Vande Bharat
ఫ్లైట్స్ చాలానే ఉన్నా ట్రైన్ జర్నీనే కొందరు ఇష్టపడతారు. అయితే ఎంత లేదన్నా ఫాస్టుగా గమ్యస్థానాలకు రీచవ్వాలనే ఉంటుంది. దీనికి వందేభారత్‌తో చెక్ పడిందని చాలామంది సంతోషించారు. కాకపోతే జర్నీ అంతా కుర్చీలో కూర్చుని వెళ్లాలన్న కాస్త లోటు కనిపించేది . కానీ ఇక ఆ అసౌకర్యానికి ఫుల్‌స్టాప్ పలకబోతోంది. ఎందుకంటే సెప్టెంబర్ 2025 నుంచి పట్టాలెక్కబోయే వందే భారత్ స్లీపర్ రైలు(Vande Bharat Sleeper Train) వచ్చేస్తోంది.
భావ్‌నగర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)ప్రకటించిన ఈ కొత్త ప్రాజెక్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు వందే భారత్ అంటే చైర్ కార్(కూర్చునే సీటింగ్ సిస్టమ్)తో వేగంగా వెళ్లే రైలుగానే పరుగులు పెడుతోంది. కానీ ఇప్పుడదే వందే భారత్ – స్లీపర్ కోచ్‌లతో, తీరని ప్రయాణాన్ని సుఖంగా మార్చేందుకు సిద్ధమైంది.
రాత్రిపూట ప్రయాణించేవారికి ఇది నిజంగా రిలీఫ్ న్యూస్. గతంలో చాలామంది “రైలు బాగుంది కానీ స్లీపర్ అయితే బాగుణ్ణు” అన్న ఫీల్‌తోనే ఉన్నారు. ఇకపై అలాంటి లోటు ఉండదన్నదే రైల్వేలు పంపిన సందేశమే ఇది.
ఈ రైలు ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తయింది. తుది సాంకేతిక పరీక్షలు, కమీషనింగ్ ప్రక్రియలు జరగనున్నాయి. అవి పూర్తికాగానే… దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసు మొదలవుతుంది.
అయితే… ఈ స్లీపర్ వందే భారత్(Vande Bharat ) ఎక్కడ నడుస్తుంది? అన్న సస్పెన్స్( Suspense) మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సుదూర ప్రయాణాలకు డిమాండ్ ఉన్న మార్గాల్లో నడిపే ఆలోచనలో ఉందన్న సంకేతాలున్నాయి. దక్షిణ భారతంలో, ప్రత్యేకించి విశాఖపట్నం వంటి కీలక నగరాలకు ఈ సౌకర్యం దక్కుతుందా? అన్నది ఇప్పుడు ఆంధ్రాలో హాట్ టాపిక్. విజయవాడ–విశాఖ లేదా హైదరాబాద్–విశాఖ మధ్య ఈ రైలు నడిస్తే, ప్రయాణికుల స్పందన అపూర్వంగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కూర్చునే సీట్లతో కూడా అంత భారీ ఆదరణ పొందిన వందే భారత్(Vande Bharat) – ఇక నిద్రపోతూ ప్రయాణించే సౌకర్యంతో వస్తే?… వేగం, విశ్రాంతి, రెండూ ఒకేసారి దక్కుతాయి. అందుకే ఈ కొత్త వర్షన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Siraj: సిరాజ్‌ను ఎస్పీని చేసేయండి సర్..రేవంత్‌కు ఫ్యాన్స్ డిమాండ్