Save America Act
వరల్డ్‌లోనే శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికాలో.. ఇప్పుడు ఓటింగ్ విధానం చుట్టూ అనుకోని పొలిటికల్ డ్రామా నడుస్తోంది. అయితే ఈ వివాదంలోకి హఠాత్తుగా భారత్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ .. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ కామెంట్లను కోట్ చేయడమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాలో ఓటు వేయడానికి కంపల్సరీగా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్న ట్రంప్, దానికి భారత్ జరిపే భారీ ఎన్నికల నిర్వహణను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. తన అఫీషియల్ ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, ఈ నెల స్టార్టింగ్‌లో భారత సీఈసీ జ్ఞానేష్ కుమార్ తమ ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడిన ఒక విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.
సరైన ఫోటో ఐడీ కార్డ్ లేకుండా అమెరికాలో అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జ్ఞానేష్ కుమార్ తమ అడ్మినిస్ట్రేషన్‌ను నేరుగా ప్రశ్నించారని, ఆయన తమకు ఒక రకంగా లెసన్ చెప్పారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా శశాంక్ మట్టూ అనే జర్నలిస్ట్ కూడా దీనిపై ట్వీట్ చేస్తూ, భారత సీఈసీ అగ్రరాజ్యానికి ఎన్నికల నిర్వహణపై క్లాస్ పీకారనే వార్తను బ్రేకింగ్ రిపోర్టుగా బయటపెట్టారు.
భారత్‌లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ డేటాను కూడా ట్రంప్ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఇండియాలో ఎన్నికల్లో ఏకంగా 646 మిలియన్లు అంటే 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని.. అందులో 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని గుర్తుచేశారు.
అందులోనూ ప్రతి ఒక్క ఓటరు కూడా తప్పనసరిగా గుర్తింపు పొందిన ఫోటో ఐడీ కార్డ్ చూపిస్తేనే ఓటు వేయడానికి అనుమతి దక్కిందని ట్రంప్ గుర్తు చేశారు. భారీ జనాభా ఉన్న దేశంలోనే అది సాధ్యమైనప్పుడు, అమెరికాలో ఎందుకు అమలు చేయకూడదనేది ట్రంప్ ప్రశ్న. అందుకే యూఎస్‌లో కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కోసం కండిషన్లను స్ట్రిక్ట్ చేస్తూ సేవ్ అమెరికా యాక్ట్ (SAVE America Act)ను కాంగ్రెస్ వెంటనే ఆమోదించాలని ట్రంప్ గట్టిగా పట్టుబడుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్లు ఓటింగ్ కండిషన్లు స్ట్రిక్ట్‌గా ఉండాలని కోరుకుంటుండగా, డెమోక్రాట్లు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సస్టెయిన్డ్ ఫోటో ఐడీ కౌంటర్ పెట్టడం వల్ల పేదలు, మైనారిటీలు, వలసదారులు ఓటు హక్కు కోల్పోతారనేది డెమోక్రాట్ల ఆరోపణ.
అయితే ఇప్పుడు స్వయంగా భారత సీఈసీ కామెంట్లను ట్రంప్ ఒక ఆయుధంగా వాడుకోవడంతో డెమోక్రాట్లకు సమాధానం చెప్పుకోవడం కష్టంగా మారబోతోంది. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియా మోడల్‌ను ప్రెసిడెంట్ సమర్థించడం వల్ల అమెరికా కాంగ్రెస్‌లో సేవ్ అమెరికా యాక్ట్(Save America Act) బిల్లుపై మరింత తీవ్రమైన చర్చలు నడవనున్నాయి.
మరోవైపు గ్లోబల్ ఇమేజ్ పరంగా ఇది భారతదేశానికి దక్కిన విక్టరీగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు డెవలప్ చెందిన వెస్ట్రన్ కంట్రీస్ ఇండియన్ డెమోక్రసీపై లేదా ఎన్నికల నిర్వహణపై విమర్శలు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడే తమ దేశంలో సిస్టమ్ మార్చడానికి సీఈసీ పాటించే పద్ధతులనే బెస్ట్ రోల్ మోడల్‌గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Breaking: US President Trump says India’s Chief Election Commissioner schooled America on holding elections
“How can you have elections in the U.S. without a valid photo ID?” Kumar asked the Trump administration pic.twitter.com/HeLF3VtwWT
— Shashank Mattoo (@MattooShashank) August 17, 2026
CM Vijay : విజయ్ పాలనకు 100 రోజులు..దళపతి మార్క్ కనిపించిందా ?
