AP Panchayat Phase 1 Results
ఏపీ పంచాయతీ రాజకీయంలో కూటమి జెండాలు మరోసారి ఘనవిజయాన్ని సాధించాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల రిజల్ట్‌లో(AP Panchayat Phase 1 Results) తెలుగుదేశం,జనసేన,బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. గురువారం ముగిసిన ఫస్ట్ స్టేజ్ ఓటింగ్, ఆ వెంటనే చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రాసెస్‌తో ఫలితాలపై క్లారిటీ వచ్చింది. పల్లె పోరులో కూడా వైసీపీకి తీవ్ర నిరాశే మిగలగా, కూటమి అభ్యర్థులు మాత్రం మెజారిటీ స్థానాలను దక్కించుకుని చాలా గ్రామాలలో తమ జెండాను పాతారు.
తొలి విడత కింద 3,949 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. నామినేషన్ల విత్‌డ్రాయల్ సమయానికే 760 స్థానాలు ఏకగ్రీవంగా మారాయి. మిగిలిన 3,189 సర్పంచ్ పదవులతో పాటు వేలాది వార్డు స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు.
ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఏకగ్రీవాలతో పాటు 2,321 పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు జయభేరి మోగించారు. కూటమి భాగస్వాములైన జనసేన 118, బీజేపీ 25 చోట్ల తమ జెండా ఎగురవేశాయి. ఇక వైసీపీ మద్దతుదారులు కేవలం 1,103 స్థానాలకే పరిమితమయ్యారు. ఇండిపెండెంట్లు , ఇతర చిన్న పార్టీలు కలసి 295 స్థానాలను గెలుచుకున్నాయి.
సాధారణ పంచాయతీలే కాకుండా, అత్యంత ప్రతిష్టాత్మకమైన పెద్ద పంచాయతీల్లోనూ కూటమి మేనియా క్లియర్‌గా కనిపించింది. 10 వేల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న 52 మేజర్ పంచాయతీలలో పోటీ ఎక్కువగా ఉండగా.. దానిలో ఏకంగా 28 స్థానాలు కూటమి వశమయ్యాయి.
టీడీపీ కేండిడేట్స్ 25 పెద్ద పంచాయతీలను కైవసం చేసుకోగా, జనసేన కేండిడేట్స్ 3 చోట్ల విజయాన్ని సాధించారు. వైసీపీ మాత్రం కేవలం 6 మేజర్ పంచాయతీలను మాత్రమే దక్కించుకోగలిగింది. ఇక తొలి విడత ఏకగ్రీవాల్లో తిరుపతి జిల్లా 136 స్థానాలతో టాప్‌లో నిలిచింది.
మొత్తంగా మొదటి విడత ఓటింగ్ ప్రాసెస్‌లో 77.65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయలసీమ ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 83.37 శాతం పోలింగ్ జరగగా, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో అతి తక్కువగా 66.93 శాతం ఓటింగ్ నమోదైంది.
పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో టెక్నికల్ అండ్ లోకల్ వివాదాల వల్ల 3 కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించారు. మొత్తానికి ఈ తొలి విడత ఫలితాలు(AP Panchayat Phase 1 Results) రాబోయే 2 విడతల పంచాయతీ పోరుపై కూడా గట్టి ప్రభావం చూపించేలా కనిపిస్తున్నాయి.
Weight Loss : వెయిట్ లాస్ కోసం పండ్లు తింటున్నారా?.. బరువు పెరుగుతారేమో చూసుకోండి..
