Second Chance : గోస్టింగ్ చేసే అబ్బాయిలను నమ్మొద్దా? అమ్మాయిలు వారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దా?..

Second Chance : జరిగింది ఏదో జరిగిపోయిందని ఇక లైఫ్‌‌లో ముందుకు వెళ్దామని ఆ అమ్మాయి అనుకుంటున్న టైమ్‌లో, సడన్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వ్యూవర్స్ లిస్ట్‌లో ఆ పర్సన్ పేరు ప్రత్యక్షమవుతుంది.

Second Chance

డేటింగ్ యాప్‌లో పరిచయం, ఒకటి రెండు డేట్‌‌లకు వెళ్లి బాగా క్లోజ్ అవ్వడం, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా ఎలాంటి అడ్రస్ లేకుండా ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి మాయమైపోవడం.. ప్రజెంట్ చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఇదే. దీనినే లవ్ టెర్మినాలజీలో గోస్టింగ్ అని పిలుస్తారు. సరే జరిగింది ఏదో జరిగిపోయిందని ఇక లైఫ్‌‌లో ముందుకు వెళ్దామని ఆ అమ్మాయి అనుకుంటున్న టైమ్‌లో, సడన్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వ్యూవర్స్ లిస్ట్‌లో ఆ పర్సన్ పేరు ప్రత్యక్షమవుతుంది.

అలా ఒక్కరోజే కాదు వరుసగా తన స్టోరీలను రెగ్యులర్‌‌గా ఫాలో అవుతుంటే.. ఇంకా తనను గుర్తుపెట్టుకున్నాడా, మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయేమో, ఏదో తప్పు తెలుసుకుని వచ్చి ఉంటాడని ఆ యువతి అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుందని సైకాలజిస్టులు అంటున్నారు. అలాంటి వారి విషయంలో ఎప్పుడూ కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వొద్దని, వాళ్లకు రెండో ఛాన్స్(Second Chance) ఇచ్చే ప్రశ్నే వద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

ఒక వ్యక్తి మిమ్మల్ని చెప్పాపెట్టకుండా పక్కన పెట్టేసి, కొద్ది రోజుల తర్వాత మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను వాచ్ చేస్తున్నాడంటే దానర్థం ఆ పర్సన్‌కు మీద ప్రేమ పెరిగిందని ఎంతమాత్రం కాదని సైకాలజీ చెబుతోంది. ప్రస్తుతం అతని దగ్గర ఏ డేటింగ్స్ లేవని, మాట్లాడటానికి ఎవరూ కూడా ఇంట్రస్టింగ్‌గా ఎవరూ లేక విపరీతమైన బోర్ కొడుతోందని దాని మీనింగ్. జస్ట్ టైమ్‌పాస్ కోసం మాత్రమే వారు మీ ప్రొఫైల్స్ వైపు మళ్లీ చూస్తుంటారని, అలాంటి ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఉన్న పనులను ప్రేమ అని అస్సలు అనుకోకూడదు.

Second Chance

కేవలం తన స్వార్థం కోసం లేదా ఏదొక రకంగా మళ్లీ మీతో కాంటాక్ట్ స్టార్ట్ చేసి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని రిలేషన్‌షిప్‌లోకి లాగాలనేది మాత్రమే అవతలి పర్సన్ ప్లాన్ అయి ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే సైలెన్స్‌గా మీ డిజిటల్ లైఫ్‌ను ట్రాక్ చేస్తూ, నిజ జీవితంలో కనీస బాధ్యత తీసుకోని వ్యక్తికి మీ లైఫ్‌లో మళ్లీ ప్లేస్ ఇవ్వడం వేస్ట్ అని అర్థం.

అందుకే అలాంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడుచేసుకోకుండా, బ్లాక్ అనే ఆప్షన్ వాడి వెంటనే వారిని మీ జీవితం నుంచి పక్కన పెట్టేయాలి. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన వ్యక్తి కంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి, గోస్టింగ్ చేసే వారికి పొరపాటున కూడా సెకండ్, థర్డ్ ఛాన్స్‌(Second Chance)లు ఇవ్వకుండా మీ జీవితంలో హ్యాపీగా ముందుకు సాగిపోవడమే మంచిది.

Araku Valley Hot Air Balloon : గాల్లో తేలుతూ అరకు అందాలను ఆస్వాదించే ఛాన్స్..హాట్ ఎయిర్ బెలూన్ అడ్వెంచర్ రీ స్టార్ట్..

↑
Exit mobile version