Relationship
ఒక బంధంలో ఇద్దరూ ఎంతో మంచివారైనా, మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని ఎప్పుడూ తప్పుబడుతూ, లేనిపోని నిందలు వేస్తుంటారు. అయితే ఇలాగే ఉంటే కొద్దిరోజులకు ఆ రెండో వ్యక్తిలో నిజంగానే నెగిటివ్ మార్పు వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అప్పటి వరకు ఎంతో నిజాయితీగా, ఓపికగా ఉన్న ఎదుటి వ్యక్తి కూడా మెల్లమెల్లగా మొదటి వ్యక్తి ఊహించినట్లే కోపంగా, నిర్లక్ష్యంగా, తప్పులు చేయడం వంటివి ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఈ విధమైన మానసిక మార్పును సైకాలజీ భాషలో బిహేవియరల్ కన్ఫర్మేషన్ లేదా సెల్ఫ్ ఫుల్‌ఫిల్లింగ్ ప్రొఫెసీ అని పిలుస్తారు.
అంటే, ఒక వ్యక్తి గురించి మనం మనసులో ఒక నెగిటివ్ అంచనాకు వచ్చేసి, నిత్యం వారిని అలాగే ట్రీట్ చేస్తూ ఉంటే, ఆ మాటల ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్తూ నిజంగానే ఆ తప్పులు చేసేలా మారిపోతాడు. అంటే వారి మాటలే ఎదుటి వారి ప్రవర్తనను శాసించి, ఎదుటివారిలోని మంచిని చంపేసి వారిని చెడ్డవారిగా మారుస్తాయి.
ఈ సైకలాజికల్ ఛేంజ్ వెనుక ముఖ్యంగా మానసిక అలసట దాగి ఉంటుంది. రెండో వ్యక్తి ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, మొదటి వ్యక్తి నుంచి ఎప్పుడూ విమర్శలు, అనుమానాలు, నిందలు మాత్రమే ఎదురవుతున్నప్పుడు వారి బ్రెయిన్ ఒక రకమైన డిజప్పాయింట్‌మెంట్‌కు గురవుతుంది.
తాను ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా నచ్చడం లేదు కదా, తానేం చేసినా తనను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు కదా అనే భావన మనసులో బలంగా నాటుకుపోతుంది. దీనివల్ల తాను మంచిగా ఉండి కూడా వేస్ట్ అనే ఒక విరక్తి భావం ఏర్పడి, మొదటి వ్యక్తి ఏ నిందలయితే వేస్తున్నాడో,, కచ్చితంగా ఆ పనులనే చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడూ నెగిటివ్ మాటలు వినడం వల్ల సానుకూల శక్తి నశించి, బంధం(Relationship)పై గౌరవం తగ్గిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలాంటి బలమైన ) రిలేషన్స్(Relationship) అయినా సరే కొద్ది రోజుల్లోనే ముక్కలైపోతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒకరిని మార్చాలనే తాపత్రయంతో ఎప్పుడూ విమర్శిస్తుంటే అదే చివరికి వారిని పూర్తిగా దూరం చేస్తుంది.
అందుకే బంధాలలో ఎప్పుడూ లేనిపోని అపోహలతో అవతలి వ్యక్తిని నిందించకూడదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలే తప్ప నెగిటివ్ మాటలతో వారిని ఇబ్బంది పెట్టకూడదు.
అలా కాకుండా ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించి అభినందిస్తూ ఉండాలి. పదేపదే నువ్వు ఆ తప్పు చేశావు ఈ తప్పు చేశావు అనకుండా నిజానిజాలను అర్ధం చేసుకుంటేనే ఆ బంధం(Relationship) నిలబడుతుంది. నిత్యం నిందలు వేయడం వల్ల దూరం పెరిగి…ఒక మంచి మనిషి మనకు శత్రువుగా మారిపోతాడన్న చేదు నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
Blue Moon :3 ఏళ్ల తర్వాత అరుదైన బ్లూ మూన్ వింత..భారత్‌లో ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా?
