Hungry
నార్మల్‌గా ఉన్నప్పుడు మనమంతా చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటాం. కానీ, ఒక్కసారి మనకు ఆకలి(Hungry) వేయడం స్టార్ట్ అయిందంటే.. ఒక్కసారిగా మన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది. చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు, అకారణంగా కోపం వచ్చేస్తుంటాయి.
ఇంట్లో వంట అవడం కొంచెం లేట్ చేసినా, లేదా ఆఫీస్‌లో ఎవరైనా చిన్న విషయం అడిగినా కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఫైర్ అయిపోతాం. ఇలా ఆకలి(Hungry) వేసినప్పుడు కోపంతో ఊగిపోవడాన్ని ఇంగ్లీషులో హ్యాంగ్రీ అంటే హంగ్రీ + యాంగ్రీ అని పిలుస్తారు.
ఇది కేవలం మనుషుల మూడ్ కి సంబంధించిన విషయం మాత్రమే కాదని డాక్టర్లు అంటున్నారు. దీని వెనుక శరీరంలో జరిగే కొన్ని షాకింగ్ హార్మోనల్ ఛేంజెస్, సైంటిఫిక్ రీజన్స్ దాగి ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
మన బాడీకి ఆహారం ఎంత ముఖ్యమో, బ్రెయిన్ సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం టైమ్‌కి ఆహారం తీసుకోలేనప్పుడు బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి.
గ్లూకోజ్ అనేది మన మెదడుకు ఒక ఇంధనం వంటిది. అది అందకపోతే బ్రెయిన్ వెంటనే అలర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దాంతోనే ఏకాగ్రత తగ్గిపోవడం, తలనొప్పి రావడం, విపరీతమైన నీరసం వచ్చినట్లు అవడం వంటివి జరుగుతాయి.
ఈ సమయంలో బాడీ తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను భారీగా రిలీజ్ చేస్తుంది. ఇవి మనల్ని ఫైట్ లేదా ఫ్లైట్ అంటే గొడవ పడే స్థితికి తీసుకెళ్తాయి. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు మనకు తెలీకుండానే కోపం, అసహనం వచ్చేస్తుంటాయి.
గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు మైండ్‌లోని భావోద్వేగాలను కంట్రోల్ చేసే భాగం తన పట్టును కోల్పోతుంది. దీనివల్ల మనం చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకోలేక ఓవర్‌గా రియాక్ట్ అయిపోతుంటాం. మరి ఈ ఆకలి కోపాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేదానికి డాక్టర్లు కొన్నిసూచనలు చెబుతున్నారు.
దీనికోసం పెద్ద పెద్ద మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఎక్కువ సేపు కడుపును ఖాళీగా ఉంచకుండా టైమ్ టు టైమ్‌కి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఒకేసారి ఎక్కువ తినకుండా, గ్యాప్ ఇచ్చి కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది.
ఆఫీస్‌లోనో లేదా బయట ఉన్నప్పుడో ఆకలి వేసినపుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా.. పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటి హెల్దీ స్నాక్స్ దగ్గర ఉంచుకోవాలి. ఇవి బాడీలో ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని ఇస్తాయి.
అలాగే శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు కూడా విపరీతమైన చిరాకు, కోపం వస్తుంటాయి. అందుకే ప్రతీ అరగంటకు ఒకసారి నీళ్లు తాగడం అస్సలు మర్చిపోకూడదు.
నిజానికి ఆహారమనేది కేవలం మన కడుపు నింపడానికే కాదు.. మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా అవసరమని గుర్తుంచుకుంటే ఈ హ్యాంగ్రీ(Hungry) సమస్యను ఈజీగా దాటేయొచ్చు.
IND vs AFG : ధర్మశాలలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
