Negative Self Talk : నా బతుకింతే అని ఎప్పుడూ ఏడ్చే మనస్తత్వం.. నెగిటివిటీని ఆకర్షించే ఆ నిజాలివే..

Negative Self Talk : జీవితంలో జరిగిన చిన్న చిన్న మంచి విషయాలకైనా సరే దేవుడికి కానీ యూనివర్స్‌కి కానీ కృతజ్ఞత చెప్పుకోవడం, అంటే గ్రాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి

Negative Self Talk

తమ జీవితంపై ఉన్న అసంతృప్తితో కొంతమంది వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కూడా నెగిటివ్‌గా మాట్లాడుతుంటారు(Negative Self Talk). తమకు అన్ని విషయాల్లో చెడు జరుగుతుందని, ఎంత ప్రయత్నించినా లక్ కలిసి రావడం లేదని పదే పదే అంటూ ఉంటారు.

అయితే ఇలా అనడం వల్ల వారి లైఫ్‌లో నిజంగానే నెగిటివిటీ రోజురోజుకూ పెరిగిపోతుందని సైకాలజీ చెబుతుంది. మన నుంచి వచ్చే మన నోటి మాట అనేది నెగిటివ్ విషయాలను చాలా బలంగా ఆకర్షిస్తుందనేది వంద శాతం నిజం. సైకాలజీలో దీనిని లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే నెగిటివిటీ బయాస్ అని పిలుస్తారు.

మన సబ్‌కాన్షియస్ మైండ్ లేక అంతర్‌చేతన అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మనం రోజూ ఏ మాటలనయితే పదే పదే ఉచ్ఛరిస్తామో, మన బ్రెయిన్ అలాగే మన చుట్టూ ఉన్న యూనివర్స్ దాన్నే నిజమని నమ్మి, మన చుట్టూ ఉన్న నెగిటివ్ అవకాశాలను మాత్రమే మనకు చూపిస్తుంటాయి. నెగిటివ్ మాటలు మాట్లాడటం వల్ల ..మంచి జరిగే అవకాశం ఉన్నా కూడా, మన నోటి మాటల వల్ల దాన్ని ముందే దూరం చేసుకుంటాం.

ఎప్పుడూ ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో, మాటలతో బతికడం వల్ల.. వారి జీవితంలో ఎదగాలనే ఆశను వారి మైండ్ పూర్తిగా చంపేస్తుంది. ఏ పని మొదలుపెట్టినా సరే అది ఎలాగూ అవ్వదనే నెగిటివ్ నమ్మకంతోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి, అందులో కచ్చితంగా ఫెయిల్ అవుతుంటారు.

దీనివల్ల వారిపై వారికి నమ్మకం పోవడమే కాదు.. చుట్టుపక్కల ఉండే బంధువులు, స్నేహితులు కూడా వీరిని చూసి దూరం జరుగుతారు. ఎప్పుడూ ఏడుస్తూ, నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వ్యక్తులతో గడపడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఇది మెల్లగా వారిని ఒంటరితనంలోకి, డిప్రెషన్‌లోకి నెట్టేస్తుంది.

ఈ భయంకరమైన మెంటాలిటీ నుంచి బయటపడి తమను తాము మార్చుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. మొదటగా మన నోటి నుంచి బయటకు వచ్చే మాటలను గమనించడం అలవాటు చేసుకోవాలి. పొరపాటున కూడా నా బతుకింతే, నాది బ్యాడ్ లక్, ఇదంతా నా దరిద్రం అనే పదాలను వాడటాన్ని పూర్తిగా బంద్ చేయాలి.

Negative Self Talk

జీవితంలో జరిగిన చిన్న చిన్న మంచి విషయాలకైనా సరే దేవుడికి కానీ యూనివర్స్‌కి కానీ కృతజ్ఞత చెప్పుకోవడం, అంటే గ్రాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి. ఉదయం లేవగానే ఈరోజు నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనే పాజిటివ్ అఫిర్మేషన్స్ మాత్రమే మాట్లాడాలి. ఇంత మంచి జీవితాన్ని నాకిచ్చిన భగవంతునికి లేదా యూనివర్స్‌కు థ్యాంక్స్ అని చెప్పడం అలవాటు చేసుకుంటే బ్రెయిన్ రీవైరింగ్ అవుతుంది.

నెగిటివ్‌గా మాట్లాడే(Negative Self Talk) స్నేహితులకు దూరంగా ఉంటూ, లైఫ్‌లో పైకి ఎదగాలనే తపన ఉన్న పాజిటివ్ వ్యక్తులతో సమయం గడపాలి. మన ఆలోచనా విధానమే కాదు ముఖ్యంగా మాట్లాడే పదాలను మార్చుకుంటే మన జీవితం కూడా అద్భుతంగా మారుతుందనే నిజాన్ని గ్రహించి అడుగులు వేయాలి.

Peddi : వీకెండ్ లోపు రూ.200 కోట్లు ..రెండో రోజు పెద్ది కలెక్షన్లు ఎంతంటే ?

Exit mobile version