Emotional Dependency : మీ హ్యాపీనెస్‌కి కంట్రోలర్ వేరొకరా? సెల్ఫ్ లవ్ మోడ్‌లోకి మారాలనుకుంటున్నారా?

Emotional Dependency : మనిషి ఎమోషనల్‌గా వేరొకరిపై డిపెండ్ అయిన ప్రతిసారీ వారి హ్యాపీనెస్ అనే లైసెన్స్‌ను అవతలి వారి చేతికిచ్చేస్తుంటారు.

Emotional Dependency

మీ మొబైల్ నోటిఫికేషన్ వినిపించగానే ఫేస్ అంతా ఒక్కసారిగా వెలిగిపోవడం లేదంటే వ్యక్తి నుంచి ఒక్క మెసేజ్ రాకపోతే దేనిపైనా ఫోకస్ పెట్టలేకపోవడం జరుగుతున్నాయా? ఇది కేవలం ఒక పర్సన్‌పై ఉన్న ప్రేమో లేక అభిమానమో అనుకుంటే పొరపాటేనని సైకాలజిస్టులు అంటున్నారు. దీనిని మన బ్రెయిన్ ప్లే చేసే ఒక డేంజరస్ కెమికల్ అడిక్షన్ లేదా డిపెండెన్సీ ట్రాప్ అంటారని చెబుతున్నారు.

దీనినే సింపుల్‌గా చెప్పాలంటే డ్రగ్స్‌కి అలవాటు పడిన మైండ్ ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందో, ఒక పర్సన్‌పై అతిగా డిపెండ్ అయినపుడు కూడా బ్రెయిన్ సరిగ్గా అలాగే రియాక్ట్ అవుతుంది. అందుకే ఆ పర్సన్ నాతో రెగ్యులర్‌గా మాట్లాడితేనే నా రోజు బాగుంటుంది, వాళ్లు పక్కన లేకపోతే నేను ఏ డెసిషన్ కూడా తీసుకోలేననే స్టేజ్‌కి చేరుకున్నారంటే, మీరు గ్యారంటీగా ఎమోషనల్ అండ్ ఫిజికల్ డిపెండెన్సీ(Emotional Dependency) అనే సైలెంట్ సుడిగుండంలో చిక్కుకుపోయినట్లేనని సైకాలజిస్టులు అంటున్నారు.

అసలు ఈ డిపెండెన్సీ అనేది మన మెంటల్‌ సిస్టంను ఎలా ఆక్యుపై చేస్తుందో ఒకసారి డీప్‌గా చూస్తే.. మనిషి ఎమోషనల్‌గా వేరొకరిపై డిపెండ్(Emotional Dependency) అయిన ప్రతిసారీ వారి హ్యాపీనెస్ అనే లైసెన్స్‌ను అవతలి వారి చేతికిచ్చేస్తుంటారు. వాళ్లు నవ్వితే కొండంత ఆనందం, అదే కాస్త ఫేస్ మాడ్చుకుంటే మూడ్ పాడు చేసుకోవడం జరుగుతాయి.

ఇలా వేరొకరి మూడ్ స్వింగ్స్ బట్టి మీ లైఫ్ రోలర్ కోస్టర్‌లా మారినప్పుడు, మీరు ఎంత ట్రై చేసినా పర్సనల్ లైఫ్‌లో గ్రోత్ సాధించలేరు. అదే మీ హ్యాపీనెస్‌కు మీరే జవాబుదారీగా మారిన రోజు, బయటి వరల్డ్ నుంచి వచ్చే ఎలాంటి నెగిటివిటీ అయినా మీ మెంటల్ పీస్‌ని రవ్వంత కూడా కదల్చలేదు.

అలాగే ఫిజికల్ డిపెండెన్సీ విషయానికి వస్తే, ప్రతి చిన్న పనికీ లేదా డెసిషన్‌కీ వేరొకరి అప్రూవల్ కోసం వెయిట్ చేయడం వల్ల మెదడులో ఉండే కాన్ఫిడెన్స్ సర్క్యూట్ మెల్లమెల్లగా వర్క్ చేయడం ఆపేస్తుంది. దీనినే సెల్ఫ్ ఎఫికసీ తగ్గడం అంటారు.

ఎవరి పనులు వారు సొంతంగా చేసుకొని, చిన్న చిన్న రిస్క్‌లు తీసుకున్నప్పుడు మాత్రమే బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజై ..నేను ఒంటరిగా కూడా సాధించగలననే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా కాకుండా ప్రతి విషయానికి పక్కవారిపై ఆధారపడితే, మెల్లగా మీలో ఒంటరి వారయిపోతారనే భయం , యాంగ్జైటీ పెరుగుతాయి.

చాలామంది ఇలా అతిగా డిపెండ్ అవడమే బంధానికి బలం అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో డిపెండెన్సీ (Emotional Dependency)అనేది రిలేషన్‌ను స్ట్రాంగ్ చేయదు సరికదా..అవతలి వ్యక్తికి ఒకానొక స్టేజ్‌లో ఊపిరిరాడనంత ఒత్తిడిని కలిగిస్తుంది.

మీ ప్రెజెన్స్ వారికి రిలీఫ్‌ను ఇవ్వకుండా ఒక కష్టమైన బాధ్యతలా అనిపించడం స్టార్టవుతుంది. దీనికి భిన్నంగా, ఇద్దరు వ్యక్తులు ఇండిపెండెంట్‌గా ఉంటూనే ఒకరికొకరు తోడుగా ఉండే ఇంటర్ డిపెండెన్సీ బంధంలో ఆకర్షణను, రెస్పెక్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది.

Emotional Dependency

అయితే ఇండిపెండెంట్‌గా మారడమంటే ఎవరినీ దగ్గరకు రానివ్వకపోవడం లేదా సైలెంట్‌గా ఉండిపోవడం కానే కాదు. పార్ట్‌నర్ తన పక్కన ఉంటే తన ప్రయాణం చాలా అందంగా ఉంటుంది, కానీ ఒకవేళ వారు లేకపోయినా కూడా తాను ఒంటరిగానే తన గమ్యాన్ని చేరుకోగలననే మెంటల్ మెచ్యూరిటీని సాధించడమే అవుతుంది.

అందుకే ఇకపై అయినా రోజులో కాసేపు మీతో మీరు ఏకాంతంగా గడపడం, మీ డెసిషన్స్ మీరే తీసుకోవడం, మీ ఓటములకు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీకై మీరు ఏర్పరుచుకున్న మెంటల్ ట్రాప్ నుంచి బయటకు వస్తారో.. అప్పుడు మీరు ఒకరి కోసం , అవతలి వారి నీడలో బతికే వ్యక్తిలా కాకుండా, మీ లైఫ్‌కు మీరే ఒక బ్రాండ్‌లా మారతారు.

Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్
↑
Exit mobile version