1980s Photo Craze : రెట్రో లుక్ కోసం APK లింక్స్ క్లిక్ చేస్తున్నారా? 1980s ఫోటో క్రేజ్‌తో సైబర్ దొంగలు వచ్చేశారు జాగ్రత్త..

1980s Photo Craze : ఫేక్ యాప్స్ మొబైల్‌లోని సీక్రెట్ ఫైల్స్, ఫ్యామిలీ ఫోటోలు, ముఖ్యమైన పర్సనల్ డాక్యుమెంట్లు, చివరకు బ్యాంక్ వివరాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి.

1980s Photo Craze

సోషల్ మీడియాలో ఏదైనా కొత్త ట్రెండ్ ఎంటర్ అయిందంటే చాలు.. వెంటనే దాంట్లో దూకేసి రచ్చ లేపడం మన నెటిజన్లకు ఉన్న అలవాటు! ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌,ఫేస్ బుక్‌లో 1980 కాలం నాటి ఓల్డ్ ఫ్యాషన్ రెట్రో ఫోటోలుగా మార్చుకునే వింటేజ్ పిక్స్ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది.

అయితే ఎలాంటి క్రేజ్‌ను అయినా బాగా క్యాష్‌ చేసుకోవడంలో ఫస్ట్ ఉండే సైబర్ దొంగలు ఈసారి కూడా ఒక సైలెంట్ మాస్టర్ ప్లాన్ వేశారు. అట్రాక్ట్ చేసే ఫిల్టర్లు, 1980s లుక్ ఇస్తామంటూ ఫేక్ APK లింక్స్ వదిలి, ప్రైవేట్ డేటాను కొల్లగొట్టడానికి వల విసురుతున్నారు. మెయిన్‌గా హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి మోసాలపై వార్నింగ్‌లు ఇష్యూ అవుతుండటంతో, ట్రెండ్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

80ల నాటి హెయిర్ స్టైల్స్, ఆరోజుల్లో ఉన్న ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు మార్చుకోవచ్చని నమ్మించేలా ‘1980s ఫోటో’, ‘రెట్రో ఫోటో’, ‘ఓల్డ్ స్టైల్ ఫోటో’ వంటి క్యాచీ పేర్లతో నకిలీ APK లింక్స్‌ను సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ప్లే స్టోర్ వంటి అఫీషియల్ యాప్ స్టోర్లలో దొరకని ఈ లింక్ ఫైళ్లను.. క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని థర్డ్ పార్టీ లింక్స్ ద్వారా మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ చేయిస్తున్నారు.

ఈ ఫోటోలు రెడీ చేసుకోవాలన్న ఇంట్రస్ట్‌తో తెలీక ఆ లింక్ క్లిక్ చేసి APK ఫైల్ డౌన్‌లోడ్ చేస్తే వారి మొబైల్స్‌లో వైరస్‌లు, డేంజరస్ కోడ్‌లు ఎంటర్ అయిపోతాయి. ఈ యాప్స్ ఇన్‌స్టాల్ కాగానే గ్యాలరీ, కాంటాక్ట్స్, ఎస్‌ఎమ్మెస్‌లు, కెమెరా పర్మిషన్లు కోరతాయి. వాటికి మనం ఒక్కసారి ఓకే చెప్పామా.. మొబైల్‌లోని పర్సనల్ డేటా డైరెక్టుగా హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది.

సాధారణంగా ఫోటో ఎడిటింగ్ యాప్‌కు కెమెరా , గ్యాలరీ యాక్సెస్ అవసరమే.. కానీ ఈ ఫేక్ యాప్స్ మాత్రం మొబైల్‌లోని సీక్రెట్ ఫైల్స్, ఫ్యామిలీ ఫోటోలు, ముఖ్యమైన పర్సనల్ డాక్యుమెంట్లు, చివరకు బ్యాంక్ వివరాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. ట్రెండ్‌లో కనిపించాలనే చిన్న తొందరపాటు మన ప్రైవసీని రోడ్డుపై పడేసే ప్రమాదం ఉంది.

ఈ సైబర్ వలలో పడకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో వచ్చే అన్ని APK లింకులను క్లిక్ చేసేయకూడదు. ఏ యాప్ కావాలన్నా కేవలం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి అఫీషియల్ స్టోర్ల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏదైనా కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు డెవలపర్ ఎవరు,దాని రేటింగ్స్, దానిపై వచ్చిన యూజర్ రివ్యూలు, ఎన్ని డౌన్‌లోడ్స్ ఉన్నాయో అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.

1980s Photo Craze

అవసరం లేని పర్మిషన్లు అడిగితే నో చెప్పాలి. ఒకవేళ ఇప్పటికే అలాంటి డౌట్‌ఫుల్ యాప్ ఆల్రెడీ డౌన్ లోడ్ చేసి ఉంటే.. వెంటనే మీ మొబైల్‌లో దానిని డిలీట్ చేసి, మీ సోషల్ మీడియా, బ్యాంక్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోండి.

ట్రెండ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మన డిజిటల్ సెక్యూరిటీ పోతే మళ్లీ రాదు. ఒక్క లైక్ కోసమో, ఒక చిన్న రీల్ కోసమో, క్రేజ్‌ కోసమో సైబర్ నేరగాళ్లకు మన ఫోన్ సేఫ్టీ లాకర్ తాళాలు ఇచ్చేయడం మంచిది కాదన్న విషయం తెలుసుకోండి.

Vitamin D : ఎండలో తిరుగుతున్నా విటమిన్ D పడిపోతోందా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి..

Exit mobile version