Kids : మారాం చేసే పిల్లలను దారిలోకి తెచ్చుకునే మార్గాలు

Kids : పిల్లలను పెంచడం అనేది ఒక కళ. వారు తల్లిదండ్రులు చెప్పే మాట వినాలంటే...

Kids

పిల్లలను పెంచడం అనేది ఒక కళ. వారు తల్లిదండ్రులు చెప్పే మాట వినాలంటే, కేవలం బెదిరించడమో, శిక్షించడమో పరిష్కారం కాదు. శిక్షించడం వల్ల పిల్లలు మరింత మొండిగా తయారవుతారు. బదులుగా, తల్లిదండ్రులు తెలివిగా, సరైన పద్ధతిలో పిల్లలను దారిలో పెట్టాలి. ఈ విషయంలో పిల్లల మానసిక నిపుణులు కొన్ని విలువైన సలహాలు ఇస్తున్నారు.

పిల్లలతో ఎలా మాట్లాడాలంటే..

ఆర్డర్లు వేయొద్దు : “ఇప్పుడు హోమ్‌వర్క్ చేయి”, “ఇప్పుడే అన్నం తిను” అని ఆదేశాలు ఇవ్వడం మానేయాలి. బదులుగా, వారికి ఎంపికలు ఇవ్వాలి. “హోమ్‌వర్క్ ఇప్పుడు చేస్తావా, లేక కాసేపయ్యాక చేస్తావా?” అని అడగాలి. దీనివల్ల వారు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

kids

వారిని గౌరవించండి: పెద్దలను గౌరవించినట్లే, పిల్లల(kids)ను కూడా గౌరవించాలి. మీరు చెప్పింది వారు వినాలని మీరు అనుకున్నట్లే, వారు చెప్పేది మీరు వినాలని పిల్లలు కూడా అనుకుంటారు. వారు చెప్పేది ఓపికగా వినడం అలవాటు చేసుకుంటే, వారు కూడా మీ మాట వింటారు.

సూటిగా, తక్కువ మాటల్లో చెప్పాలి: పిల్లలకు ఏదైనా చెప్పేటప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకుండా, సూటిగా, తక్కువ మాటల్లో చెప్పాలి. సుదీర్ఘమైన మాటలు వారికి విసుగు తెప్పిస్తాయి, వారు వాటిని పట్టించుకోరు. ఉదాహరణకు, “నువ్వు అల్లరి చేయడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు” అని చెప్పకుండా, “అల్లరి చేయకు” అని స్పష్టంగా చెప్పాలి. ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి వివరణ ఇవ్వాలి.

kids

బుజ్జగించే మాటలు వద్దు: పిల్లలతో ఏదైనా సీరియస్‌గా వర్క్ చేయించాలని అనుకున్నప్పుడు ‘చిన్ని’, ‘నాని’, ‘బుజ్జి’ వంటి ప్రేమతో కూడిన పదాలను ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఇలాంటి పదాలు వాడినప్పుడు, తల్లిదండ్రులు సరదాగా చెబుతున్నారని పిల్లలు భావిస్తారు. ఏదైనా పని చెప్పేటప్పుడు వారి పేరును పిలిచి..తర్వాత “హోమ్‌వర్క్ చేయి”, “ఆటలు ఆపు” వంటి సూటి పదాలను వాడాలి. అప్పుడే వారు ఆ పనిని సీరియస్‌గా తీసుకుంటారు.

ఈ పద్ధతులు పాటించడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినడమే కాకుండా, బాధ్యత గల వ్యక్తులుగా కూడా ఎదుగుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Also Read: Literature : అదే నేల… అదే గాలి…

Exit mobile version