Globe : వేడెక్కుతున్న భూగోళం.. రాబోయే తరాలకు పచ్చటి భూమిని ఇవ్వాలంటే ఏం చేయాలి?

Globe : పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి పాత పద్ధతులన్నిటిని పక్కన పెట్టేసి, పర్యావరణానికి అస్సలు హాని చేయని గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

Globe

ఇప్పుడు మన భూగోళం(Globe) క్లైమేట్ చేంజ్ తలనొప్పిని ఎదుర్కొంటుంది. వాతావరణం రకరకాల మార్పులతో జనాలను వణికిస్తుంది. అందుకే ఈమధ్య కాలంలో ఎవరిని కదిలించినా ఈ ఇయర్ ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. జీవితంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో ఎండలు చూడలేదని జనం అల్లాడిపోతున్నారు.

నిజానికి ఈ ఏడాది ఎండలు ఇంతలా ఠారెత్తడానికి.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వచ్చేలా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడానికి కూడా అసలు కారణం ఈ వాతావరణ మార్పులే అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు కాలంతో పాటు వచ్చే రుతువులు.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో అర్ధం కాని పరిస్థితి ఉంటోంది.

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీలు విపరీతంగా పెరిగిపోవడం, రోడ్ల మీదకు లక్షల సంఖ్యలో వెహికల్స్ వచ్చేయడం వల్ల వాటి నుంచి వచ్చే విషపూరితమైన పొగ అంతా గాల్లో కలిసిపోతోంది. దీనివల్ల మన భూగోళం మునుపెన్నడూ లేనంతగా వేడెక్కిపోతోంది. దీనినే సైంటిస్టులు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు.

భూమి(Globe) ఇలా వేడెక్కిపోవడం వల్ల కొండల్లో ఉండాల్సిన మంచు మొత్తం కరిగిపోయి సముద్రాల్లో కలిసిపోతోంది. దాంతో సముద్ర మట్టాలు పెరిగిపోయి.. అకాల వానలు, ఊహించని వరదలు మొన్నటి వరకూ ముంచెత్తుతుంటే ఇప్పుడు అసలు వానలు లేకపోవడంతో కరవులతో భూములు ఎండిపోతున్నాయి.

ఈ పెద్ద గండం నుంచి మన భూమిని, మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే ఒక తాటిపైకి వస్తున్నాయి. ఇకపై పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి పాత పద్ధతులన్నిటిని పక్కన పెట్టేసి, పర్యావరణానికి అస్సలు హాని చేయని గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

దీంతో ఇప్పటికే గాల్లో కలిసే కాలుష్యాన్ని పూర్తిగా సున్నా స్థాయికి తీసుకురావడమే.. టార్గెట్‌గా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పెద్ద పెద్ద మీటింగ్‌లు పెట్టి మరి ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ఈ రోజుల్లో వస్తున్న ఈ పెద్ద మార్పులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీ , గాలి నుంచి తయారు చేసే పవన విద్యుత్ అలాగే గ్రీన్ హైడ్రోజన్ వంటివి మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలతో పాటు భారతదేశం, చైనా వంటి పెద్ద దేశాలు ఇప్పటికే ఈ కాలుష్యం లేని కరెంట్ ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి.

ట్రాన్స్‌పోర్ట్ రంగంలో కూడా ఒక పెద్ద విప్లవమే నడుస్తోంది. ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ వెహికల్స్‌కు బదులు ఎలక్ట్రిక్ కార్లు, బైకులు (EVs) వాడకాన్ని అన్ని ప్రభుత్వాలు తెగ ప్రోత్సహిస్తున్నాయి. కాకపోతే ఈ గ్రీన్ ఎనర్జీ వైపు మారడం అనుకున్నంత ఈజీగా మాత్రం సాగడం లేదు .

ఎందుకంటే, కేవలం బొగ్గు, డీజిల్ నమ్ముకునే బతికే పేద దేశాలు కానీ ఎదుగుతున్న దేశాల దగ్గర కొత్త టెక్నాలజీ గానీ, అంత డబ్బు గానీ లేదు. అలాంటి దేశాలకు సపోర్ట్ చేయాల్సిన ధనిక దేశాలు ఆశించిన స్థాయిలో సాయం చేయడం లేదని అంతర్జాతీయ వేదికలపై గట్టిగానే గొడవలు జరుగుతున్నాయి.

Globe

నిజానికి రాబోయే పదేళ్లలో మనకు కావాల్సిన కరెంట్‌లో.. సగానికి పైగా వాటా అంతా ఈ సోలార్, విండ్ ఎనర్జీల నుంచే రావాల్సి ఉంటుంది. అప్పుడే భూమి కాస్త చల్లబడుతుంది. అయితే పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది కేవలం ఒక్క దేశం చేతుల్లో మాత్రమే ఉన్న పని కాదు . భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశం ఇదొక సొంత బాధ్యతగా అనుకుంటేనే ఇది జరుగుతుంది.

ఒక దేశం దగ్గర ఉన్న గ్రీన్ టెక్నాలజీని పక్క దేశాలతో షేర్ చేసుకోవాలి. అప్పుడే మన భూమిని రాబోయే మన భావి తరానికి సురక్షితంగా, పచ్చగా అందించడం కుదురుతుంది. ప్రపంచ దేశాలన్నీ పట్టు విడువకుండా ఒకదేశానికి మరో దేశం సాయం చేసుకుంటూ, కఠినమైన రూల్స్ పెట్టినప్పుడే ఈ క్లైమేట్ సంక్షోభానికి శాశ్వతంగా ఎండ్ కార్డ్ వేయగలమని ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

Cockroach Janta Party : కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్..తగ్గేదే లేదంటూ మరో అకౌంట్

Exit mobile version