Gen-Z Travel Trends : రూమ్ రొటింగ్, డ్రై ట్రిప్పింగ్ అంటే తెలుసా? జెన్-జీ యూత్ క్రియేట్ చేసిన 10 క్రేజీ ట్రావెల్ ట్రెండ్స్

Gen-Z Travel Trends : మిలీనియల్స్‌తో పోలిస్తే జెన్ జీ యూత్ ఎక్స్‌కర్షన్‌ స్టైల్‌ కంప్లీట్‌గా డిఫరెంట్. ఇప్పుడంతా మైక్రో కేషన్, సైడ్ క్వెస్టింగ్, రూమ్ రొటింగ్ వంటి ట్రెండీ ట్రావెల్ కాన్సెప్టులను ఫాలో అవుతున్నారు.

Gen-Z Travel Trends

ఓల్డ్ జనరేషనలో లేదంటే మిలీనియల్స్ టైమ్‌లో వెకేషన్ అంటే.. ఏవో హాలీడేస్ ఇచ్చినపుడు, లీవ్స్ కుదిరినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వన్ వీక్ టూర్ వెళ్లి ప్రదేశాలన్నిటినీ చుట్టేసి రావడం అనేలా ఉండేది. కానీ ఇప్పటి జెన్ జీ యూత్ మాత్రం విహారయాత్రలను(Gen-Z Travel Trends) కేవలం ఎంటర్‌ కోసమే కాకుండా, తమ లైఫ్‌కి ఒక మైండ్‌సెట్ రీఫ్రెష్‌మెంట్‌లా వాడుకుంటున్నారు. అందుకే రొటీన్ సైట్ సీయింగ్‌ను పక్కనపెట్టి ఫుల్ ట్రెండీ అండ్ డిఫరెంట్ ట్రావెల్ కాన్సెప్టులను క్రియేట్ చేస్తున్నారు.

వీటిలో ముందుగా వై-కేషన్ (Y-Cation).. అంటే ఏదో ఎదుటివాళ్లు వెళ్లారని మనమూ వెళ్లడం కాకుండా, అసలు మనం ట్రిప్‌కి ఎందుకు వెళ్తున్నాం? రిలాక్సేషన్‌కా, అక్కడ నుంచి నేర్చుకోవడానికా అని పక్కా రీజన్‌తో వెళ్తారు. తర్వాతది మైక్రో-కేషన్ (Micro-Cation).. ఏడాదికి ఒక పెద్ద ట్రిప్ వేసే బదులు, నెలకు ఒకసారి 2 రోజుల నుంచి 4 రోజులు చిన్న ట్రిప్‌లు వేసి డైలీ ఆఫీస్ స్ట్రెస్‌ను తగ్గించుకుంటున్నారు.

అలాగే దారిలో కనిపించే చిన్న చిన్న గ్రామాలు, జలపాతాలు ఆస్వాదిస్తూ వెళ్లడాన్ని సైడ్-క్వెస్టింగ్ (Side-Questing) అంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే లొకేషన్లు కాకుండా ఎవరికీ తెలియని సీక్రెట్ స్పాట్స్‌కి వెళ్లడాన్ని డి-ఇన్‌ఫ్లుయెన్స్డ్ ట్రావెల్ అని పిలుస్తున్నారు.

ఇక చాలా ఎక్కువ వర్క్ ప్రెజర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్లానింగ్ లేకుండా సడన్‌గా బ్యాగ్ సర్దుకుని పోవడాన్ని మెంటీ బి ట్రావెల్ (Menty B Travel) అని పిలుచుకుంటున్నారు.

వీటన్నింటికంటే వింతైనది రూమ్ రొటింగ్ (Room Rotting).. దీనిలో టూర్ లొకేషన్‌కు వెళ్తారు కానీ హోటల్ గది దాటి నిమిషం కూడా బయటకు రారు. రోజంతా హోటల్ రూమ్‌లోనే ఉంటూ కావాల్సింది ఆర్డర్ చేసుకుని తింటూ.. బాల్కనీ వ్యూని చూస్తూ కంప్లీట్ రెస్ట్ తీసుకుంటారు. అలాగే ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా హెల్దీ వర్కవుట్స్, యోగాలతో వెకేషన్ గడిపే పద్ధతిని డ్రై ట్రిప్పింగ్ (Dry Tripping) అని అంటున్నారు.

అంతేకాకుండా స్థానిక కథలు, నిజానిజాలు తెలుసుకునే లోకల్ లోర్ హంటింగ్ టూర్, రద్దీగా ఉండే మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్‌ను ఎంచుకునే డెస్టినేషన్ డూప్ (Destination Dupe) అలాగే తమ హాబీలకు తగినట్లుగా మాత్రమే మంచి లొకేషన్లు ఎంచుకునే మిర్రర్ ట్రిప్స్.. ఇలా రకరకాల కాన్సెప్టులతో ట్రిప్‌లను క్రియేట్ చేసుకుని జెన్ జీ యూత్ ట్రావెల్ వరల్డ్‌లో కొత్త ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు.

Spectacle Marks : కళ్లజోడు వల్ల ముక్కుపై మచ్చలు వచ్చాయా?.. ఈ సింపుల్ రెమెడీస్‌ ఫాలో అవ్వండి..

↑
Exit mobile version