూడా, విటమిన్ D పరీక్ష చేయించుకున్న ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఈ విటమిన్ లోపమే బయటపడుతోంది. బోన్స్ బలం, మజిల్స్, ఇమ్యూనిటీకి అత్యంత కీలకమైన ఈ విటమిన్ డి అంత ఎండ ఉన్నా భారతీయులకు దక్కట్లేదో తెలుసుకోవాలంటే మన డైలీ రొటీన్‌లో చేసే తప్పులు చూడాల్సిందే అంటున్నారు డాక్టర్లు.
మొదటిది మనందరి ఏసీ రూమ్‌ల జీవితాలు. రోజంతా ఆఫీసుల్లో, ఇంట్లోనూ ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల ముందే గడపడం వల్ల మనుషులకు అసలు ఎండ తగలడం లేదు.
రెండోది, విటమిన్ D తయారవ్వడానికి సూర్యుడి నుంచి వచ్చే యూవీబీ (UVB) కిరణాలు డైరెక్టుగా స్కిన్‌ను తాకాలి. ఒంటి నిండా బట్టలు కప్పుకోవడం, నీడలోనే ఎక్కువగా ఉండటం వల్ల ఈ కిరణాలు మన చర్మానికి చేరవు.
మూడోది, ఇండియన్స్ చర్మంలో మెలనిన్ శాతం చాలా ఎక్కువ. ఇది యూవీబీ కిరణాలను కొంతవరకు బ్లాక్ చేసేస్తుంది, అందుకే ఇతర దేశాలలో ఉన్న వారితో పోలిస్తే భారతీయులకు విటమిన్ D తయారవ్వడానికి ఎక్కువ టైమ్ ఎండలో ఉండాల్సి వస్తుంది.
నాలుగోది ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేసే టైమ్‌లో వచ్చే లేత ఎండలో UVB ఒంటికి పట్టినా కూడా అప్పుడు వాటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. నడి మధ్యాహ్నపు ఎండలోనే ఇవి ఎక్కువగా ఉన్నా కూడా, ఆ సమయంలో బయట తిరగడం చాలా కష్టం.
ఐదోది సిటీల్లో పెరిగిపోయిన పొగ, పొల్యూషన్ వల్ల సూర్యకిరణాలు డైరెక్టుగా చర్మాన్ని తాకకుండా అడ్డుకుంటున్నాయి. విటమిన్ D తగ్గితే కాల్షియాన్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. దీంతోనే ఎముకలు గుల్లబారడం, తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు వస్తాయి.
అయితే ఎప్పుడూ కూడా నీరసంగా అనిపిస్తే మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్లు కొని వేసుకోకుండా.. డాక్టర్‌ని కలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకుని సప్లిమెంట్లు వాడటమే మంచిదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..
