Just EntertainmentLatest News

Unstoppable With NBK Season 5 : ఆహా ప్లాన్ అదిరింది.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో మెగాస్టార్?

Unstoppable With NBK Season 5 : అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఐదో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకే టాక్ షో వేదికపైకి రాబోతున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.దీనిపై వివరాలు చూద్దాం.

Unstoppable With NBK Season 5

ఓటీటీ తెరపై నయా రికార్డుల విధ్వంసానికి ఆహా వేదిక మళ్లీ రెడీ అవుతోంది. నందమూరి బాలకృష్ణ హోస్టింగ్, గెస్టులతో ఆయన సాగించే హుషారైన సంభాషణలు ..అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోను ఇండియాలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టాక్ షోగా మార్చేశాయి. ఇప్పటికే నాలుగు సీజన్ల గ్రాండ్ విక్టరీని యాడ్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌(Unstoppable With NBK Season 5)కు సిద్ధమైంది. అయితే ఈ కొత్త సీజన్ గ్రాండ్ లాంచ్ కోసం షో నిర్వాహకులు వేసిన స్కెచ్.. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో చిరు , బాలయ్య అభిమానుల్లో కూడా మైండ్ బ్లోయింగ్ టాపిక్‌గా మారిపోయింది.

సినీ లవర్స్ దశాబ్దాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఐదో సీజన్(Unstoppable With NBK Season 5) తొలి ఎపిసోడ్‌లోనే ఊహించని గెస్ట్ రాబోతున్నార్ననేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల టాక్. తెలుగు సినీ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఇద్దరు బడా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైమ్ ఈ ఆహా టాక్ షో ద్వారా.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ సీజన్ 5ను వెరీ ప్రెస్టీజియస్‌గా స్టార్ట్ చేయడానికి చిరంజీవిని ప్రధాన అతిథిగా తీసుకురావడానికి ఆహా టీమ్ చర్చలు జరుపుతుందట. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,మాస్ మహారాజ్ రవితేజ వంటి బిగ్ స్టార్స్ ఈ షోకి వచ్చి రేటింగ్స్ సునామీని క్రియేట్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తోడైతే వ్యూవర్‌షిప్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఆహా భావిస్తోంది .

4 దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీపడే ఈ ఇద్దరు బడా మాస్ ఐకాన్స్, పర్సనల్ లైఫ్‌లో మెయింటైన్ చేసే బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే.అటువంటిది వీళ్లిద్దరూ ఒకే సోఫాలో కూర్చుని ముచ్చటించుకుంటే.. తమ సినీ అండ్ పర్సనల్ లైఫ్‌ జర్నీలో చూసిన ఎత్తుపల్లాలు, సినీ రంగంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, రాజకీయానుభవాలు, సీక్రెట్ సరదాలన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.

బాలయ్య బోల్డ్ ఆటిట్యూడ్, చిరు టైమింగ్ గురించి తెలిసిందే కాబట్టి.. ఆ ఎపిసోడ్ సృష్టించే హంగామా మాటల్లో చెప్పలేం. ప్రస్తుతానికైతే ఆహా యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ఊహాగానాలే మెగా, నందమూరి ఫ్యాన్స్‌లో పండగ వాతావరణంను తీసుకొచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమవుతుందో లేదో తెలియాలంటే ఆహా నుంచి వచ్చే అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Electric Bike Charging : రైడ్ నుంచి రాగానే ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

Related Articles

Back to top button