Karma : మంచి వాళ్లకే అన్ని కష్టాలా? కర్మ మనతో ఆడుకునే ఆట వెనుక రహస్యం

Karma : కర్మ మనతో ఆడుకునే ఈ విచిత్రమైన ఆట వెనుకున్న రహస్యం ఏంటనే విషయానికి వస్తే, అటు ఆధ్యాత్మిక కర్మ సిద్ధాంతం.. ఇటు ఆధునిక సైకాలజీ కూడా చాలా చిత్రమైన సమాధానాలు చెబుతున్నాయి.

Karma

నేనెవరికీ ఏ కీడూ చేయలేదు..నాకు చేతనైనంత సాయమే చేశాను. మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మోసాలు, కన్నీళ్లు ఎదురవుతున్నాయని అన్పిస్తుందా? నిజానికి ఇది జీవితంలో ప్రతి ఒక్కరి మనసును ఏదొక దశలో వేధించే అతిపెద్ద ప్రశ్న .

సొసైటీలో సుమారు 90 శాతం మంది అనుభవించే ఒక నిశ్శబ్ద మానసిక సంఘర్షణ కూడా ఇదే. మంచి వాళ్లకెప్పుడూ కష్టాలే ఉంటాయా.. అసలు కర్మ(Karma) మనతో ఆడుకునే ఈ విచిత్రమైన ఆట వెనుకున్న రహస్యం ఏంటనే విషయానికి వస్తే, అటు ఆధ్యాత్మిక కర్మ సిద్ధాంతం.. ఇటు ఆధునిక సైకాలజీ కూడా చాలా చిత్రమైన సమాధానాలు చెబుతున్నాయి.

ముందుగా కర్మ(Karma) సిద్ధాంతం ప్రకారం కనుక దీనిని చూస్తే.. మనమిప్పుడు అనుభవిస్తున్నదంతా కేవలం ఈరోజు చేసిన పనుల ఫలితం మాత్రమే కాదు. దీనినే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే ఇది మన గత జన్మల , గత కాలపు పనుల తాలూకా పెండింగ్ అకౌంట్ అన్నమాట.

ఉదాహరణకు బ్యాంకులో మనకొక పాత అప్పు ఉందనుకోండి. ఇప్పుడు మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ డబ్బు మొదట పాత అప్పు కిందకే జమ అవుతుంది.

మన లైఫ్ కూడా అంతే, గతంలో మనకు తెలీకుండా చేసిన కొన్ని పనుల తాలూకా బ్యాలెన్స్, ఇప్పుడు మనకు కష్టాల రూపంలో ఎదురవుతోంది. ప్రస్తుతం మనం చేస్తున్న మంచి పనుల రిజల్ట్ మన ఫ్యూచర్‌లో కచ్చితంగా అందుతుంది. అయితే ప్రస్తుతానికి ఆ పాత కర్మల క్లియరెన్స్ జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి.

అయితే ఇక్కడే కర్మ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. జీవితంలో మనకు ఒక అద్భుతమైన ప్లేస్‌ను లేదా ఒక పెద్ద సక్సెస్‌ను ఇచ్చే ముందు.. ప్రకృతి మనల్ని పూర్తిగా పరీక్షలు పెట్టి, రాటుదేల్చాలని అనుకుంటుంది.

ఒక ఇనుమును కాల్చి వంచితేనే అది పదునైన ఆయుధంగా మారుతుంది. ఒక శిల్పాన్ని చెక్కితేనే కానీ అందమైన రూపం రాదు, ఉలి దెబ్బలు తింటేనే రాయి దేవుడి విగ్రహం అవుతుంది.

కష్టాలు కూడా అలాంటివే. కర్మ మనల్ని ఏడిపించడానికి కాదు, మనలోని అంతర్గత శక్తులను బయటకు తీసి, ఫ్యూచర్‌లో వచ్చే ఒక పెద్ద విజయానికి మనం అర్హత సాధించేలా తయారు చేయడానికే ఈ పెద్ద పరీక్షలు పెడుతుంది.

ఇక సైకాలజీ కోణంలో చూస్తే.. దీనిని జస్ట్-వరల్డ్ ఫినామినా అంటారు. అంటే మనం మంచి చేస్తే ప్రపంచం మనకు మంచి మాత్రమే చేయాలి అనుకోవడం మనందరి నేచురల్ మైండ్ సెట్‌.

కానీ ప్రాక్టికల్‌గా చూస్తే.. మనం మంచి వాళ్లం అయినంత మాత్రాన, ఎదుటివాళ్లు కూడా అలాగే ఉంటారని, ఉండాలని లేదు. పులికి మనం హాని చేయం కదా అని అది మనల్ని తినకుండా వదిలేయదు కదా. అలాగే మంచి చేయడమనేది మన వ్యక్తిత్వం. కానీ ఎదుటివారి నుంచి కూడా సేమ్ అదే ఆశించి మనల్ని మనమే మానసికంగా బలహీనపరుచుకోకూడదు.

Karma

అందుకే నాకే ఎందుకిలా జరుగుతోందని ఎప్పుడూ కుంగిపోకూడదు. మనం చేస్తున్న మంచి ఎక్కడికీ పోదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వస్తున్న కష్టాలన్నీ మనలో ఉన్న ఓపికను, స్థిరత్వాన్ని పెంచడానికి కర్మ ఇస్తున్న ఒక చిన్న విరామం మాత్రమే.

రాత్రి పూట చీకటి ఎంత దట్టంగా ఉంటే, ఆ ఉదయం అంత త్వరగా వస్తుందన్న సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే కష్టాల వెనుక ఒక అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంది. అందుకే త్వరలోనే మనకు రావలసిన మంచి మనల్ని అలాగే వెతుక్కుంటూ వస్తుందని గట్టిగా నమ్మాలి.

Rashi Phalalu : కొత్త నెలలో మీ అదృష్టం ఎలా మారబోతోంది?..ఈరోజు ఆకస్మిక ధనయోగం పట్టే రాశులు ఇవే..

Exit mobile version