Destiny : డెస్టినీ అంటే ఏంటి..మన ప్రమేయం లేకుండానే మన జీవితాలను డిసైడ్ చేస్తుందా?

Destiny : జరగాల్సింది జరుగుతుంది, దక్కాల్సింది దక్కుతుందనే భావన మనకు ఒక రకమైన మెంటల్ స్టెబిలిటీని ఇస్తుంది.

Destiny

జీవితంలో ఊహించని మలుపులు ఎదురైనప్పుడో, కష్టపడినా ఫలితం దక్కనప్పుడో ఇదేనా విధి రాత అన్న ఆలోచన వస్తుంది. అసలు మన జీవితం మనం రాసుకున్న కథా లేకపోతే ముందే ఎవరో రాసిన స్క్రిప్టా అనే చర్చ.. ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉన్నా ఇప్పటికీ అది జవాబు దొరకని ప్రశ్నగానే ఉండిపోయింది. ఈ ప్రపంచంలో అనుకోకుండా ఏదీ జరగదని , ప్రతి అడుగు వెనుక ఒక కారణం ఉంటుందని కొంతమంది నమ్మితే.. మన ప్రమేయం లేకుండా ఏదీ జరగదని మరికొంతమంది అనుకుంటారు.

నిజానికి డెస్టినీ ఒక అద్భుతమైన , అంతు చిక్కని మహాకావ్యం వంటిదంటారు దీనిని నమ్మేవాళ్లు. దానికి తగినట్లే మనం ఈ భూమి మీద ఎవరెక్కడ పుట్టాలి , ఎవరింట్లో పుట్టాలి, మన రూపం ఎలా ఉండాలనే విషయాల దగ్గర నుంచే డెస్టినీ(Destiny) తన పనిని తాను చేసుకుపోతుంది. వీటికి మన ప్రయత్నంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయంటే, జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీలను మనకు తెలియకుండానే మన గురించి ఎవరో రాసేశారని అర్థం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు.

డెస్టినీ (Destiny) అంటే ఒక శక్తివంతమైన ప్రవాహం కాబట్టే.. ఆ ప్రవాహం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తుంది. కొన్నిసార్లు మనం ఒక దారిలో వెళ్లాలని అనుకుంటాం, కానీ ఏ మాత్రం ఊహించనట్టుగా పరిస్థితులు మనల్ని మరో దారి వైపు నెట్టేస్తాయి.

అక్కడ ఊహించని వ్యక్తులు పరిచయమవడం, అసలు ఏమాత్రం అనుకోని అవకాశాలు తలుపు తట్టడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది కేవలం యాదృచ్ఛికంగా జరగలేదు..ఇది ముందే నిర్ణయించబడింది అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మన చేతుల్లో ఏమీ లేదని తెలిసినప్పుడు కలిగే ఆ భావనలోనే డెస్టినీ అసలు స్వరూపం కనిపిస్తుంది.

చాలా మంది జీవితాల్లో కొన్ని అద్భుతాలు చాలా తక్కువ సమయంలోనే జరుగుతూ ఉంటాయి. ఏ అర్హతా లేకపోయినా, ఎలాంటి పునాది లేకపోయినా కొందరికి అపారమైన అంతస్తు, హోదా,పలుకుబడి దక్కుతాయి. అలాగే మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం చివరి నిమిషంలో వారి నుంచి చేజారిపోతుంది.

ఇక్కడ ప్రయత్నం కంటే సమయం, అదృష్టం అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమయం రానంత వరకు ఏదీ కూడా మన దగ్గరకు రాదు. అదే కనుక మనకు రాసి పెట్టి ఉన్నప్పుడు ఏ శక్తీ దానిని ఆపలేదు. అందుకే కావాలనుకున్నది రాసి పెట్టి లేకపోతే అది నీడలా తప్పించుకుంటూనే ఉంటుంది..అదే రాసి పెట్టి ఉంటే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుందనే మాట పుట్టింది.

Destiny

మొత్తంగా డెస్టినీ అనేది ఒక రకమైన పీస్ ఫుల్ నెస్. మన జీవితంలో జరిగే ప్రతీ మంచి వెనుక, ప్రతీ చెడు వెనుక ఒక సీక్రెట్ రీజన్ ఉందనే నమ్మకం మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. జరగాల్సింది జరుగుతుంది, దక్కాల్సింది దక్కుతుందనే భావన మనకు ఒక రకమైన మెంటల్ స్టెబిలిటీని ఇస్తుంది.

మనకు తెలియని ఒక హయ్యర్ పవర్ మనల్ని నడిపిస్తోందని నమ్మడం వల్ల, ఈ లోకంలో మనం ఒంటరి వాళ్లం కాదనే ధైర్యం మనకు మనమీద కలుగుతుంది. మొత్తంగా డెస్టినీ అనేది ఒక తీరం. మనం ఎక్కడికి వెళ్లాలో తెలిసిన ఆ తీరం ముందే సిద్ధంగా ఉంటుంది.

LSG vs KKR : లక్నో గెలుపు బాట పట్టేనా ?..కోల్ కతాతో డూ ఆర్ డై

Exit mobile version