Grapes
ద్రాక్ష పండ్లు ఎంత రుచిగా ఉండటమే కాదు.. మన ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువే మంచి చేస్తాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ కె తో పాటు గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి.
అయితే కొంతమంది ద్రాక్షను(Grapes) మార్కెట్ నుంచి తెచ్చి డైరెక్టుగా తినేస్తుంటారు. కానీ ద్రాక్ష పండ్లపై దుమ్ము, ధూళితో పాటు పంట పండించేటప్పుడు పిచికారీ చేసే పురుగుమందుల అవశేషాలు వంటివి ఉంటాయి. ఇలాంటివి తింటే ఆరోగ్యం మాట దేవుడెరుగు..అనారోగ్యం బారిన పడతారు. అందుకే ద్రాక్షను సరైన పద్ధతిలో శుభ్రం చేసుకున్నాకే తినాలని నిపుణులు చెబుతున్నారు
ముందుగా ద్రాక్షపండ్ల గుత్తి నుంచి పండ్లను విడివిడిగా విడదీయాలి. గుత్తిలాగే కడిగితే లోపల ఉండే పండ్లకు నీరు సరిగ్గా తగలక మట్టి, కెమికల్ అవశేషాలు అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత పండ్లను టాప్ వాటర్ కింద ఉంచి, చేతులతో మెల్లగా రుద్దుతూ ఒక నిమిషం పాటు కడగాలి.
ఇక ద్రాక్ష(Grapes) పండ్లపై ఉన్న పురుగుమందులు పోవాలంటే బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో ద్రాక్ష పండ్లను వేసి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసి మళ్లీ మంచి నీటితో కడిగితే పండ్లపై ఉన్న కెమికల్స్ చాలావరకు తొలగిపోతాయి.
బేకింగ్ సోడా ఇంట్లో లేకపోతే కొద్దిగా వైట్ వెనిగర్ కలిపిన నీటిలో కూడా ద్రాక్షను నానబెట్టొచ్చు.ఒకవేళ అది కూడా లేకపోతే సాల్ట్ వేసి నానబెట్టి తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేయాలి.
కడిగిన ద్రాక్షను తడి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. లేదంటే త్వరగా కుళ్లిపోవడం, బూజు పట్టడం వంటివి జరుగుతాయి. అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ద్రాక్షను కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.
ఇలా ద్రాక్షను తినే ముందు నీట్‌గా కడగడం వల్ల ప్రమాదకరమైన కెమికల్స్ నుంచి కాపాడుకోవచ్చు. అయితే ఇలా కడిగినా కూడా వంద శాతం కెమికల్స్ పోతాయని చెప్పలేం. అందుకే మంచి క్వాలిటీ ఉన్న పండ్లను నమ్మకమైన షాపుల్లో కొనడం మంచిది.
Sravana Masam : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు?.. భక్తి వెనుక సైన్స్ కూడా ఉందా?
