Summer Holidays : ఇక వేసవి సెలవులు..పిల్లలకు మీరు నేర్పాల్సినవి ఇవే

Summer Holidays : విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. చాలా తరగతులకు పరీక్షలు కూడా అయిపోయాయి. ప్రస్తుతం ఒంటి పూట బడులు నడుస్తున్నాయి

Summer Holidays

విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. చాలా తరగతులకు పరీక్షలు కూడా అయిపోయాయి. ప్రస్తుతం ఒంటి పూట బడులు నడుస్తున్నాయి. త్వరలో వేసవి సెలవులు(Summer Holidays) మొదలవుతాయి. ఇక రెండు నెలల పాటు పిల్లలకు ఫుల్ ఎంజాయ్ మెంట్.

ఈ సెలవుల(Summer Holidays) సమయంలో పిల్లలకు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.దీంతో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పిల్లలకు మరికొన్ని సూచనలు ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడిపేందుకు మంచి అవకాశం.వీలుంటే రోజూ రెండు పూటలా వారితో కలిసి భోజనం చేయండి.

వారికి మీరు పడే కష్టాలను సున్నితంగా వివరించి బాధ్యతగా ఎలా ఉండాలో తెలియజెప్పండి.ఎంత శ్రమిస్తే డబ్బులు వస్తాయో అర్థమయ్యేలా చెప్పండి.  ఆహార పదార్థాలు వృధా చెయ్యకుండా జాగ్రత్తలు చెప్పండి. వాళ్ళు తిన్న భోజనం ప్లేటు శుభ్రం చేసుకోవడం వంటివి నేర్పించండి. పిల్లల్ని వంటింట్లోకి పిలిచి కొన్ని చిన్న చిన్న పనులు నేర్పండి .

అన్నింటికంటే ముఖ్యంగా ఫోన్ కు  దూరంగా ఉంచండి. చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోమని చెప్పండి. అదే సమయంలో కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం నేర్పించండి. ఒకవేళ వారి తాత, నానమ్మ వంటి పెద్దవాళ్లు ఊరిలో ఉంటే అక్కడకు పంపించండి. ఇక్కడే ఉంటే వారితో ఎక్కువ సేపు సమయం గడిపేలా చూసుకోండి.

పెద్దవాళ్లతో సమయం గడిపితే జీవితంలో విలువలు ఎలా పాటించాలి, ఎలా కష్టపడాలి వంటి విషయాలు పిల్లలకు బాగా అర్థమవుతాయి. వీలైనంత తక్కువ సమయం టీవీ ముందు గడిపేలా వారికి జాగ్రత్తలు చెప్పండి. చదువుకోవడం అంటే ర్యాంకులు మాత్రమే కాదనీ, జీవితంలో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నవి అర్థమయ్యేలా చెప్పండి.

Summer Holidays

సమ్మర్ దాదాపు రెండు నెలలు ఉంటుంది కాబట్టి వారిని క్రీడల్లో ప్రోత్సహించండి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపుల్లో చేర్చించి వారికిష్టమైన క్రీడల్లో ప్రోత్సహించండి.

సినిమాలు, సోషల్ మీడియా వంటి వాటికి తక్కువ సమయం కేటాయించి, స్నేహితులతోనూ, కుటుంబసభ్యులతోనూ పిల్లలు ఎక్కువ సేపు గడిపేలా చేస్తే వారికి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పరీక్షల్లో ఫెయిలైనా పిల్లలపై కోప్పడకుండా దానికి కారణాలు కనుక్కోండి.

ఈ విషయంలో మీరు మాట్లాడే ప్రతీ మాట వారి మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చదువు ఒక్కటే జీవితం కాదని, ర్యాంకులు రాకున్నా మంచి మార్కులతో పాస్ అయ్యేలా వారిని ప్రోత్సహిస్తే ఉత్సాహంగా చదువుతారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

Procrastination : రేపు చేద్దాంలే అనే అలవాటు మీకూ ఉందా? వాయిదా వేసే మనస్తత్వం వెనుక అసలు నిజాలివే!

Exit mobile version