Mid Life Crisis : ఏజ్ పెరుగుతున్నా పులిహోర కింగ్‌లుగా ఎందుకు ప్రవర్తిస్తారు? మిడ్ లైఫ్ క్రైసిస్ ఎఫెక్ట్ తెలుసా?

Mid Life Crisis : వయసు పెరుగుతున్నా కొందరు మగవాళ్లు అమ్మాయిలతో మాట్లాడటానికి, అడగకుండానే హెల్ప్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తారు? దీని వెనుక ఉండే సైకాలజీ ఏంటి?

Mid Life Crisis

ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనుషుల ఆలోచనల్లో మెచ్యూరిటీ రావాలి. కానీ కొంతమంది మాత్రం అందుకు పూర్తి డిఫరెంట్‌గా ప్రవర్తిస్తుంటారు. వయసు నాలుగు దశాబ్దాలు దాటినా తెల్లవెంట్రుకలు వస్తున్నా.. తాము ఇంకా యువకులమే అన్నట్లు భ్రమపడుతుంటారు. అలా అని అందరూ అలా ఉండరు, మెజారిటీ మగవాళ్లు బాధ్యతగానే నడుచుకుంటారు. కానీ ఈ కొద్దిమంది మాత్రం ప్రత్యేకమైన సైకలాజికల్ రీజన్స్ వల్ల ఇలా ప్రవర్తిస్తుంటారని మానసిక నిపుణులు అంటున్నారు. దీనినే మిడ్ లైఫ్ క్రైసిస్(Mid Life Crisis) అంటారని చెబుతున్నారు.

ఏజ్ పెరుగుతున్న కొద్దీ వయసు అయిపోతుందనే అభద్రతా ఫీలింగ్ వారిని లోలోపల కుదిపేస్తుంటుంది. అద్దంలో తమను తాము చూసుకున్నప్పుడు కనిపించే లక్షణాలను వారి బ్రెయిన్‌ అస్సలు ఒప్పుకోదు. తమకు ఇంకా ఆకర్షణ తగ్గలేదని, నేటితరంతో పోటీ పడగలమనే భ్రమను తమకు తాము ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తుంటారు.

కొంతమందికి ఎన్నో ఏళ్లుగా ఒకే రకమైన ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు వీరిని చెప్పుకోలేని నిరుత్సాహానికి గురి చేస్తాయి. జీవితం చాలా బోరింగ్‌గా మారిపోయిందని భావిస్తూ.. ఆ మొనాటనీ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఎంతో కొంత ఉత్సాహం తెచ్చుకోవడం కోసం ఇలాంటి మార్గాలను వెతుక్కుంటారు.

ఇంట్లో భార్య, కుటుంబ సభ్యులు తమను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ వీళ్లలో బలపడిపోతుంది. బయట ఎవరో ఒకరు తమతో నవ్వుతూ మాట్లాడినా, తమను చిన్నగా పొగిడినా కూడా అది వీళ్లకు పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపిస్తుంది. అందుకే అలాంటి టెంపరరీ అటెన్షన్ కోసం ప్రాకులాడతారు.

ఇంకొంతమందికి అయితే అమ్మాయిలతో మాట్లాడటం, కాస్త చనువుగా ఉండటమనేది వాళ్ల ఈగోకు ఒక పెద్ద కిక్ ఇస్తుంది. నాతో బాగానే క్లోజ్ అవుతున్నారనే ఫీలింగ్ వాళ్లలో ఒక సంతృప్తిని ఇస్తుంది. అందుకే అడగకపోయినా సాయం చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవడం, , తాము ఎంత కేరింగ్ పర్సనో ప్రొజెక్ట్ చేసుకోవడం వంటివి చేస్తూ వాళ్ల కోసం తాపత్రయపడతారు.

అలాగే కొంతమందికి వయసు పెరిగినా..బ్రెయిన్‌లోని కొన్ని ఎమోషనల్ యాస్పెక్ట్స్ టీనేజ్ దశలోనే ఆగిపోతాయి. బాధ్యతలను ఎదుర్కొనే ధైర్యం లేక, ఆ టెన్షన్ నుంచి టెంపరరీగా తప్పించుకోవడానికి ఇలాంటి ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్‌ను ఆశ్రయిస్తారు. లైఫ్‌ను సరిగ్గా అర్థం చేసుకున్నవాళ్లు ఎవరైనా సరే.. తమ వయసుకు తగిన గౌరవాన్ని కాపాడుకుంటారు కానీ, ఇలాంటి కొద్దిమంది మాత్రం ఇలాంటి మిడ్ లైఫ్ క్రైసిస్(Mid Life Crisis) చేష్టలతో నలుగురిలోనూ, ఇంట్లోనూ చులకనవుతుంటారు.

Diabetes Day : సైలెంట్ కిల్లర్ డయాబెటిస్.. దేశంలో 43 శాతం మందికి తెలీకుండానే మధుమేహం

↑
Exit mobile version