Rakhi Gift : మీ సోదరి మైండ్‌ని రీచ్ అయ్యే స్పెషల్ గిఫ్ట్..చక్రాల థెరపీతో మ్యాజికల్ రాఖీ ఐడియాస్..

Rakhi Gift : మీ సోదరి ప్రస్తుతం తన లైఫ్‌లో ఏ స్టేజ్‌లో ఉందో, మానసికంగా ఆమెకు ఏ సపోర్ట్ అవసరమో ఆలోచించి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

Rakhi Gift

రక్షాబంధన్ రాగానే ఈసారి నా చెల్లికి లేదా అక్కకి ఏ గిఫ్ట్ ఇవ్వాలనే గందరగోళం ప్రతీ సోదరుడిలోనూ మొదలవుతుంది. షాప్‌కెళ్లి చూడటానికి అందంగా ఉండే ఏదో ఒక జ్యువెలరీనో లేక స్వీట్ బాక్సో , బట్టలో కొని ఇచ్చేయడం చాలా రొటీన్ అయిపోయింది. ఈసారి అలా కాకుండా, మీ సోదరి ప్రస్తుతం తన లైఫ్‌లో ఏ స్టేజ్‌లో ఉందో, మానసికంగా ఆమెకు ఏ సపోర్ట్ అవసరమో ఆలోచించి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

మన బాడీలో ఉండే చక్రాల (Chakras) బ్యాలెన్స్‌ని బేస్ చేసుకుని ఇచ్చే స్పిరిచ్యువల్ అండ్ మైండ్‌ఫుల్ గిఫ్ట్స్ ఇస్తే మంచిదని అంటున్నారు. ఆమెకి ఏం ఇష్టమో అని కాకుండా, ఈ టైమ్‌లో తనకు దేని సపోర్ట్ అవసరమో ఆలోచించి ఇచ్చే చిన్న కానుక కూడా సోదరి మనసును లోతుగా తాకుతుంది. మరి మీ సోదరికి సరిపోయే ఆ స్పెషల్ చక్ర గిఫ్ట్స్ ఏంటో ఒకసారి డీటెయిల్డ్‌గా తెలుసుకోండి.

స్థిరత్వం కోరుకునే సోదరి కోసం (రూట్ చక్ర).. మీ సిస్టర్ రీసెంట్‌గా కొత్త సిటీకి మారినా, కొత్త ఉద్యోగంలో చేరినా, లేదా లైఫ్‌లో ఏదైనా పెద్ద ఛేంజ్‌ను ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ కోసం చూస్తుంటే తనకు రూట్ చక్ర గిఫ్ట్ పెర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీని కోసం బ్లాక్ టూర్మలైన్, స్మోకీ క్వార్ట్జ్ లేదా రెడ్ జాస్పర్ క్రిస్టల్ బ్రాస్‌లెట్ రాఖీ బహుమతులుగా ఇవ్వొచ్చు. దీంతో పాటు చందనం లేదా వెటివర్ సువాసనల క్యాండిల్స్, స్నేక్ ప్లాంట్ లేదా చిన్న జేడ్ ప్లాంట్ కాంబినేషన్‌గా ఇవ్వడం మంచిది. నువ్వు ఎప్పుడూ నీ లైఫ్‌లో సంతోషంగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాననే ఒక చిన్న మెసేజ్ నోట్ కూడా ఈ గిఫ్ట్‌కు యాడ్ చేయండి.

లైఫ్‌లో హ్యాపీనెస్ తగ్గిన సోదరి కోసం (సాక్రల్ చక్ర).. డైలీ ఆఫీస్ పనులు, బాధ్యతలతో సతమతమవుతూ తనలోని ప్యాషన్, క్రియేటివిటీ, నిజమైన సంతోషాన్ని కోల్పోయిన సోదరికి ఇది సరైన ఛాయిస్. దీనికి కార్నెలియన్, ఆరెంజ్ కాల్సిట్ లేదా సన్‌స్టోన్ బ్రాస్‌లెట్ లేదా కీచైన్ సెలక్ట్ చేసుకోవచ్చు. వెనిల్లా, దాల్చినచెక్క సువాసనల క్యాండిల్స్, ఒక చిన్న కలర్‌ఫుల్ ఫ్లవర్ ప్లాంట్‌తో పాటు ఆమె రాసుకోవడానికి ఒక ప్రెట్టీ డైరీ ఇచ్చి..నీ ముఖంలోని నవ్వు, సంతోషం ఎప్పటికీ దూరం కాకూడదని మొదటి పేజీలో రాసి కానుకగా అందించండి.

