
Literature :
ఏమిస్తున్నావు..?
నీ తరువాత తరానికి..
కూడేసిన ధనమా?
కట్టేసిన భవనమా?
నీరు లేక బీటలేసిన భూమి
గూడు లేక గతిస్తున్న ప్రాణి
తరువు తెగి మోడు తేలిన వనం
కాలం తప్పి వీస్తున్న పవనం
చేతులారా మోసుకొచ్చిన ఆపద
ఇదేనా నువ్వందించే వారసత్వ సంపద?
మేటేసిన ఇసుక దిబ్బలు
కోటలకై పోయాయి..
కొట్టేసిన తరువు ముక్కలు
ఇంటిలో ఒదిగిపోయాయి..
ద్రవ్యం దాహాన్ని తీర్చగలదా?
భవనం చిగురించగలదా?
పుష్పాల సుగంధం పొగచూరుకుంది
పక్షులతో చెట్టుబంధం తెగిపోయింది!
చినుకు రాల్చని ఆకాశాన్ని చూస్తూ
విత్తనాలు భూమిలో వట్టిపోతున్నాయి!
గాలి మూలిగిన జాడలలో
నీ వారసత్వం ఊపిరి వెతుకుతాది..!
కొండలలో ధూళి మేఘాలు
వాన చినుకుల్లో విషం
నీ అడుగుల జాడలు చూస్తే
కానలలో ఎడారి అగుపిస్తాది!
ఏటి పాయలలో ఇంకిన నీరు
కంటి లోపల ఊరుతాది..!
అదే నేల… అదే గాలి…
కానీ నీ తరం వాసన
పెనుభూతంలా వెంటాడుతుంది
నీ నిర్లక్ష్యం — తరువాత శ్వాసలో…
అయినా ఆశిస్తున్నాం —
ఒక రోజు…నువ్వు మేల్కొంటావని!
అప్పుడు చెప్పు..
నీ తరువాత తరానికి
ఏమిస్తున్నావో..!
– ఫణి మండల
8555988435
Exactly
Super tammudu
Superr
Nice
“Each stanza carries a depth of meaning that touches the soul.”
Nice👏😍
అద్భుతంగా ఉంది బ్రదర్
Pure truth, 100% needed to hear this generation
Nice writings, hard hitting truth
చాలా స్ఫూర్తివంతంగా ఉన్నది.. ప్రతి ఒక్కరూ మరొకరికి షేర్ చేసి చైతన్యం చేయాల్సిందే
Super it is truth
Excellent
భవిష్యత్తు కోసం …వర్తమానాన్ని ఆలోచింపచేసే సాహిత్యం…బాగుంది సర్
Nice poetry
ఒక మనిషిని మేల్కొలపడానికి, తాను ఇప్పటి వరకు ఏమిచేసినా, చేయకపోయినా ఇకపై ఏదోఒకటి చేయాలనే ఆలోచన కలిగించేలా ఉన్న ఈ మాటలు ఇప్పటి తరానికి చాలా బలంగా అవసరం… దీనిని కవిత అనాలో, లేక ఆవేదన అనాలో లేక మరేదైనా అనాలో తెలీదుకానీ ఇది మాత్రం చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలి.. ఈ బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలి..
Very nice literature brother….simple ,influential and thought provoking…
Nice 👌👌
Super..
బాగుంది.మరొక్కసారి మన బాధ్యతను గుర్తుకు తెచ్చింది.
Wonderful
నీ కవితలు సమాజంలో మంచి మార్పు తేసుకురావాలి అని కోరుతున్నాను.
Nice 👌👌
Super sir….
Its true….
Nice
ఫణిగారు…
Excellent….
మీ హెచ్చరిక మనకే…
చదివేసి వదిలేస్తే ఇంతే..
మనగతి ఇంతే…
తరువాత తరం దిగజారుడు కొండంతే..
మార్చగలిగే సత్తా మనకులేదంతే..
ఊబిలో చిక్కుకున్నాక ఏమీచేయలేమంతే..
ఈ తరం నిర్లక్ష్యపు వాసన దుర్వాసనగా మారి, చతికిలబడి స్వార్ధపు చింతనకు అలవాటుగా మారాక ఇంకేం చేయగలం!!
చదివి మేల్కొనేలోపే మరచి మామూలైపోతున్నాం. మరో కొత్త సందేశం చదివి క్షణకాలం తాత్కాలిక సంతోషం పొంది చతికిలబడిపోతున్నాం..
ఇక మారేదెప్పుడో!!
చూడాలి…
వేచి చూడ్డమే మిగులుతుంది….
Very nice
nallapurajumeghanasrisantoshi@gmail.com
నేను నీవైన వేళ
అదేనీవు…అదేనేను.
నీవు తెలుగు తనపు పారవశ్యపు పరిమళం …
నేను తెల్గు తనపు పర వశంతో వాసం.
నువు ఆ అమృత భాషా సాహిత్యంతో సహవాసం…
నేను ఆ మృత భాషా శకలాలతో ఆవాసం.
నీవు పూర్ణకుంభమై పూజలందుకున్నావ్…
నేను కొరగాని కొరివినై చేష్టలుడిగి చూస్తున్నా.
నన్ను నేను తెలుసుకున్న వేళ…
తెలుగు జిలుగుల వెలుగై….
నాలో అంధకారాని అదృశ్యం చేసిన వేళ….
నేను నీవైన వేళ…. నాకు తెలిసింది
నేను పుట్టిన నేల తెలుగు…
నేను తిన్న తిండి తెలుగు…
నేను కట్టిన బట్ట తెలుగు…
నా ఉచ్చ్వాస నిశ్వాసాలు తెలుగు.
నా ఉనికి తెలుగు…
నా జీవితం తెలుగు…
నా సర్వస్వం తెలుగు…
నా మతిని గతిని మార్చిన మీ
అదే గాలి…అదే నేల…కు
నిలకడల జెండానై…దిక్సూచినై….
నా తరువాత తరానికి ….
వారధినై నిలుస్తాను.
Excellent. Very nice..
Excellent sir