Necessity:అవసరం అనే వంతెన.. స్వార్థమే ఊపిరిగా సాగుతున్న బంధాలు

Necessity: ఒక వ్యక్తి వల్ల అప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఏదైనా అవసరం(Necessity) ఉంటుంది అనిపిస్తేనే, వారు ఆ వ్యక్తి చుట్టూ అమితమైన ప్రేమను కురిపిస్తుంటారు.

Necessity

మనుషుల మధ్య ఒకప్పుడు కనిపించే ఆత్మీయత, అనురాగం రానురాను ఒక రకమైన లావాదేవీలుగా మారిపోతున్నాయి. ఈ మనిషి వల్ల నాకేం లాభం అనే లెక్కలతోనే పలకరింపులు మొదలవుతున్నాయి. ఇప్పుడు మనుషులంతా ఎదుటి వ్యక్తిని ఒక మనిషిగా కంటే, తమ పనులను చక్కబెట్టే ఒక టూల్ (Tool) లాగే చూస్తున్నారు. దీనినే సైకాలజీలో యూటిలిటేరియన్ సోషల్ బిహేవియర్ అంటారు.

అంటే, ఒక వ్యక్తి వల్ల అప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఏదైనా అవసరం(Necessity) ఉంటుంది అనిపిస్తేనే, వారు ఆ వ్యక్తి చుట్టూ అమితమైన ప్రేమను కురిపిస్తుంటారు. కానీ వారి నుంచి ఎలాంటి ప్రయోజనం లేదనో.. ఇక మీదట కలగదనో తెలిసిన మరుక్షణమే, ఆ వ్యక్తి వారికి ఆటోమేటిక్‌గా పరాయివాడైపోతాడు.

అయితే మనుషుల ప్రవర్తనలో ఈ మార్పు రావడానికి మనిషి మెదడులోని డోపమైన్ రివార్డ్ సిస్టమ్ ఒక ప్రధాన కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. మనకు ఎవరైనా సాయం(Necessity)చేస్తున్నప్పుడు కానీ, భవిష్యత్తులో చేస్తారని నమ్మకం కలిగినప్పుడు కానీ, మన మెదడు ఆ వ్యక్తిని ఒక పాజిటివ్ రివార్డ్‌గా గుర్తిస్తుంది.

దీనివల్ల ఆ సమయంలో వారికి తెలీకుండానే ఎదుటవారి పట్ల ఎంతో వినయాన్ని, గౌరవాన్ని, ప్రేమను ప్రదర్శిస్తారు. కానీ ఆ అవసరం తీరిపోగానే, మెదడుకు అందే ఆ ప్రేరణ (Stimulus) ఆగిపోతుండటంతో.. ఇకపై ఆ వ్యక్తిని పలకరించడం కూడా ఒక శ్రమగా, టైమ్ వేస్ట్‌గా భావించడం అనే ఫీలింగ్ ఆటోమేటిక్‌గా మొదలయిపోతుంది. దీనివల్లే చాలామంది అవసరం(Necessity) ఉన్నప్పుడు ఎదుటవ్యక్తిని ఆకాశానికి ఎత్తేసి, పని కాగానే పాతాళానికి తొక్కేస్తుంటారన్న మాటలు మనం వింటూ ఉంటాం.

ప్రస్తుతం అంతా పోటీ ప్రపంచమే కనిపిస్తోంది. మనుషులు తమ సమయాన్ని కూడా ఒక పెట్టుబడిలా భావిస్తున్నారు. ఎవరితోనైనా మాట్లాడటం వల్ల తమకు ఏమైనా హోదా పెరుగుతుందా, డబ్బు వస్తుందా , ఏదైనా పని జరుగుతుందా అని ఆలోచించే తీరు పెరిగిపోయింది. ఒకవేళ ఎదుటి వ్యక్తి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేలితే, ఆ బంధం కోసం సమయాన్ని కేటాయించడం వేస్ట్ అన్న ఫీలింగ్ సొసైటీలో పాతుకుపోతోంది. మనిషి విలువను వారి వ్యక్తిత్వం కంటే, వారు ఇచ్చే అవుట్‌పుట్‌తో కొలిచే దుస్థితి ఏర్పడింది.

Necessity

ఇది కేవలం బయట వ్యక్తులతోనే కాదు, దురదృష్టవశాత్తు సొంత కుటుంబాల్లో కూడా కనిపిస్తోంది. ఇంట్లో ఎవరైనా ఏ పనీ చేయకుండా ఉన్నా, ఆర్థికంగా అండగా నిలబడలేకపోయినా, వారిని ఒక అనవసరమైన బరువుగా చూసే ధోరణి పెరిగిపోతుంది. వినడానికి కాస్త కష్టంగా ఉన్నా చాలా కుటుంబాలలో చాలామంది దీనిని ఫేస్ చేస్తున్నారు.

అయితే ఇలాంటి బంధాలు ఎప్పుడూ ఇసుక మేడల్లాంటివేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రయోజనం మీద ఆధారపడే బంధం, ఆ ప్రయోజనం ముగియగానే కుప్పకూలిపోతుంది. ఎప్పుడయితే మనిషిలోని మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రేమించే బంధాలు ఉంటాయో.. అవి మాత్రమే కాలంతో సంబంధం లేకుండా శాశ్వతంగా నిలుస్తాయని అర్ధం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి వల్ల లాభం ఉన్నా లేకపోయినా, వారిని ఒకేలా గౌరవించడం అనేది ఒక గొప్ప సంస్కారం అని తెలుసుకోవాలి.

SRH : ఉప్పల్ లో ప్రఫుల్ షో…రాజస్థాన్ జోరుకు బ్రేక్

Exit mobile version