Banana : అరటి పండ్లు త్వరగా మెత్తబడిపోతున్నాయని పారేస్తున్నారా?ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..

Banana : కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అరటిపండ్లను వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంచడమే కాకుండా నల్లబడకుండా కాపాడుకోవచ్చు.

Banana

అరటిపండ్లు మార్కెట్ నుంచి తెచ్చిన మర్నాడే నల్లబడిపోయి, మెత్తగా అయిపోతే ఎవరికైనా చిరాకు వస్తుంది. అందులోనూ వాటిని తినక ముందే కుళ్లిపోతే మన జేబుకు చిల్లు పడినట్లే. ఎండాకాలంలో అయితే ఈ సమస్య గురించి వేరే చెప్పక్కర్లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటిని వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంచడమే కాకుండా నల్లబడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండ్లలో నేచురల్‌గా రిలీజ్ అయ్యే ఎథిలీన్ అనే ఒక గ్యాస్ వల్ల ఫాస్ట్‌గా పండిపోతాయి. ఇది పండును త్వరగా పండిపోయేలా చేస్తుంది కాబట్టి.. మనం ఒకే అరటి పండ్ల గుత్తిని అలాగే ఉంచితే, ఆ గ్యాస్ కాన్సంట్రేషన్ ఎక్కువైపోయి ఒకదాని ఎఫెక్ట్‌తో ఇంకోటి చాలా వేగంగా పండిపోయి నల్లబడిపోతాయి. అందుకే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఆ గుత్తి నుంచి పండ్లను విడదీసి, గాలి ఆడేలా విడివిడిగా ఉంచాలి.

ఈ ఎథిలీన్ గ్యాస్ ఎక్కువగా రిలీజయ్యేది అరటిపండు గుత్తి తొడెం అంటే కాండం భాగం నుంచే కాబట్టి.. ఆ తొడెం భాగానికి చిన్న ప్లాస్టిక్ ర్యాప్ లేదా అల్యూమినియం ఫోయిల్ చుట్టాలి. దీనివల్ల గ్యాస్ బయటకు రాకుండా లాక్ అయిపోతుంది. దీనివల్ల పండు పక్వానికి వెళ్లే ప్రాసెస్ బాగా స్లో అవుతుంది.

అంతేకాదు యాపిల్స్, మామిడి, అవకాడో వంటి ఇతర పండ్ల పక్కన అరటిపండ్లను పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ కూడా ఎథిలీన్ రిలీజ్ చేస్తాయి. దీంతో అరటిపండ్లు మరింత వేగంగా మెత్తబడతాయి.

Banana

అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అయితే పండు బాగా పండిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. చల్లదనానికి పండు పైతొక్క నల్లగా మారిపోయినా కూడా లోపలి గుజ్జు మాత్రం గట్టిగానే ఉంటుంది.

అరటి పండ్లను కొనేటప్పుడే కొద్దిగా పచ్చగా, గట్టిగా ఉన్నవి ఎంచుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ ఇంట్లో పండ్లు బాగా పండిపోయి తినలేకపోతే… వాటిని పారేయకుండా బనానా షేక్, బనానా స్మూతీ, బనానా పాన్ కేక్స్ లేదా బ్రెడ్ , చపాతీ తయారీలో వాడుకోవచ్చు. ఇవి నేచురల్ స్వీట్‌నెర్‌లాగా కూడా పనిచేస్తాయి. మంచి టేస్ట్‌ను కూడా ఇస్తాయి.

Carb Cravings : రైస్ తింటేనే పొట్ట ఫుల్ అనే ఫీలింగ్ వస్తోందా? ఇది ఆకలా లేక క్రేవింగా?

Exit mobile version