Visual Thinking
మాట్లాడుతూ మాట్లాడుతూనే కొంతమంది ఎదుటివారు చెప్పే విషయాలను.. మనసులో ఒక సినిమా రూపంలో ఊహించుకునే అలవాటు కనిపిస్తూ ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడే వాళ్ల మెదడు పూర్తి విజువలైజేషన్ లోకి వెళ్లిపోతుంది.
పైకి ఇది కేవలం ఒక చిన్న అలవాటులా అనిపించినా, బిహేవియరల్ సైకాలజీలో దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన కారణాలు, డీప్ అనాలసిస్‌లు ఉన్నాయి. సైకాలజీ ప్రకారం ఇలా మాట్లాడుతూనే ఊహాలోకంలోకి లేదా విజువలైజేషన్ లోకి వెళ్లిపోవడాన్ని టాకింగ్ ఇన్ పిక్చర్స్ (Talking in Pictures) లేదా విజువల్ థింకింగ్ (Visual Thinking) అంటారు.
నిజానికి మనుషులలో ఆలోచనా విధానాలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది పదాల రూపంలో ఆలోచించడం (Verbal Thinking), రెండోది విజువల్ రూపంలో ఆలోచించడం (Visual Thinking). ఎవరైతే విజువల్ థింకర్స్‌గా ఉంటారో, వాళ్ల మెదడు ఒక సూపర్ కంప్యూటర్ వంటిది. వారు ఏదైనా ఒక పదాన్ని మాట్లాడినప్పుడు వాళ్ల మైండ్‌లో ఆ పదానికి సంబంధించిన అక్షరాలు కాకుండా, నేరుగా ఆ వస్తువు , సంఘటన తాలూకు విజువల్స్, వీడియోలు రన్ అవుతుంటాయి.
ఉదాహరణకు వారి డిస్కషన్‌లో కారు గురించి మాట్లాడుతుంటే, వాళ్ల మనసులో ఒక నచ్చిన రంగు కారు రోడ్డుపై వెళ్తున్న దృశ్యం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు ఆ దృశ్యాన్ని మరింత లోతుగా గమనించడం కోసమే వారు హఠాత్తుగా మాటల మధ్యలో విజువలైజేషన్‌లోకి వెళ్లిపోతుంటారు.
ఈ అలవాటు వల్ల ఉండే ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, ఇలాంటి వారిలో క్రియేటివిటీ (Creativity), ఊహాశక్తి చాలా అద్భుతంగా ఉంటాయి. వీరు చాలా గొప్ప డైరెక్టర్స్, స్టోరీ టెల్లర్స్, కవులుగా, ఆర్టిస్టులుగా , డిజైనర్లుగా రాణించగలరు. ఎందుకంటే వీరు తాము చూస్తున్న ఊహలను ఎదుటివారికి చాలా వివరంగా, వర్ణనలతో వివరించగలరు.
అలాగే వీరి ఐక్యూ (IQ) లెవెల్స్‌తో పాటు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని మైండ్‌లోనే ఒక గ్రాఫ్ లాగా లేదా మ్యాప్ లాగా ఊహించుకుని, దానికి రకరకాల పరిష్కారాలను చాలా వేగంగా కనిపెట్టేస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఏ విషయాన్నైనా చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు. ఎందుకంటే వీరి జ్ఞాపకశక్తి కేవలం మాటల మీద కాదు, విజువల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి.
అయితే ఇలా మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా వారు విజువలైజేషన్ లోకి వెళ్లడం వల్ల ఎదుటివ్యక్తులతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వీరు తమ ఊహల్లో మునిగిపోవడం వల్ల, ఎదుటివారు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్లను సరిగ్గా వినలేరు. అంతేకాదు దీనివల్ల వీరు ఇతరులను నిర్లక్ష్యం చేస్తున్నారనే తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి.
అలాగే, కొన్నిసార్లు వీరు చెప్పాలనుకున్న పాయింట్‌ను వదిలేసి, ఊహల్లో కనిపించే వేరే విషయాల్లోకి డైవర్ట్ అయిపోతుంటారు. దీనివల్ల కన్వర్జేషన్ అనేది ట్రాక్ తప్పుతుంది. ఆఫీస్ మీటింగ్స్‌లోనూ, సీరియస్ డిస్కషన్స్‌లోనో ఉన్నప్పుడు ఈ అలవాటు వల్ల వీరు ఫోకస్ కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది.
అయితే ఈ అలవాటు అద్భుతమైన మానసిక వరమనే చెప్పాలి. కానీ దాన్ని ఎప్పుడు, ఎలా వాడుతున్నామనే దానిపైన కూడా అది ఆధారపడి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా కొత్త ఐడియా కోసం ఆలోచిస్తున్నప్పుడు , ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు ఈ విజువల్ థింకింగ్(Visual Thinking) అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
కానీ ఎవరితోనైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఊహల ప్రపంచంలోకి వెళ్లిపోకుండా మనసును అదుపులో ఉంచుకుని, ఎదుటివారి మాటలపై పూర్తిగా దృష్టి పెట్టడాన్ని (Active Listening) అలవాటు చేసుకోవాలి. మన ఆలోచనల వేగాన్ని, మాటలను బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ విజువలైజేషన్ అనేది జీవితంలో మంచి మంచి విజయాలను సాధించడానికి ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది.
Mamata Banerjee : మేనల్లుడికి మమత బిగ్ షాక్..దీదీ దిద్దుబాటు చర్యలు
