The Silence Of Men : ఐ యామ్ ఫైన్ వెనుక దాగున్న మగవారి సైలెన్స్..సైకాలజీ ఏం చెబుతోందో తెలుసా?

The Silence Of Men : మగవారు తమ బాధను ఓపెన్‌గా చెప్పకపోవడానికి వెనుకున్న రీజన్స్ ఏంటి? వారి నిశ్శబ్దాన్ని అందరూ ఎలా అర్థం చేసుకోవాలి? పూర్తి వివరాలతో సైకాలజీ విశ్లేషణ ఇక్కడ చదవండి.

The Silence Of Men

రోజంతా విపరీతమైన వర్క్ ప్రెజర్, మెంటల్ టెన్షన్‌ను అనుభవించి ఇంటికి తిరిగొచ్చిన చాలామంది మగవారు.. ఎందుకలా ఉన్నావని అడిగితే .. ఐ యామ్ ఫైన్.. నాకేం కాలేదని చెప్పడం కామన్‌గా వింటాం. సంపాదన నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీల వరకు ఎన్నో భారాలను భుజాలపై మోస్తూ కూడా తమ మనసులోని బాధను, భయాన్ని బయటకు చెప్పడానికి మగవారు పెద్దగా ఇష్టపడరు.

తమ మానసిక వేదనను గుండెల్లోనే దాచుకుని, బయటకు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కనిపిస్తుంటారు. అయితే చాలామంది మగవాళ్లు ఇలాంటి సైలెన్స్‌ను ఎందుకు ఎంచుకుంటారనే దానిపై సైకాలజిస్టులు కొన్ని విషయాలను వివరిస్తున్నారు.

మన సొసైటీలో చిన్నప్పటి నుంచి కూడా మగపిల్లలపై కొన్ని అవాస్తవికమైన అంచనాలు బలవంతంగా రుద్దబడతాయి. ఆడపిల్లలా ఏడుస్తున్నావేంటి.. మగపిల్లలు ఏడవకూడదు , అమ్మాయిలా పిరికిగా ఉండకూడదు..ధైర్యంగా ఉండాలనే మాటలు వింటూ పెరగడం వల్ల, బాధను బయటకు ఎక్స్‌ప్రెస్ చేస్తే అది వీక్నెస్ అవుతుందనే ఫీలింగ్ వారిలో ఇంటర్నల్‌గా అంటే వారి సబ్ కాన్సియస్ మైండ్‌(Subconscious mind)లో పెరిగిపోతుంది. అందుకే పెద్దయ్యాక ఎంత సమస్య అయినా ఇతరులతో షేర్ చేసుకుంటే తమను చేతకానివారిగా చూస్తారేమోననే చిన్న భయం వారిని సైలెన్స్‌(The Silence Of Men)లోకి నెట్టేస్తుంది.

సైకాలజీ ప్రకారం పురుషులు నేచురల్‌గానే ‘సాల్వర్స్’ (Solvers). అంటే ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడి ఓదార్పు పొందడం కంటే కూడా దానికి సొల్యూషన్ వెతకడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వర్క్, మనీ, లేదా ఫ్యామిలీకి సంబంధించిన ప్రెజర్ ఎదురైనప్పుడు వారు తమ ఆలోచనల్లో పడిపోయి.. చాలా సైలెంట్‌గా మారిపోతారు. ఈ సైలెన్స్‌(The Silence Of Men)ను చాలామంది అర్థం చేసుకోలేక, నీకేమైందని కోప్పడటం, నిలదీయడం చేస్తుంటారు. కానీ ఇది వారిలో మరింత టెన్షన్‌ను పెంచుతుందని అంటున్నారు మానసిక నిపుణులు.

మగవారు తమ బాధను షేర్ చేసుకోలేకపోవడానికి మెయిన్ రీజన్..తమను జడ్జ్ చేయని ఒక సేఫ్ స్పేస్ (Safe Space) దొరక్కపోవడమే. వారు సైలెంట్‌గా ఉన్నప్పుడు నీకేమైందని ప్రశ్నించడం కంటే, అంతా ఓకేనా? నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అని అడగడం వల్ల వారు మెంటల్‌గా చాలా రిలీఫ్ పొందుతారు. ఎదుటివారు తమను అర్థం చేసుకుంటారనే నమ్మకం ఏర్పడినప్పుడే వారు తమ మనసులోని ఫీలింగ్స్‌ను ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారు.

ప్రతి ఒక్కరూ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నా మనసేమీ బాగోలేదని, నేను ఈ ఇబ్బందులలో ఉన్నానని..తాము స్పెషల్‌గా భావించే ఒక వ్యక్తికి చెప్పడంలో ఏం తప్పు లేదు. మగవారు తమ ఫీలింగ్స్‌ను షేర్ చేసుకోవడం వల్ల వారి మెంటల్ హెల్త్ బాగుండటమే కాకుండా, రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. మగవారికి కూడా ఒక సేఫ్ కంఫర్ట్‌నెస్ అవసరమని గుర్తించి, వారికి తగిన ఫ్రీడమ్ ఇవ్వడమే వారి మెంటల్‌ హెల్త్‌కి నిజమైన తొలి అడుగు అని భావించాలి.

Unstoppable With NBK Season 5 : ఆహా ప్లాన్ అదిరింది.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో మెగాస్టార్?

↑
Exit mobile version