Emotional Immaturity
ఏదైనా సీరియస్ డిస్కషన్ నడుస్తుంది అనుకోండి. అప్పుడు సడన్‌గా ఎదుటి వ్యక్తి నీ ప్రవర్తనేంటి ఇంత చైల్డిష్‌గా ఉంది, అసలు నీకు మెచ్యూరిటీ ఉందా అని ఫేస్ మీదే అనేస్తే ఆ క్షణంలో ఎవరికి అయినా సరే బ్రెయిన్ కంప్లీట్ బ్లాంక్ అయిపోతుంది కదా. చాలామందికి తమ బిహేవియర్ పక్కనున్న వాళ్లను ఎంత డిస్టర్బ్ చేస్తోందో, ఎంత టార్చర్ పెడుతుందో అన్నది అస్సలు అర్థం కాదు.
వేరేవాళ్లు వచ్చి కడిగిపారేసే వరకు కూడా తమ ఈగో వెనుక దాగి ఉన్న ఆ ఇన్ మెచ్యూరిటీ బయటపడదు. ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా అలాంటి చేదు అనుభవం ఎదురయిందా.. మీరు నిజాయితీగా మీ తప్పును ఒప్పుకుని మీ పర్సనాలిటీని కంప్లీట్ చేంజ్ చేసుకుని మెచ్యూర్డ్‌గా మారాలనుకుంటున్నారా? అయితే సైకాలజిస్టులు చెబుతున్నా ఈ 4 పిన్ పాయింట్ రూల్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది.
ముందుగా గుడ్ ఆర్ బ్యాడ్ ఫీడ్‌బ్యాక్‌ను పాజిటివ్‌గా ఓపెన్ మైండ్‌తో స్వీకరించడం నేర్చుకోవాలి. చాలామంది ఆఫీసుల్లో కానీ రిలేషన్స్‌లో కానీ ఎదుటివారు చిన్న సజెషన్ ఇచ్చినా కూడా దానిని తమపై జరిగిన పర్సనల్ అటాక్‌లా ఫీల్ అయిపోయి డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. అలా కాకుండా ఎదుటివారు చెప్పిన దాంట్లో నిజం ఉందేమో ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు మీలో లోపాలను సరిదిద్దుకునే చాన్స్ దొరుకుతుంది.
ఇక రెండోది ఈగో పక్కన పెట్టి వారికి క్షమాపణ చెప్పడం అలవాటు చేసుకోవాలి. అక్కడ జరిగిన విషయంలో తప్పు ఒప్పుకుని సారీ చెప్పినంత మాత్రాన ఎదుటివాళ్లు తోపు, మీరు తక్కువ అయిపోరు. సారీ , నీ మాట వినకుండా మధ్యలో కల్పించుకున్నా అనో, మీరు చెప్పినదానిని సరిగా అర్ధం చేసుకోలేకపోయాననో ఓపెన్‌గా ఒప్పుకుంటే అక్కడ మీ వాల్యూ మరింత పెరుగుతుంది.
మూడోది దాగోడు మూతలు లేకుండా సూటిగా మాట్లాడటమన్నది ఎప్పుడూ కూడా మంచిదే. మిమ్మల్ని ఏదైనా విషయం బాధపెట్టినపుడు అక్కడ మూతి ముడుచుకుని కూర్చోవడం లేదంటే వెంటనే సైటెరిక్‌గా కామెంట్లు చేయడం కాకుండా..అందరి ముందు నా మీద ఇలాంటి జోకులు వేస్తే ఇబ్బందిగా అనిపిస్తుందని డైరెక్ట్‌గా ఆ వ్యక్తికే చెప్పేయాలి.
ఇక నాలుగోది మీ రియాక్షన్లకు మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎవరికైనా ఒక్కో సందర్భంలో కోపం, నిరాశ రావడం కామనే. అయితే ఆ ఫీలింగ్స్ సాకుగా చూపిస్తూ మీ ప్రవర్తనను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించకూడదు . ఎదుటివారితో మీరెలా ప్రవర్తిస్తున్నారనే దానికి మీరే బాధ్యత వహించాలి. మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ ఉన్నప్పుడే మీ మెచ్యూరిటీ(Emotional Immaturity) ఏంటి అనేది బయటపడుతుంది.
సొసైటీలో మిమ్మల్ని చూసి నవ్వకముందే, మీ ప్రవర్తనతో మీకు దూరం అవకముందే మీ మైండ్‌సెట్‌ను మీరు ట్యూన్ చేసుకోవడంలోనే రియల్ మెచ్యూరిటీ(Emotional Immaturity) దాగి ఉంటుంది. ఇగోను పక్కన పెట్టి ఈ 4 రూల్స్ అలవాటు చేసుకుంటే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో మీ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం గ్యారంటీ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
