Cluster Business
బిజినెస్ వరల్డ్‌లో ఒకే రకమైన షాపులు లేదా ఒకేరకమైన వ్యాపారాలన్నీ ఒకే చోట గుంపుగా ఉండటాన్ని చూస్తుంటాం. దీనినే క్లస్టర్ బిజినెస్(Cluster Business) ఫార్ములా అంటారు. ఉదాహరణకు జ్యువెలరీ షాపులన్నీ ఒకే వీధిలో ఉండటం, క్లాత్ మార్కెట్ అంతా ఒకే ఏరియాలో ఉండటం, అలాగే ఒకే చోట పక్కపక్కనే నాలుగైదు హోటల్స్ ఉండటం మనం చూస్తూ ఉంటాం.
అయితే పక్కనే సేమ్ బిజినెస్ ఉంటే కస్టమర్లు సెపరేట్ అయిపోతారు అలా అయితే బిజినెస్‌కు లాస్ కదా, మరి ఈ ఫార్ములా ఎలా సక్సెస్ అవుతుందనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ బిజినెస్ సైకాలజీ ప్రకారం చూస్తే.. ఈ ఫార్ములా సూపర్ సక్సెస్ అవ్వడానికి మనుషుల మైండ్ సెట్, వాళ్ల ఆలోచనా విధానమే ప్రధాన కారణం అట.
దీని వెనుక ఉన్న మానసిక శాస్త్రాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి రాము, సోము అనే ఇద్దరి వ్యక్తుల చిన్న కథను ఉదాహరణగా తీసుకుందాం. ఒక సిటీలో రాము అనే వ్యక్తి ఒక కొత్త ఏరియాలో ఒక మంచి చెప్పుల షాప్ పెట్టాడు. ఆ ఏరియాలో వేరే ఏ షూ షాప్స్ కూడా లేకపోవడంతో అతనికి మంచిగా బిజినెస్ అయింది. ఎవరికి చెప్పులు కావాలన్నా రాము షాప్‌కే వచ్చేవారు.
కానీ కొన్ని రోజుల తర్వాత, అదే వీధిలో రాము షాప్‌కు ఎదురుగా సోము అనే వ్యక్తి మరో కొత్త షూ షాప్ పెట్టాడు. ఎదురుగా సేమ్ బిజినెస్ పెట్టేసరికి రాము చాలా కంగారుపడ్డాడు. తన కస్టమర్లందరూ ఇప్పుడు సగానికి తగ్గిపోతారు. తన బిజినెస్ సగం పడిపోతుందని తెగ బాధపడిపోయాడు.
కానీ, విచిత్రంగా సోము షాప్ పెట్టిన కొద్ది రోజులకే రాము షాప్‌లో ఇంతకు ముందు కంటే అమ్మకాలు డబుల్ అయ్యాయి. అటు సోము షాప్ కూడా కస్టమర్లతో కిటకిటలాడిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు కంటే, ఇద్దరూ పక్కపక్కనే సేమ్ బిజినెస్ చేసినప్పుడు ఇద్దరికీ లాభాలు ఎలా పెరిగాయో తెలుసుకోవడమే ఇక్కడున్న అసలైన సైకాలజీ సీక్రెట్.
మనుషుల మెదడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన మానసిక సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. అందులో మొదటిది డెస్టినేషన్ ఎఫెక్ట్. రాము ఒక్కడే ఉన్నప్పుడు, కస్టమర్లు అక్కడ ఒకే షాప్ ఉంది కదా, ఒకవేళ నచ్చకపోతే టైమ్ వేస్ట్ అని అనుకునేవారు.
కానీ సోము కూడా షాప్ పెట్టేసరికి, జనం మైండ్ సెట్‌లో అదొక షూ మార్కెట్‌లా మారిపోయింది. అక్కడికి వెళ్తే రెండు షాపులు ఉంటాయి.. ఏదోకటి కచ్చితంగా దొరుకుతుందని దూర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు రావడం స్టార్ట్ చేశారు. అంటే కాంపిటీషన్ పెరిగినప్పుడు కస్టమర్ల బేస్ కూడా విపరీతంగా పెరుగుతుంది.
రెండోది కంపారిజన్ సైకాలజీ. దీని ప్రకారం మనుషులకు ఒక వస్తువును కొనేటప్పుడు పోల్చి చూడటం చాలా ఇష్టం. ఒకే షాప్ ఉంటే వారు ఈజీగా డెసిషన్ తీసుకోలేరు. అదే పక్కపక్కనే రెండు షాపులుంటే రాము షాప్‌లో రేటు ఎంత, సోము షాప్‌లో డిజైన్ ఎలా ఉందోనని పోల్చి చూసుకుంటారు.
అలా కంపేర్ చేసుకున్నప్పుడు తాము ఒక తెలివైన డెసిషన్ తీసుకున్నామనే తృప్తి కస్టమర్‌కు లభిస్తుంది. దీనితో పాటు సోషల్ ప్రూఫ్ కూడా తోడవుతుంది. కస్టమర్లు ఒకే షాప్ ఉన్నప్పుడు అక్కడకు వెళ్లాలంటే ఆలోచిస్తారు. అదే ఒకే చోట ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ అందరూ కొంటున్నారు కాబట్టి క్వాలిటీ బాగుంటుందనే నమ్మకం ఏర్పడుతుంది.
చివరగా చెప్పాలంటే క్లస్టర్ బిజినెస్(Cluster Business) అనేది బిజినెస్ మధ్య శత్రుత్వాన్ని పెంచేది కాదు. కస్టమర్ల మైండ్‌లో ఒక నమ్మకాన్ని, సౌకర్యాన్ని క్రియేట్ చేసే ఒక అద్భుతమైన సైకలాజికల్ ఫార్ములా. అందుకే పోటీ ఉన్న చోటే బిజినెస్ ఎక్కువగా సక్సెస్ అవుతుంది.
Cancer : సున్నితమైన మనసు తరచూ మారే మూడ్స్.. కర్కాటకరాశికి ఏ నెంబర్ కలిసి వస్తుంది?
