Axar Patel : అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ షో.. తొలి వన్డేలో భారత్ గెలుపు

Axar Patel : టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బుమ్రా రాకతో భారత పేసర్లు చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు.

Axar Patel

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ భారత్ బోణీ కొట్టింది. ఆసక్తికరంగా సాగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరంభంలో తడబడి నిలబడిన ఇంగ్లాండ్ 259 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందుంచింది. గిల్ హాఫ్ సెంచరీతో రాణిస్తే 4 వికెట్లు తీసిన అక్షర్ పటేల్(Axar Patel) బ్యాట్‌తోనూ దుమ్మురేపాడు. దీంతో భారత్ ఈ టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బుమ్రా రాకతో భారత పేసర్లు చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. డకెట్ ధాటిగా ఆడినా 43 పరుగుల దగ్గర గుర్నూర్ బ్రార్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత మిగిలిన బ్యాటర్లను ప్రసిధ్ కృష్ణ, బుమ్రా కంగారెత్తించారు. దీంతో ఇంగ్లాండ్ 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. బెథల్ (14), బ్రూక్ (1), బట్లర్ (5), సామ్ కురన్ డకౌటయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది.

ఈ దశలో జో రూట్, డాసన్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 7 పరుగుల దగ్గర రూట్ ఇచ్చిన క్యాచ్‌ను శివమ్ దూబే అందుకోలేకపోయాడు. దీంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూట్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డాసన్ 68 పరుగులకు వెనుదిరిగాడు. వీరిద్దరి పార్టనర్‌షిప్ కారణంగా ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(Axar Patel) 4 వికెట్లు పడగొట్టగా… ప్రసిధ్ కృష్ణ, బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Axar Patel

తర్వాత ఛేజింగ్‌లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారీ అంచనాలు పెట్టుకున్న రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 11 పరుగులకే ఔటయ్యాడు. కాసేపటికే విరాట్ కోహ్లీ(5) కూడా వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే కెప్టెన్ శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరూ 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

శ్రేయాస్ అయ్యర్ 35 రన్స్ కు ఔటైనా గిల్, వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. గిల్ 80 (11 ఫోర్లు, 1 సిక్సర్ ) రన్స్ దగ్గర గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక్కడ నుంచి అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఐదో వికెట్‌కు 102 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. దీంతో భారత్ 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Satellite Phone : బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ ..అడవులు, కొండల్లోనూ పనిచేసే సూపర్ డివైస్ స్పెషాలిటీలు ఇవే..

Exit mobile version