UPI PIN
ఈ రోజుల్లో చేతిలో రూపాయి పట్టుకోకపోయినా పనులు నడిచిపోతున్నాయి. కానీ అదే మన ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోతే మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని సిచ్యువేషన్‌లో అంతా ఉన్నాం. ఇలా వాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మన కష్టార్జితానికి రక్షణగా నిలిచేది యూపీఐ పిన్ ఒక్కటే అన్న విషయం తెలిసిందే.
అయితే అంత ఇంపార్టెంట్ అయిన ఈ పిన్ నెంబర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా లేదంటే అది పాస్ వర్డ్ మర్చిపోయినా చాలా ఇబ్బంది పడతాం. ఇటువంటపుడు పిన్ పాస్వర్డ్ మారిస్తే సరిపోతుంది. అయితే చాలామందికి ఈ పిన్ మార్చడానికి, రీసెట్ చేయడానికి తేడా అలాగే దాన్ని సెక్యూర్‌గా ఎలా మేనేజ్ చేయాలో తెలీదు.
పిన్ మార్చడం, రీసెట్ చేయడం ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానీ రెండింటికీ తేడా ఉంది. మీకు పాత పిన్ నెంబర్ మనకు గుర్తుండి, సెక్యూరిటీ కోసం కొత్తది మార్చుకున్నప్పుడు దాన్ని పిన్ ఛేంజ్ అంటారు. అలా కాకుండా పాత పిన్ అసలే గుర్తు కూడా లేకుండా.. డెబిట్ కార్డ్ లేదా ఆధార్ కార్డు వంటి వివరాలతో కొత్తది క్రియేట్ చేయడాన్ని రీసెట్ అని అంటారు.
ముందుగా పిన్ మార్చుకోవాలనుకున్నవారు.. మీ మొబైల్‌లోని గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లేదా భీమ్ యాప్‌ను ఓపెన్ చేసి దానిలో ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోగానే..ఛేంజ్ యూపీఐ పిన్(UPI PIN )అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, ముందు మీ ఓల్డ్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన కొత్త నెంబర్‌ను రెండుసార్లు టైప్ చేసి దానిని కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది.
ఒకవేళ యూపీఐ పిన్(UPI PIN )నెంబర్‌ను పూర్తిగా మర్చిపోతే మాత్రం, బ్యాంక్ అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లి.. ఫర్గెట్ పిన్ లేదా రీసెట్ పిన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలతో పాటు కార్డులోని, ఎక్స్‌పైరీ డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని యాప్స్ ఇప్పుడు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ లేదంటే ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఈ సదుపాయం ఇస్తున్నాయి. అలా వివరాలు ఎంటర్ చేయగానే మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, తర్వాత మీకు నచ్చిన నెంబర్‌ను కొత్త పిన్ నెంబర్‌గా సెట్ చేసుకోవచ్చు.
అయితే మీ పిన్ నెంబర్‌ను బ్యాంక్ సిబ్బందితో సహా ఎవరితో కూడా షేర్ చేయకూడదు. అలాగే 1234, 1111, మీ డేట్ ఆఫ్ బర్త్ వంటి ఈజీ నెంబర్లు పెట్టకూడదు. అలాగే ప్రతి 6 నెలలకోసారి అయినా పిన్ మారుస్తూ ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ సేఫ్‌గా ఉంటుంది.
Cabbage Storage : ఫ్రిడ్జ్‌లో పెట్టినా క్యాబేజీ కుళ్లిపోతోందా? ఈ చిన్న ట్రిక్ తెలుసుకోండి..
