Mint :పుదీనాను ఇలా నిల్వ చేయండి.. నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండేలా స్మార్ట్ ట్రిక్

Mint: పుదీనాను మార్కెట్ నుంచి తెచ్చిన ఒకటి, రెండు రోజులకే.. అది నల్లగా మారిపోవడం, కుళ్లిపోవడం వంటి సమస్యలు అందరికీ ఎదురవుతాయి.

Mint

వేసవి కాలంలో పుదీనా చల్లదనాన్ని ఇస్తుందని ఎక్కువ మంది పుదీనాను వాడతారు. కేవలం సువాసన కోసం, చల్లదనం కోసమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా పుదీనా ఆకులను ఎక్కువగా వాడుతుంటాం.

అయితే పుదీనా(Mint)ను మార్కెట్ నుంచి తెచ్చిన ఒకటి, రెండు రోజులకే.. అది నల్లగా మారిపోవడం, కుళ్లిపోవడం వంటి సమస్యలు అందరికీ ఎదురవుతాయి. ఫ్రిజ్‌లో జాగ్రత్తగా పెట్టినా ఎక్కువ రోజులు నిల్వ ఉండని పుదీనాను, నెల రోజుల పైనే తాజాగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా ఒకటి ఉంది.

పుదీనా(Mint)ను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి మనం అనుసరించాల్సిన ఈజీ పద్ధతి ఫ్రీజింగ్ అని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనాను ఆకులుగా విడదీసి..వాటిని నీటిలో మూడు నాలుగు సార్లు బాగా కడిగి, దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులను మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మరీ పల్చగా కాకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.

Mint

ఈ పేస్టులో ఒక చెంచా నిమ్మరసం కలపడం వల్ల పుదీనా తన నేచురల్ గ్రీనిష్‌నెస్‌ను కోల్పోకుండా ఉంటుంది. ఈ పేస్ట్‌ను ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో సుమారు 6 నుంచి 8 గంటల పాటు ఉంచాలి. అవి గట్టిగా గడ్డకట్టిన తర్వాత, ఆ పుదీనా క్యూబ్స్‌ అన్నిటినీ తీసి ఒక జిప్ లాక్ కవర్‌లో , గాలి చొరబడని డబ్బా (Air-tight container)లో ఫ్రిడ్జ్‌లోనే భద్రపరుచుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న పుదీనా క్యూబ్స్‌ను మనకు కావాల్సినప్పుడు ఒకటి లేదా రెండు తీసుకుని మజ్జిగలో, నిమ్మరసంలో అయినా , కూరల్లో అయినా వాడుకోవచ్చు. దీనివల్ల పుదీనా రుచి ఏమాత్రం మారదు. ఈ సింపుల్ పద్ధతి పాటిస్తే సమ్మర్ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా పుదీనా ఫ్లేవర్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

Rashid Khan : తిప్పేసిన రషీద్ ఖాన్..గుజరాత్ చేతిలో రాజస్థాన్ చిత్తు

Exit mobile version