Existence : రిలేషన్‌షిప్‌లో ఎక్జిస్టెన్స్‌ వ్యాల్యూ ఏంటి? .. పార్ట్‌నర్‌ ఉనికిని పట్టించుకోని మైండ్‌సెట్ దేనికి సంకేతం?

Existence : ఒక రిలేషన్‌లో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడం సహజం.ఆ బంధంలో అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు, అలకలు, కోపాలు ఉండాలని..అప్పుడే అవి ఆ రిలేషన్‌ను మరింత బలపరుస్తాయని సైకాలజీ చెబుతుంది.

Existence

ఏ రిలేషన్‌లో అయినా గొడవలు రావడం కామన్. అలా గొడవ జరిగినప్పుడు అవతలి వ్యక్తి కాస్త దూరం వెళ్లగానే.. ప్రేమగా బుజ్జగించాల్సిన పర్సన్.. కనీసం వాళ్ల ఉనికిని పూర్తిగా మర్చిపోయి, అసలు తమ లైఫ్‌లో వాళ్లు లేనట్లు ప్రవర్తిస్తుంటారు. తమతో లైఫ్ షేర్ చేసుకున్న మనిషి ఎక్జిస్టెన్స్‌ను కంప్లీట్ జీరో చేసేసి ఎప్పటిలాగే పాత లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. అయితే ఇది కేవలం ఒక ఈగో ప్రాబ్లెమ్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక డీప్ సైకలాజికల్ రీజన్ ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు.

ఒక రిలేషన్‌లో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడం సహజం.ఆ బంధంలో అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు, అలకలు, కోపాలు ఉండాలని..అప్పుడే అవి ఆ రిలేషన్‌ను మరింత బలపరుస్తాయని సైకాలజీ చెబుతుంది. కానీ, ఎప్పుడైతే గొడవ రాగానే ఒకరు దూరం జరుగుతారో.. ఆ దూరాన్ని అవకాశంగా తీసుకుని రెండో పర్సన్.. వారి ఉనికినే పూర్తిగా బ్లాక్ అవుట్ చేయడం మొదలుపెడతారో, అక్కడే ఆ రిలేషన్ అసలు రూపం బయటపడుతుంది.

సైకాలజీలో దీన్ని ఎమోషనల్ విత్‌డ్రాయెల్(Existence) లేదా డిఫెన్సివ్ హార్మ్‌లెస్ నెస్ అంటారు. అంటే, ఎదుటి వ్యక్తి తనను కంట్రోల్ చేస్తున్నారనో లేదా తనకు హాని చేస్తున్నారనో అనుకుని, తనను తాను కాపాడుకోవడానికి బ్రెయిన్ ఆటోమేటిక్‌గా ఇలాంటి డిఫెన్సివ్ మెకానిజంను(Existence) ఫాలో అవుతుంది. కానీ ఇదే పద్ధతిని భార్యాభర్తల రిలేషన్‌షిప్‌లో వాడితే మాత్రం అది వారి బంధాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తి కోపంగా ఉండి గట్టిగా మాట్లాడితే ఆ బాధ వేరు.. కానీ ఎదుటి వ్యక్తి ఉనికినే కంప్లీట్‌గా మాయం చేసి, పట్టించుకోకుండా ఉంటే ..ఆ దూరం కాస్తా ఇద్దరి మధ్య అంతుచిక్కని అంధకారంగా మారి చివరికి ఆ బంధమే ముగిసిపోతుంది.

ఇలా ప్రవర్తించేవారిలో మెయిన్‌గా కొన్ని మానసిక సమస్యలు కనిపిస్తాయి. వీరు తమ సొంత ఎమోషన్స్‌నే భరించలేరు. ఎదుటివారి బాధను అర్థం చేసుకునే శక్తి వీరికి అస్సలు ఉండదు. అందుకే బాధను ఫేస్ చేయడానికి బదులుగా ఆ సమస్యే లేదన్నట్లు ప్రవర్తించి తప్పించుకుంటారు. నేనే ఎందుకు తగ్గాలి..వాళ్లే వచ్చి సారీ చెప్పాలి అనే అహంకారం వీళ్లలో ఆవరించి ఉంటుంది.

ఈ ఈగో ముందు ప్రేమ, బంధం, అవతలి వారి పెయిన్ ఏవీ కనిపించవు. ఎదుటి వ్యక్తిని కేవలం మానసికంగా హింసించి..దాని ద్వారా తమ ఆధీనంలో ఉంచుకోవాలనేది ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి వీరిలో ప్రేమ,అభిమానం,ఇష్టం వంటివి ఉండవు. ఒక అవకాశవాదం, ఒక మానసిక అహంకార ప్రదర్శన మాత్రమే వారికి తెలుసు.

ఏ రిలేషన్ అయినా నిలబడాలంటే మాటలకంటే ముందు.. అవతలి మనిషి ఉనికికి వారిచ్చే విలువే అసలైన బలం అని తెలుసుకోవాలి. బంధం అనేది ఎప్పుడూ రెండు మనసుల వారధి అని వీరు తెలుసుకోవాలి. అంతే కానీ.. ఎవరో ఒకరిని మానసికంగా చంపే సైకలాజికల్ యుద్ధభూమి కాకూడదు. తమ అహంకారం గెలిస్తే బంధం ఓడిపోతుందని..తమ ప్రేమ గెలిస్తే అహం తలవంచుతుందని వీరికి అర్ధం అయినపుడే వారి బంధం నిలబడుతుంది.

Women Midlife Crisis : 45 ప్లస్ మహిళలు అటెన్షన్ ఎందుకు కోరుకుంటారు? మిడ్ లైఫ్ క్రైసిస్, ఫ్రీడమ్ ఆలోచనల మధ్య వారి లైఫ్ స్టైల్..

↑
Exit mobile version