Diabetes Day
నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని(Diabetes Day) పురస్కరించుకుని తాజాగా రిలీజైన ఓ ఇంటర్నేషనల్ సర్వే దేశవ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. భారతదేశంలో దాదాపు 3.86 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్తో బాధపడుతున్నా కూడా, ఆ విషయం వారికి ఏమాత్రం తెలీకుండానే కాలం వెళ్లదీస్తున్నట్లు ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం డయాబెటిస్ బాధితుల్లో ఏకంగా 43 శాతం మంది ఇప్పటివరకు ఎలాంటి డయాగ్నిస్టిక్ టెస్ట్లు చేయించుకోలేదు. దీనివల్ల ప్రస్తుతం భారత దేశంలో డయాబెటిస్ నిర్ధారణ రేటు కేవలం 57 శాతంగానే నమోదవుతుండటం గమనార్హం.
టైప్ 2 డయాబెటిస్ అనేది బాడీలో ఎలాంటి ముందస్తు వార్నింగ్స్ లేకుండా నిశ్శబ్దంగా విస్తరించే ఒక డేంజరస్ ప్రాబ్లెమ్. బ్లడ్లో చక్కెర స్థాయిలు నెలలు లేదా ఏళ్ల తరబడి ఎక్కువగా ఉన్నా కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. కొద్దిగా అలసట, దృష్టి మందగించడం వంటి చిన్నచిన్న లక్షణాలు కనిపించినా.. చాలామంది వాటిని డైలీ లైఫ్లో పని ఒత్తిడి, లేదా నిద్రలేమిగా భావించి డయాబెటస్ను తేలిగ్గా తీసుకుంటుంటారు. విపరీతమైన దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలు పూర్తిగా కనిపించే వరకు వేచి చూస్తే ఈలోగా పరిస్థితి చేజారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సర్వేలో వెల్లడైన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రీ డయాబెటిస్ విషయంలో ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నా కూడా.. పూర్తి డయాబెటిస్ స్థాయికి చేరని ఈ స్టేజిలో స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయని సుమారు 75 శాతం మంది తప్పుగా నమ్ముతున్నారు. సర్వే జరిగిన దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే ఈ విధమైన సగం సగం అవగాహన ఎక్కువగా ఉందని తేలింది. సొంతంగా ముందస్తు టెస్ట్లు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలీక, భయంతో సుమారు సగం మంది వెనుకంజ వేస్తున్నారు.
ఫ్యామిలీలో వంశపారంపర్యంగా డయాబెటిస్ హిస్టరీ ఉన్నవారు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండేవారు, ఓవర్ వెయిట్ , అధిక రక్తపోటు ఉన్నవారు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. కేవలం లక్షణాల కోసం ఎదురుచూడకుండా, రెగ్యులర్గా ముందే స్క్రీనింగ్ చేయించుకోవడమే ఈ డేంజరస్ ముప్పు నుంచి బయటపడేయగల ఏకైక మార్గమని వైద్యులు చెబుతున్నారు.
Megaverse : నెట్ఫ్లిక్స్లో మెగాస్టార్ హంగామా.. సంక్రాంతికి చిరు మెగావర్స్ డిజిటల్ ఎంట్రీ..
