Employees
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఫ్యూయల్ సేవింగ్ పిలుపునకు స్పందిస్తున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ కాన్వాయ్ సంఖ్యను తగ్గించుకోగా, ఇప్పుడు దేశ రాజధానిఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలకమైన పొదుపు చర్యలను ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఖర్చులను కంట్రోల్ చేస్తూనే, పర్యావరణ హితమైన నిర్ణయాలతో పాలన సాగించేలా కొత్త గైడ్‌లైన్స్ రూపొందించారు.
ఢిల్లీలోని గవర్నమెంట్ ఉద్యోగుల(Employees)కు ఊరటనిస్తూ వారంలో రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేసే (Work From Home) వీలును కల్పించారు. అలాగే మిగిలిన వర్కింగ్ డేస్‌లో ఒక రోజును ‘నో కార్ డే’ (No Car Day) గా పాటించాలని ఆదేశించారు.
ఆరోజు ఉద్యోగులంతా దీనిని ‘మెట్రో డే’గా వ్యవహరిస్తూ, తమ పర్సనల్ వెహికల్స్ కాకుండా మెట్రోలోనే ఆఫీసులకు చేరుకోవాలని సూచించారు. అంతేకాకుండా, ప్రభుత్వ సమావేశాల్లో సుమారు 50 శాతం ఆన్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల ఆఫీస్ వర్క్ అవర్స్‌లో మార్పులు చేయనున్నారు.
ప్రభుత్వ అధికారులకు కేటాయించే వెహికల్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. ఆఫీసర్స్ ఆయిల్ బిల్లుల్లో 20 శాతం వరకూ కోత విధించడమే కాకుండా, నెలకు గరిష్టంగా 200 లీటర్ల పెట్రోల్ మాత్రమే కేటాయించాలని కండిషన్ విధించింది. అలాగే, రాబోయే 6 నెలల వరకు గవర్నమెంట్ తరపున ఎటువంటి కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని తీర్మానించింది.
గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉండే ఉద్యోగుల(Employees) ట్రాన్స్‌పోర్ట్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 29 కాలనీల నుంచి ఆఫీసులకు చేరుకోవడానికి 58 ప్రత్యేక బస్సులను నడపబోతున్నారు.
ఈ బస్సులు ఉద్యోగులను వారి కాలనీల నుంచి ఆఫీసులకు చేర్చి, డ్యూటీ ముగిసిన తర్వాత తిరిగి వారి కాలనీలకు తీసుకువెళతాయి. ఈ నిర్ణయాల వల్ల ఫ్యూయల్ సేవ్ అవడంతో పాటు సిటీలో కాలుష్యం , ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
