Ghosting : ఏంటీ గోస్ట్ రిలేషన్‌షిప్? ఈ దెయ్యం బంధం వెనుక జరుగుతుందేంటి?

Ghosting : ప్రస్తుతానికి గోస్టింగ్ అనేది ఈజీ ఆప్షన్‌లాగే కనిపించొచ్చు. కానీ, లాంగ్ రన్‌లో ఇది మనుషులను ఎమోషన్స్ లేని రోబోలుగా మార్చేస్తుందని సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ghosting

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒకరితో ఒకరు ఎంత ఈజీగా కనెక్ట్ అవుతున్నారో.. అంతే ఈజీగా ఆ బంధం నుంచి తప్పుకుంటున్నారు. అయితే ఈ బంధాలను ముగించడానికి ఎలాంటి రీజన్స్ చెప్పకుండా కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా అవతలి వ్యక్తి జీవితం నుంచి సడన్‌గా మాయమైపోవడాన్నే సైకాలజీ భాషలో గోస్టింగ్ (Ghosting) లేదా గోస్ట్ రిలేషన్‌షిప్ అంటారు.

అంటే, నిన్నటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉంటూ, ప్రతీ విషయాన్నిషేర్ చేసుకునే వ్యక్తి.. సడన్‌గా ఫోన్ కాల్స్ ఎత్తడం మానేయడం, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం, ఇంకా చెప్పాలంటే టోటల్‌గా అవతలి వ్యక్తిని బ్లాక్ చేసేయడం చేస్తుంటారు. అవతలి వ్యక్తి బతికి ఉన్నా కూడా తమ పార్ట్‌నర్‌కు దొరకకుండా ఒక దెయ్యంలా కంటికి కనిపించకుండా మాయమైపోతారు కాబట్టే దీన్ని గోస్ట్ రిలేషన్‌షిప్ అని పిలుస్తున్నారు.

ఈ మోడ్రన్ ట్రెండ్ ఇటీవల ఇంతగా పెరగడానికి సైకలాజికల్ పరంగా ప్రధాన కారణం ఎమోషనల్ పిరికితనం అంటున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే ఒక బంధాన్ని ముగించాలి అంటే అవతలి వ్యక్తితో మాట్లాడాలి, తమ బ్రేకప్‌కు గల కారణాలు చెప్పాలి, ఎదుటివారి బాధను ఫేస్ చేస్తూ వారికి సమాధానం చెప్పాలి. కానీ నేటి యూత్‌లో చాలామందికి ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండటం లేదు.

ఫేస్ టు ఫేస్ మాట్లాడి బ్రేకప్ చెబితే వచ్చే గొడవలను, సెంటిమెంట్లను ఫేస్ చేసే ధైర్యం లేక, సింపుల్‌గా వాట్సాప్‌లో, ఇన్‌స్టాలో బ్లాక్ చేసి చేతులు దులిపేసుకుని దూరం అయిపోతున్నారు. డేటింగ్ యాప్స్, వర్క్ చేసే చోట వారికి కావాల్సినట్లుగా బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో, ఒకరితో ఇబ్బంది అనిపించగానే వారికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఇంకొకరి వైపు ఈజీగా షిఫ్ట్ అయిపోతున్నారు.

మరి ఈ అలవాటు సొసైటీకి, మనుషుల మానసిక స్థితికి మంచిదేనా అంటే,కచ్చితంగా ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణ బ్రేకప్ కంటే కూడా ఈ గోస్టింగ్ వల్ల అవతలి వ్యక్తి అనుభవించే మానసిక వేదన చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది.

అసలు తప్పెక్కడ జరిగింది, తను చేసిన తప్పేంటి అనే క్లారిటీ (Closure) లేకపోవడం వల్ల వాళ్లు అలా టెన్షన్ పడుతూ, కారణాలు వెతుకూ ఆత్మన్యూనతా భావానికి గురవుతారు. సొసైటీలో మనుషుల మధ్య ఉండాల్సిన కనీస బాధ్యత, నమ్మకం ఈ ట్రెండ్ వల్ల పూర్తిగా నశిస్తున్నాయి.

Ghosting

నిజానికి ఒక రిలేషన్ నచ్చకపోతే అందులో ఉంటూ ఇబ్బందులు పడకుండా.. బయటకు వెళ్లిపోవచ్చు. కానీ ఎలాంటి రీజన్ చెప్పకుండా, అవతలి వ్యక్తిని గాల్లో వదిలేసి సడన్‌గా దెయ్యంలా మాయమవ్వడం మాత్రం మోరల్లీ అండ్ మెంటల్లీ చాలా పెద్ద నేరం కిందకే వస్తుంది.

ప్రస్తుతానికి ఈ గోస్టింగ్ అనేది ఈజీ ఆప్షన్‌లాగే కనిపించొచ్చు. కానీ, లాంగ్ రన్‌లో ఇది మనుషులను ఎమోషన్స్ లేని రోబోలుగా మార్చేస్తుందని సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీతో ఇలాగే ప్రవర్తిస్తే, అది మీ తప్పు కాదని, అవతలి వ్యక్తి మానసిక బలహీనత అని అనుకుని, ఆ గోస్ట్ జ్ఞాపకాల నుంచి త్వరగా బయట పడండి. అప్పుడే మీ మెంటల్ హెల్త్‌ బాగుంటుంది.

Date Of Birth : ఈ నెంబర్ వారు ఈగో తగ్గించుకోకపోతే నష్టమే.. ఈ నెంబర్ వారికి ఆర్థికంగా గ్రోత్ కనిపిస్తోంది..

Exit mobile version