Free Advice
మన సొసైటీలో రూపాయి ఖర్చు లేకుండా, మనం నోరు తెరిచి అడగకపోయినా బకెట్ల కొద్దీ ఉచిత సలహాలు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారు. పెళ్లి,కెరీర్, పర్సనల్ లైఫ్.. ఇలా టాపిక్ ఏదైనా సరే, దానిపై కనీసం నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా మన చుట్టూ ఉన్నవాళ్లు సలహాలివ్వడానికి క్యూ కట్టేస్తుంటారు.
మన చుట్టాలలోనూ, ఫ్రెండ్స్‌లోనూ వాళ్లు ఉంటే ఇంకా ఇబ్బంది. వారికి నో చెప్పలేం, ఎదురుతిరగలేం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఎదురు తిరిగితే బంధాలు చెడిపోతాయి, ఊరుకుంటే మన మనశ్శాంతి పోతుంది. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి గొడవ పడకుండా, ప్రశాంతతను కాపాడుకుంటూనే అవతలి వాళ్ల నోళ్లు మూయించడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయని సైకాలజిస్టులు అంటున్నారు.
ఎదుటివాళ్లు ఉచిత సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినపుపడు నవ్వుతూనే దానిని సైలెంట్‌గా స్కిప్ చేసేయాలి. నీ మంచి కోరే చెప్తున్నానంటూ మీకు నచ్చని అడ్వైజ్‌లు మొదలుపెట్టినప్పుడు.. వాళ్లతో ఎలాంటి ఆర్గ్యుమెంట్‌కు దిగకుండా చిరునవ్వు నవ్వుతూ ..అవునా, అలాగే చేద్దాం, చూద్దాం అని చాలా సింపుల్‌గా ఆ డిస్కషన్ క్లోజ్ చేయాలి.
ఆ సమయంలో వారు చెప్పేది విన్నట్లు నటిస్తే చాలు వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు వాళ్లు ఫీలవుతారు. అలాగే ఆ తర్వాత వాళ్ల మాట పాటించాలా వద్దా అనేది పూర్తిగా మన ఛాయిస్. దీనివల్ల అక్కడ ఎలాంటి డ్రామా లేకుండా సింపుల్‌గా ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది.
అలాగే ఆ క్వశ్చన్‌ను వాళ్ల వైపే తిప్పేసి మాట్లాడటం నేర్చుకోవాలి. మన కెరీర్ , పర్సనల్ లైఫ్, పెళ్లి , పిల్లలు అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు అసహనం వ్యక్తం చేయకుండా టక్కున టాపిక్ డైవర్ట్ చేయాలి. నా విషయం సరే గానీ.. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరి హెల్త్ ఎలా ఉంది? అంటూ వాళ్ల యోగక్షేమాల వైపు చర్చను తిప్పేయాలి.
జనరల్‌గా ఎవరైనా సరే తమ గురించి గొప్పగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాబట్టి, మన మీద అంత వరకూ నడిచిన టాపిక్ వెంటనే వాళ్ల వైపు మారిపోయి మనమీద ప్రెజర్ తగ్గిపోతుంది. మనకు వారి ఉచిత సలహాలు(Free Advice) వినే బాధ కూడా ఉండదు.
అన్నిటి కంటే ముఖ్యమైనది చివరిది ఏంటంటే..మర్యాదగా వారికి బౌండరీలు గీయడం. కొందరు హద్దులు దాటి మన పర్సనల్ డెసిషన్లను వేలెత్తి చూపిస్తుంటారు. అలా ఎందుకు చేశావు..ఇలా చేయాల్సింది కదా అంటూ సలహాలు ఇస్తుంటారు.
అటువంటప్పుడు వారిపై సీరియస్ అవ్వకుండా నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇవ్వాలి. నామీద మీకు ఉన్న కన్సర్న్ నాకు అర్థమైంది.. కానీ నా లైఫ్ డెసిషన్స్ నేను తీసుకోగలను, ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో స్టాప్ చేద్దాం అని క్లియర్‌గా అవతలివారితో చెప్పేయాలి.
ఇలా మర్యాదగా సరిహద్దులు గీయడం వల్ల స్నేహితులకు, బంధువులకు కోపం రాదు. అదే టైమ్‌లో మీ ప్రైవసీలోకి రాకుండా సైలెంట్‌గా ఉండటం బెటర్ అన్న విషయాన్నితెలుసుకుంటారు. ఈ సింపుల్ హ్యాక్స్ పాటిస్తే రిలేషన్స్ కట్ అవ్వవు అలాగే మన ప్రశాంతతకూ ఎలాంటి ఢోకా ఉండదు.
Sunset Clause Relationship : లవ్ విత్ ఎక్స్‌పైరీ డేట్.. డేటింగ్ వరల్డ్‌లో కొత్త ట్రెండ్
