Relationship Rule : పెళ్లి, ప్రేమకు ముందు 6 నెలల గోల్డెన్ రూల్ అవసరమా? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?

Relationship Rule : హనీమూన్ ఫేజ్‌లో ఉన్నపుడు ఎదుటి మనిషిలో ఎన్ని లోపాలున్నా సరే వారికి అస్సలు కనిపించవు. ఒకవేళ కనిపించినా చాలా చిన్నవిగా కనిపిస్తాయి.

Relationship Rule

తన పార్ట్‌నర్ తన కోసమే పుట్టారని.. తనతో లైఫ్ అంతా లవ్లీగా ఉంటుందనుకుని 2,3 వారాల పరిచయంతోనే పెళ్లి పీటలు లేదా, లవ్ రిలేషన్‌షిప్‌లోకి దూకేస్తుంటారు చాలామంది. అయితే స్టార్టింగ్‌లో కనిపించే ఆ కలర్‌ఫుల్ ప్రపంచం కాస్త మసకబారగానే.. పార్ట్‌నర్‌లో అప్పటివరకు కనిపించని వంద మైనస్‌లు బయటపడటం మొదలవుతాయి.

నిజానికి ఒక మనిషి అలవాట్లు, అభిరుచులు, మైండ్‌సెట్ తెలుసుకోకుండా ప్రేమలో పడటం లేదా పెళ్లి చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేదానిపై సైకాలజిస్టులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. లవ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వారి బ్రెయిన్‌లో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్లు బాగా రిలీజ్ అవుతాయి. సైకాలజీ భాషలో దీన్ని హనీమూన్ ఫేజ్ అంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఈ హనీమూన్ ఫేజ్‌లో ఉన్నపుడు ఎదుటి మనిషిలో ఎన్ని లోపాలున్నా సరే వారికి అస్సలు కనిపించవు. ఒకవేళ కనిపించినా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆ టైమ్‌లో వాళ్లలోని పాజిటివ్స్ మాత్రమే హైలైట్ అవుతాయి. సరిగ్గా ఓ 3 నుంచి 6 నెలలు దాటేసరికి ఈ హ్యాపీ హార్మోన్ల ఇంపాక్ట్ తగ్గడం, ప్రాక్టికల్ లైఫ్ స్టార్ట్ అవడంతో అసలు సినిమా కనిపిస్తుంది. అప్పుడు అయ్యో తను నా మాట వినడం లేదని.. తినే తిండి దగ్గర్నుంచి ఖర్చు పెట్టే డబ్బు వరకు దేనికీ కూడా తామిద్దరి మధ్య మ్యాచ్ అవ్వడం లేదని గొడవలు మొదలవుతాయి.

ఎందుకంటే ఒక మనిషి తన రియల్ క్యారెక్టర్‌ను, అలవాట్లను 2-3 నెలల కంటే ఎక్కువ కాలం దాచలేడు. అందుకే సైకాలజిస్టులు కనీసం 6 నెలల పాటు అయినా సరే ఒకరినొకరు అర్థం చేసుకునే టైమ్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ 6 నెలల కాలంలో సినిమా పిచ్చి ఉందా, ఏ ఫుడ్ ఇష్టం అనే చిన్న విషయాలు మాత్రమే కాకుండా ప్రాక్టికల్ విషయాలన్నీ చెక్ చేసుకోవాలి.

వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు వాళ్ల ఎలా రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారా? లేక పొదుపు చేసే అలవాటు ఉందా? మీ కెరీర్‌ను గౌరవిస్తారా లేక ప్రతిదానికీ సైకోలా అనుమానిస్తారా? సెల్ఫిష్‌గా ఉంటారా? సెల్ఫ్ లవ్‌తో ఉంటారా? వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జీవితంపై వాళ్లకున్న గోల్స్ మీతో మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇలా అన్ని విషయాలు పక్కాగా గమనించాలి.

Relationship Rule

ఇదివరకటి రోజుల్లో రెండు కుటుంబాలు, వారి బంధువులు కలిసి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అనేంతగా కాకపోయినా, వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి, వారి వెనుకున్న ఆస్తులు.. అంతస్తుల మాటేంటి వంటి విషయాలన్నీ కనుక్కుని మరీ మ్యాచ్ కుదిర్చేవారు. కాబట్టి ఒక రకమైన సోషల్ సెక్యూరిటీ ఉండేది.

కానీ ఇప్పుడు అంతా డిజిటల్ యుగం అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్ బుక్ మెసెంజెర్‌, వాట్సాప్ చాట్స్, డేటింగ్ యాప్స్‌ అంటూ సోషల్ మీడియాలోనే కనెక్ట్ అయి, ప్రేమ పెళ్లి , రిలేషన్ అంటూ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కనిపించే లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరు అని అర్ధం చేసుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

తొందరపడి ఒక రిలేషన్‌లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత పార్ట్‌నర్ మారలేదని ఏడవడం కంటే.. ఎంటర్ అవ్వకముందే ఓ ఆరు నెలలు ఓపెన్‌గా మాట్లాడుకుని, వాళ్లను స్టడీ చేయాలి. ఆ తర్వాత ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మంచిదన్న విషయాన్ని అర్దం చేసుకోవాలి.

Varalakshmi Vratam Prasadam : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఈజీగా ఇలా ట్రై చేయండి..

Exit mobile version