Palathalikala Payasam : వినాయక చవితి స్పెషల్..పర్ఫెక్ట్ తాలికల పాయసం రెసిపీ..

Palathalikala Payasam : తాలికల పాయసం చేసినపుడు తాలికలు ముక్కలుగా అయిపోవడం, బెల్లం పాకం వేయగానే పాలు విరిగిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.

Palathalikala Payasam

ఏ పండుగ అయినా, ఏ శుభకార్యం అయినా తెలుగు లోగిళ్లు మాత్రం పాయసం ఘుమఘుమలు ఉండాల్సిందే. ముఖ్యంగా గణేష్ చతుర్థి వస్తే ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా పెట్టే పాల తాలికల పాయసం అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే కొంతమంది ఈ పాయసం చేసినపుడు తాలికలు ముక్కలుగా అయిపోవడం, బెల్లం పాకం వేయగానే పాలు విరిగిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా ఈసారి పక్కా కొలతలతో, పర్ఫెక్ట్ టేస్ట్‌తో పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాం.

దీనికోసం నానబెట్టిన బియ్యం -1.5 కప్పులు, బెల్లం -1 కప్పు, ఫ్రెష్ పాలు -అర లీటర్, నానబెట్టిన సగ్గుబియ్యం -2 స్పూన్లు, యాలకుల పొడి -1 స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు-3 స్పూన్లు, జీడిపప్పు, కిస్‌మిస్, నెయ్యి -2 స్పూన్లు.

ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఆరబెట్టి, మిక్సీలో మెత్తగా పౌడర్‌గా చేసి జల్లించుకోవాలి. పాయసం చిక్కగా రావడం కోసం రెండు చెంచాల బియ్యం పిండిని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో కొద్దిగా బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరిగించి స్టవ్ ఆపేయాలి.

ఆ వేడి బెల్లం నీళ్లలో ఒక కప్పు బియ్యం పిండిని వేసి, మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చేతి వేళ్లతో మెల్లగా పొడవాటి తాలికల్లా ఒత్తుకోవాలి. మరో గిన్నెలో కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి కరిగించి, ఆ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

Palathalikala Payasam

ఒక వెడల్పాటి పాత్రలో పాలు, పావు లీటర్ వరకూ నీళ్లు కలిపి మరిగించాలి. పాలు కాస్త మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి సగం ఉడికిన తర్వా, తాలికలను మెల్లగా పాలలో వేయాలి. తాలికలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపేయకూడదు. చిన్న మంటపై 5 నిమిషాల పాటు మూతపెట్టి ఉడికిస్తే తాలికలు విరగవు. తాలికలు ఉడికిన తర్వాత, పక్కన పెట్టుకున్న బియ్యం పిండిలో కొంచెం నీళ్లు కలిపి పాలలో పోస్తే పాయసం చిక్కగా వస్తుంది.

తాలికలు పూర్తిగా ఉడికాక స్టవ్ ఆపేసి … అందులో యాలకుల పొడి వేసి, చల్లారిన బెల్లం పాకాన్ని వడకట్టి అది కూడా పాలలో కలపాలి. బెల్లం పాకం చల్లారాక కలపడం వల్ల పాయసం విరిగిపోదు. చివరగా నెయ్యిలో వేయించిన ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్‌మిస్‌లను తాలికల పాయసం( Palathalikala Payasam)లో కలిపితే ఘుమఘుమలాడే గణనాథునికి సమర్పించే తాలికల పాయసం( Palathalikala Payasam) రెడీ అవుతుంది.

DA Hike : ఉద్యోగులకు, పెన్షనర్లకు మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి డబుల్ డీఏ..

Exit mobile version