ఆంబిషియస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సినవారికి (సోలార్ ప్లెక్సస్ చక్ర).. ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కెరీర్‌లో పెద్ద టార్గెట్‌లు ఫిక్స్ చేసుకుని ధైర్యంగా అడుగులు వేస్తున్న సిస్టర్‌ కోసం ఇది బెస్ట్. సిట్రైన్, టైగర్స్ ఐ లేదంటే పైరైట్ క్రిస్టల్ విగ్రహాలు లేదా బ్రాస్‌లెట్ ఇవ్వొచ్చు. దీనికి తోడు లెమన్, బెర్గామోట్ ఎసెన్షియల్ ఆయిల్స్, సన్ ఫ్లవర్ లేదా చిన్న సక్యులెంట్ ప్లాంట్ గిఫ్ట్‌గా ఇచ్చి..నీ పవర్ ఏంటో ఎప్పటికీ మర్చిపోకు.. నీపై నీకున్న నమ్మకమే నీ విజయం అనే మెసేజ్ ఇస్తే ఆమెలో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది.

ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన సోదరి కోసం (హార్ట్ చక్ర).. ఏదైనా పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్, లవ్ బ్రేకప్ లేదా లోన్లీనెస్‌తో బాధపడుతున్న సోదరికి మీ ప్రేమను తెలియజేయడానికి ఈ గిఫ్ట్ సెట్ చేయాలి. రోజ్ క్వార్ట్జ్, గ్రీన్ అవెంచురిన్ పెండెంట్ లేదా బ్రాస్‌లెట్ ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు రోజ్ లేదంటే జాస్మిన్ సువాసనల పర్‌ఫ్యూమ్, హార్ట్‌లీఫ్ ఫిలోడెండ్రాన్ ప్లాంట్ ఇవ్వొచ్చు. మీ చిన్ననాటి జ్ఞాపకంతో ఉన్న ఒక ఫోటోను యాడ్ చేస్తూ నువ్వు మాకు ఎంత ప్రాణమో ఎప్పుడూ గుర్తుంచుకో అంటూ నోట్ రాయండి.

మనసులో మాటలు బయటకు చెప్పలేని సోదరి కోసం (త్రోట్ చక్ర) ..మనసులో ఎంతో బాధ లేదా ఫీలింగ్స్ ఉన్నా బయటకు ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేయలేక ఇబ్బందిపడే చెల్లెలి కోసం ఇది పర్ఫెక్ట్. బ్లూ లేస్ అగేట్, అక్వామరీన్ లేదంటే సోడాలైట్ రాళ్లు ఆమె బెడ్‌సైడ్ ఉంచుకోవడానికి ఇవ్వొచ్చు. అలాగే యూకలిప్టస్ లేదా లావెండర్ క్యాండిల్స్, పుదీనా లేదా లావెండర్ మొక్క కాంబినేషన్ వీరికి సెట్ అవుతుంది. నీ నిజాయితీగల మాటను డేరింగ్‌గా చెప్పే ధైర్యం నీకెప్పుడూ ఉండాలనే చెబుతూ రాసిచ్చే మాటలు ఆమెకు కొండంత బలాన్నిస్తాయి.

Rakhi Gift

క్లారిటీ కోసం వెతుకుతున్న సోదరికి (థర్డ్ ఐ చక్ర)..లైఫ్‌లో ఏ దారిలో వెళ్లాలో తెలీక, డెసిషన్స్ తీసుకోలేక క్లారిటీ కోసం తపించే సోదరికి థర్డ్ ఐ చక్ర గిఫ్ట్స్ ఎనర్జీని ఇస్తాయి. అమేథిస్ట్, లాబ్రడోరైట్ లేదంటే లాపిస్ లాజులి పల్మ్ స్టోన్ పడక కింద పెట్టుకోవడానికి ఇవ్వొచ్చు. లావెండర్ లేదా చందనం ఎసెన్షియల్ ఆయిల్, రోజ్‌మేరీ మొక్కతో పాటు ఒక థాట్స్ రాసుకునే జర్నల్ ఇచ్చి.. లైఫ్ కన్ఫ్యూజింగ్‌గా అనిపించినప్పుడు నీకు సరైన మార్గం కనిపించాలని విష్ చేయండి.

పీస్ ఆఫ్ మైండ్ కావాల్సినవారికి (క్రౌన్ చక్ర).. ఎప్పుడూ పనులతో బిజీగా ఉంటూ మెంటల్ ఎగ్జాస్టియోన్‌కి గురయ్యే చెల్లెలికి ప్రశాంతతను ఇచ్చే కానుక ఇది. అమేథిస్ట్, క్లియర్ క్వార్ట్జ్ లేదంటే సెలెనైట్ కంబైన్డ్ క్రిస్టల్స్ బ్రాస్‌లెట్ ఇస్తే మైండ్ కూల్ అవుతుంది. పీస్ లిల్లీ ప్లాంట్, నెగెటివిటీ తొలగించే సాంబ్రాణి లేదా సేజ్ కిట్ ఇస్తూ.. ఎంత హడావుడిలో ఉన్నా నీ మనసులో ప్రశాంతత ఎప్పుడూ నిలిచిపోవాలని నోట్ రాసిస్తే ఈ రాఖీ పండుగ ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.

Emotional Unpredictability : ఒకసారి క్లోజ్.. మరోసారి డిస్టెన్స్.. అర్థం కాని ఆ ప్రవర్తన వెనుక ఏముంది?

Exit mobile version